E-Paper
Advertisement

BSNL మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఏకంగా 150 రోజుల పాటు.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

BSNL మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఏకంగా 150 రోజుల పాటు.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!
Advertisement

BSNL Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన యూజర్లకు తక్కువ ధరకే మెరుగైన ప్రయోజనాలను అందిస్తోంది. దిగ్గజ ప్రైవేటు సంస్థలైన ఎయిర్ టెల్, జియో, వీఐకు గట్టి పోటీ ఇస్తూ.. తక్కువ ఖర్చులో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలోనే జియో తీసుకొచ్చిన రూ. 997 ప్లాన్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ ప్లాన్ ప్రయోజనాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

రూ. 997 ప్లాన్ ప్రయోజనాలు

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను 150 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే ప్రతీ రోజూ 2GB హై స్పీడ్ డేటాను పొందవచ్చు. ప్లాన్ పూర్తయ్యే సమయానికి 300GB యూజర్ కు లభిస్తుంది. డేటా లిమిట్ అయిపోతే 40Kbps స్పీడ్ తో అపరిమిత డేటాను వాడుకోవచ్చు. అదే విధంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ (Unlimited Voice Calls), రోజుకు 100 ఎస్ఎంఎస్ లను చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనాల కింద లోక్‌ధున్ కంటెంట్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి సేవలు కూడా వినియోగించుకోవచ్చు.

రూ. 397 ప్లాన్

Advertisement

వాస్తవానికి బీఎస్ఎన్ఎల్ 150 రోజుల వ్యాలిడిటీతో మరో బడ్జెట్ ప్లాన్ ను సైతం యూజర్లకు అందుబాటులో ఉంచింది. తక్కువ ధరకు ఎక్కువ రోజులు సిమ్ కార్డ్‌ని యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే తొలి 30 రోజులు మాత్రమే ప్రతీ రోజూ 2GB హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. 30 రోజుల తర్వాత కాల్స్, డేటా కావాలంటే చిన్న టాపప్ లేదా డేటా వోచర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 150 రోజుల వరకూ ఇన్ కమింగ్ కాల్స్ కోసం సిమ్ యాక్టివ్ గానే ఉండనుంది.

Also Read: Bosch AC: భారత ఏసీ మార్కెట్‌లో సంచలనం.. రంగంలోకి జర్మన్ కంపెనీ.. ఆసియాలోనే ఫస్ట్ టైమ్!

ఏ ప్లాన్ ఎంచుకుంటే బెటర్?

Advertisement

ప్రతిరోజూ 2GB డేటా, అపరిమిత కాలింగ్.. 150 రోజుల పాటు కావాలనుకుంటే రూ. 997 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అలా కాకుండా కేవలం సిమ్ యాక్టివ్‌గా ఉండి.. మొదటి నెల మాత్రం ఆఫర్లు కావాలనుకుంటే రూ. 397 ప్లాన్ ఎంచుకోవచ్చు.

Also Read: Smartphones 2026: మిడ్ రేంజ్ బడ్జెట్లో.. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ప్రీమియం రేంజ్ ఫీచర్లు భయ్యా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×