E-Paper
Advertisement

అద్దె ఇంట్లో ఏసీలు, గీజర్లు పెట్టొచ్చా? యజమాని అనుమతి లేకుండా.. చేయగలిగే మార్పులివే!

అద్దె ఇంట్లో ఏసీలు, గీజర్లు పెట్టొచ్చా? యజమాని అనుమతి లేకుండా.. చేయగలిగే మార్పులివే!
Advertisement

Tenant Rights: సాధారణంగా తాము నివసిస్తున్న ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ విషయంలో సొంతిల్లు గలవారికి ఉన్న స్వేచ్ఛ అద్దెకు ఉండేవారికి ఉండదు. కిరాయి ఇంట్లో ఏ మార్పు చేయాలన్నా ఓనర్ అనుమతి తప్పనిసరి. అయితే కొందరు ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఇంటి యజమాని పర్మిషన్ లేకుండానే కొన్ని మార్పులు చేస్తుంటారు. దీనివల్ల కొన్నిసార్లు చిక్కులు కొనితెచ్చుకుంటూ ఉంటారు. అయితే చట్ట ప్రకారం అద్దెదారులు ఇంట్లో ఎలాంటి మార్పులు చేయవచ్చు? ఏవి చేయకూడదు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

గోడకు టీవీలు, ఏసీలు ఫిక్స్ చేయవచ్చా?

1882 నాటి ఆస్తి బదిలి చట్టం.. అద్దెదారులకు సంబంధించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతలను నిర్దేశించింది. అద్దె ఇంట్లో నివసించేవారు చేయాల్సిన, చేయకూడని పనులను గురించి స్పష్టంగా తెలియజేస్తోంది. సెక్షన్ 108(h) ప్రకారం అద్దె దారులు లేదా కౌలు దారులు.. తాము ఉంటున్న ఇంట్లో తాత్కాలిక మార్పులు చేసేందుకు చట్టం అనుమతిస్తోంది. ఉదాహరణకు గోడకు టీవీని అమర్చడం, ఏసీలు పెట్టడం, వాటర్ ప్యూరిఫైయర్లు, గీజర్లు, చిన్న చిన్న ఫొటో ఫ్రేముల కోసం గోడకు మేకులు కొట్టడం వంటి వాటిని తాత్కాలిక మార్పుల కింద పరిగణిస్తారు. అలాగే గోప్యత కోసం కర్టెన్లను ఏర్పాటు చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది.

అలంకరణ కోసం..

Advertisement

పైన పేర్కొన్న వాటితో పాటు అద్దె ఇంట్లో అలంకరణ కోసం కూడా కొన్ని మార్పులు చేసుకునేందుకు ‘ఆస్తి బదిలి చట్టం – 1882’ వీలు కల్పిస్తోంది. గోడ గడియారాలు, అద్దాలు, వాల్ స్టిక్కర్లు, వాల్ పేపర్లు తదితర వస్తువులను అద్దె ఇంట్లో పెట్టుకునేందుకు ఈ చట్టం అనుమతి ఇస్తోంది. అలాగే చెక్క, గాజుతో చేసిన తాత్కాలిక గోడలాంటి నిర్మాణాలను సైతం అద్దెంటి వారు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే గోడకు ఉన్న అదే రంగు పెయింటింగ్ ను వేయడం వంటివి తాత్కాలిక మార్పుగా చట్టం పరిగణిస్తోంది.

యజమాని అనుమతి తప్పనిసరి

అద్దె ఇంట్లో చేయకూడని కొన్ని మార్పుల గురించి కూడా 1882 నాటి చట్టం క్లారిటీ ఇచ్చింది. ఇంటి రూపురేఖలను మార్చే పెద్ద మార్పులు చేయాలనుకున్నప్పుడు.. కచ్చితంగా యజమాని ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించింది. ఇంటికి ఉన్న రంగు కాకుండా మరో కలర్ పెయింట్ వేయడం, గోడ ప్లాస్టరింగ్‌ను పాడుచేసే వాల్‌పేపర్లు అంటించడం, కిచెన్ రూపురేఖలు, బాత్‌రూమ్ ఫిట్టింగ్స్, ఫ్లోరింగ్ మార్చడం వంటి వాటికి తప్పనిసరిగా యజమాని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ.14,000 తగ్గింపు!

చట్టపరమైన ఇబ్బందులు?

యజమాని అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఇంట్లో భారీ మార్పులు చేస్తే.. అది ‘రెంట్ కంట్రోల్ యాక్ట్’ లోని లీజు ఒప్పంద ఉల్లంఘనకు దారి తీయవచ్చు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు గోడలకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ నుంచి డబ్బును మినహాయించుకునేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గడువు కంటే ముందే ఇల్లు ఖాళీ చేయమని కోరే చట్టపరమైన హక్కు సైతం యజమానికి కల్పిస్తోంది. ఇంటి నిర్మాణానికి లేదా గోడలకు శాశ్వత నష్టం వాటిల్లితే యజమాని కోర్టును ఆశ్రయించి నష్టపరిహారం కోరే హక్కు ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Also Read: ఒకే ఒక్క రీచార్జ్.. ఏడాది మొత్తం ఫ్రీ 5G, కాల్స్, ఓటీటీ.. జియో దుమ్మురేపే ప్లాన్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×