E-Paper
Advertisement

BSNL Recharge Plans: రోజుకు 2GB డేటా.. BSNL నుంచి రెండు క్రేజీ ప్లాన్స్!

BSNL Recharge Plans: రోజుకు 2GB డేటా.. BSNL నుంచి రెండు క్రేజీ ప్లాన్స్!
Advertisement

BSNL New Recharge Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. ప్రైవేట్ కంపెనీలను తలదన్నేలా సరికొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తాజాగా రూ. 97, రూ. 365 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ను ప్రారంభించింది. మరోవైపు రూ. 1,999, రూ. 399 ప్లాన్లను కూడా అప్‌ డేట్ చేసింది. కొద్ది రోజుల క్రితం రూ. 997 ప్లాన్‌ ను కూడా ప్రారంభించింది. కంపెనీ ఇటీవల తన రూ. 1,699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అప్ డేట్ చేసింది. గతంలో దీని వ్యాలిడిటీ  365 రోజులు ఉండగా, ఇప్పుడు 425 రోజులకు పెంచింది.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్లాన్స్ ఇవే!

BSNL తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, కొత్త రూ. 365 ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు, అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్(ముంబై, ఢిల్లీ సర్కిల్‌లతో సహా) అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (PRBT) యాక్సెస్ కూడా ఉంది. రూ. 365 ప్లాన్ కు సంబంధించి అన్ని బండిల్ ప్రయోజనాలు 60 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. అయితే, ఈ ప్లాన్   చెల్లుబాటు 365 రోజులు. ఇంకా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని సర్కిల్‌లలో చెల్లుతుంది. రూ. 365 ప్లాన్‌తో పాటు, కంపెనీ రూ. 97 ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. ఈ ప్లాన్ 18 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలను అందిస్తుంది.

రూ. 399 ప్లాన్ అప్ డేట్ చేసిన BSNL

Advertisement

BSNL రూ. 399 ప్లాన్‌ను కూడా సవరించింది. వినియోగదారులు ఇప్పుడు 80 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా, 100 SMSలను పొందుతారు.  గతంలో, ఈ ప్లాన్ 74 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంది.

రూ. 1,999 ప్లాన్‌ను కూడా అప్ డేట్ చేసిన BSNL

అటు BSNL రూ. 1,999 ప్లాన్‌ ను కూడా అప్ డేట్ చేసింది. ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 3GB డేటాను అందిస్తుంది. 365 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌ లో SonyLiv కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది.  గతంలో, ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా ఇవ్వబడింది.

Advertisement

Read Also: అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా.. BSNL రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ మళ్లీ వచ్చింది!

మొత్తంగా కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్లాన్స్ తో పాటు అప్ డేట్ చేసిన ప్లాన్స్ తో కస్టమర్స్ బేస్ ను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా కొత్త కస్టమర్ల కోసం రూ. 1 ప్రీడమ్ ప్లాన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ తో కేవలం రూ. 1కే కొత్త సిమ్ తో పాటు 60 రోజులు 2 జీబీ డేటా, రోజుకు 100 SMSలు అందిస్తోంది.

Read Also: అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా.. BSNL రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ మళ్లీ వచ్చింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×