E-Paper
Advertisement

BSNL మరో దుమ్మురేపే ప్లాన్.. 700GB డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ.. 6 నెలలు పండగే!

BSNL మరో దుమ్మురేపే ప్లాన్.. 700GB డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ.. 6 నెలలు పండగే!
Advertisement

BSNL Broadband: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్రాండ్ యూజర్ల కోసం మరో చౌకైనా ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. కేవలం రూ.1449 ధరకే 6 నెలల పాటు హైస్పీడ్ డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. ఒక నెలలో రూ.1000 వరకు ఖర్చయ్యే సేవలను సగటున రూ.241 బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ లో అందిస్తుండటం విశేషం. ఇంతకీ బ్రాడ్ బాండ్ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? దీని వల్ల యూజర్లకు ఎలాంటి లాభం కలగనుంది? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూ.1449 ప్లాన్ వివరాలు..

ముందుగా చెప్పుకున్నట్లే బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను 6 నెలల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 25 Mbps వేగంతో 700GB వరకూ హైస్పీడ్ డేటా లభించనుంది. డేటా లిమిట్ అయిపోయిన పక్షంలో ఇంటర్నెట్ వేగం 2Mbpsకి పడిపోతుంది. ఆ స్పీడ్ తోనే అపరిమితంగా డేటాను వాడుకోవచ్చు. వాట్సప్ చాటింగ్, ఆన్ లైన్ పేమెంట్స్ కు ఈ స్పీడ్ సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

ఫ్రీ కాల్స్, ఓటీటీ కంటెంట్..

Advertisement

ఈ బ్రాడ్ బాండ్ ప్లాన్ కింద ఫ్రీ కాల్స్ ను సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. దేశంలోని ఏ నెట్ వర్క్ కైనా ఫ్రీగా లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునే వెసులుబాటును తన కస్టమర్లకు కల్పిస్తోంది. అదే సమయంలో అదనపు బెనిఫిట్స్ కింద ప్రసార్ భారతి ప్రీమియం కంటెంట్ ను వీక్షించే వెసులుబాటును అందిస్తోంది. కాబట్టి బీఎస్ఎన్ఎల్ అందించే ఈ కంటెంట్ ను యూజర్లకు ఫ్రీగా వీక్షించవచ్చు.

Also Read: కెనడాలోనూ ఉన్మాదమే.. ప్రేయసిని చంపిన ఇండియన్ ప్రియుడు.. ఏం జరిగిందంటే?

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

రూ.1449 బ్రాడ్ బాండ్ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ పలు మార్గాలను కస్టమర్ల ముందు ఉంచింది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ఓపెన్ చేసి.. రిజిస్టర్డ్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఈ ప్లాన్ పొందొచ్చు. లేదంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి థర్డ్ పార్టీ యాప్స్ లోనూ రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్లి ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. అది కూడా కుదరని పక్షంలో బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ఈ ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు.

Also Read:  అస్సాం ప్రజలకు అండగా ఏపీ.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×