E-Paper
Advertisement

BSNL మరో చౌకైన ప్లాన్.. ప్రతిరోజూ 2.5 GB డేటా, అపరిమిత కాల్స్.. ఫ్రీగా BiTV కంటెంట్!

BSNL మరో చౌకైన ప్లాన్.. ప్రతిరోజూ 2.5 GB డేటా, అపరిమిత కాల్స్.. ఫ్రీగా BiTV కంటెంట్!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలో.. అద్భుతమైన ప్రయోజనాలను తన యూజర్లకు అందిస్తుంటుంది. ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్స్ ను అందిస్తుందన్న పేరు మార్కెట్ లో ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఓ మంత్లీ ప్లాన్.. ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ ప్లాన్ వాల్యూ ఎంత? దాన్ని రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు? ఆ ప్లాన్ ను ఏ విధంగా పొందాలి? వంటి వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

ప్లాన్ ధర ఎంతంటే?

బీఎన్ఎన్ఎల్ ఈ క్రేజీ మంత్లీ ప్లాన్ ధరను రూ.225 గా నిర్ణయించింది. తన సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా లాంచ్ చేసింది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ కింద.. రోజుకు రూ.7.5 భారం పడుతుంది. దీని ద్వారా ప్రతిరోజు 2.5 GB హైస్పీడ్ డేటా యూజర్ కు లభిస్తుంది. డేటా పరిమితి ముగిశాక 40 Kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100SMSలు సైతం యూజర్ కు లభిస్తాయి.

అదనపు ప్రయోజనాలు

Advertisement

ఈ ప్లాన్‌తో కేవలం డేటా, కాల్స్ మాత్రమే కాకుండా మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. BSNL Tunesను ద్వారా ఉచితంగా కాలర్ ట్యూన్స్‌ను సెట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్లాన్ కింద BiTV (BSNL TV)కి ఉచిత యాక్సెస్ ను సైతం అందిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పండుగ సమయాల్లో ఇదే ప్లాన్‌పై రోజుకు 3 GB వరకు డేటాను కూడా బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది.

ఎవరికి ఉపయోగం?

రూ.225 ప్లాన్.. ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. యూట్యూబ్, ఓటీటీ స్ట్రీమింగ్, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు రోజువారీ 2.5 GB డేటా సరిపోతుంది. మంత్లీ ప్లాన్ మాత్రమే రీఛార్జ్ చేసుకునేవారికి సైతం ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. జియో, ఎయిర్ టెల్ సంస్థలతో పోలిస్తే.. ఇంత తక్కువ ధరకు అన్ని ప్రయోజనాలు ఇచ్చే ప్లాన్ ఇదే కావడం విశేషం.

Advertisement

Also Read: Onion Heatstroke: జేబులో ఉల్లిగడ్డ ఉంటే.. వడదెబ్బ తగలదట.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో రచ్చ రచ్చ!

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

మీరు ఈ ప్లాన్‌ను అనేక మార్గాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో BSNL యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయి నేరుగా రీఛార్జ్ చేయవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్స్ లో మెుబైల్ రీఛార్జ్ విభాగంలోకి వెళ్లి ప్లాన్ ను పొందొచ్చు. లేదంటే నేరుగా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ఈ ప్లాన్ ను దక్కించుకోవచ్చు.

Also Read: బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్‌లు.. సాధారణ వాటితో పోలిస్తే.. వీటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×