// // BSNL సంచలనం.. రూ. 897 కే 6 నెలల వ్యాలిడిటీ.. ప్లాన్‌ అదరహో! -->
E-Paper
Advertisement

BSNL మరో సంచలనం.. రూ. 897 కే 6 నెలల వ్యాలిడిటీ.. ఈ ప్లాన్‌ ఎంత బాగుందో..!

BSNL మరో సంచలనం.. రూ. 897 కే 6 నెలల వ్యాలిడిటీ.. ఈ ప్లాన్‌ ఎంత బాగుందో..!
Advertisement

BSNL Rs 897 Plan: టెలికాం రంగంలో పోటీ ఎంత పెరిగినా BSNL మాత్రం తన యూజర్ల కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తూనే ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఒక సాలిడ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. అదే BSNL రూ. 897 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలు, దీనిని రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.897 ప్లాన్ వివరాలు..

BSNL ఈ ప్లాన్ ను ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారి కోసం తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు ఏకంగా 180 రోజుల (సుమారు 6 నెలలు) వ్యాలిడిటీ లభించనుంది. బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ప్లాన్ గడువు ముగిసేవరకూ దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కు అయినా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం పంపుకోవచ్చు. ఇక ప్లాన్ మెుత్తానికి 90GB డేటా యూజర్లకు లభించనుంది. డేటా లిమిట్ అయిపోతే 40 Kbps వేగంతో ఇంటర్నెట్ ను నాన్ స్టాప్ గా వాడుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

Advertisement

ఈ ప్లాన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే డేటాపై రోజువారీ పరిమితి (Daily Limit) లేకపోవడం. సాధారణ ప్లాన్లలో రోజుకు 1.5GB లేదా 2GB అని లిమిట్ ఉంటుంది. కానీ ఇందులో ఉన్న 90 GB డేటాను 180 రోజుల్లో మీ ఇష్టం వచ్చినట్లు, అవసరాన్ని బట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇతర ప్లాన్ల తరహాలో మిగిలిన రోజూవారీ డేటా ఆవిరవుతుందన్న భయం ఇందులో ఉండదు.

ఈ ప్లాన్ ఎవరికి బెనిఫిట్?

నెలా నెలా రీఛార్జ్ చేసుకునే గోల వద్దనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ రూ.897 ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అలాగే సెకండరీ సిమ్ గా బీఎస్ఎన్ఎల్ వాడుతూ ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉండాలని భావించేవారికి కూడా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక ఇంట్లో వైఫై ఉండి డేటాతో పెద్దగా అవసరం లేనివారు కూడా ఈ ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రయోజనకరంగా ఉండనుంది.

Advertisement

Also Read: వీఐ గుడ్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్ స్టార్!

ఎలా రీఛార్జ్ చేయాలి?

ఈ ప్లాన్‌ను సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్‌లోని ‘బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్’ లేదా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ (portal.bsnl.in) లోకి వెళ్లి మీ నంబర్‌ను ఎంటర్ చేసి నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి యూపీఐ యాప్‌లలోని రీఛార్జ్ విభాగం ద్వారా కూడా ఈ రూ. 897 ప్లాన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రీఛార్జ్ పై అవగాహన లేనివారు.. సమీపంలోని BSNL కస్టమర్ కేర్ సెంటర్, రిటైల్ షాప్‌కు వెళ్లి కూడా ప్లాన్ ను పొందొచ్చు.

Also Read: జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×