E-Paper
Advertisement

కేవలం రూ.1కే కొత్త సిమ్.. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్ల కంటే ఇదే తక్కువా? పూర్తి వివరాలివే!

కేవలం రూ.1కే కొత్త సిమ్.. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్ల కంటే ఇదే తక్కువా? పూర్తి వివరాలివే!
Advertisement

Cheapest Mobile Plans: నేటి ఈ ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. కాల్స్ మాట్లాడాలన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా, దూరంగా ఉన్న మన ప్రియమైన వారితో వీడియో కాల్స్ మాట్లాడాలన్నా.. ఆఖరికి మొబైల్ ఫోన్ చేతిలో లేకుండా చాలామంది మగవాళ్లు బాత్రూమ్‌కి కూడా వెళ్లడం లేదు. అంతలా మన జీవితాల్లో ముఖ్య భాగమైపోయింది ఈ స్మార్ట్‌ఫోన్.

ఫోన్ వాడాలంటే ఛార్జింగ్‌తో పాటు అందులో రీఛార్జ్ ప్లాన్ కూడా చాలా ముఖ్యం. అయితే రోజురోజుకూ పెరుగుతున్న రీఛార్జ్ ధరలు చూస్తుంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో కొత్త సిమ్ కార్డు పొందవచ్చని. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. మన ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఈ క్రేజీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఒక్క రూపాయి కథ ఏంటి? జియో, ఎయిర్‌టెల్ కంటే ఇది ఎలా బెటర్? అన్నది ఇప్పుడు చూద్దాం.

ఒక్క రూపాయికే కొత్త సిమ్..

Advertisement

మీ దగ్గర ఆల్రెడీ ఒక ప్రైమరీ నంబర్ ఉండి.. కేవలం ఇన్ కమింగ్ కాల్స్ కోసం లేదంటే రెండో సిమ్ కార్డు కోసం తక్కువలో ఏదైనా ఆప్షన్ కావాలని చూస్తుంటే ఇది మీకు బెస్ట్ ఛాన్స్. BSNL కేవలం రూ.1కే కొత్త సిమ్‌ను ఆఫర్ చేస్తోంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సిమ్ కావాలంటే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి కుదరదు. నేరుగా మీ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు గానీ, దగ్గర్లోని ఆథరైజ్డ్ అవుట్‌లెట్‌కు గానీ వెళ్లి KYC పూర్తి చేయాలి. మీరు సిమ్ తీసుకుని యాక్టివేట్ చేసిన రోజు నుండే దాని వ్యాలిడిటీ మొదలవుతుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: ఏంటీ.. వాట్సాప్‌తో టీవీని ఆపరేట్ చేయొచ్చా? బడా బ్రాండ్లకి చుక్కలు చూపిస్తున్న Lumio TV ఫీచర్లు!

జియో, ఎయిర్‌టెల్ సంగతేంటి?

Advertisement

ఇక ప్రైవేట్ నెట్‌వర్క్ దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్ విషయానికి వస్తే.. ఈ సంస్థలు సిమ్ కార్డును ఉచితంగానే ఇస్తున్నాయి కానీ, అసలు ఆట అంతా ఫస్ట్ రీఛార్జ్ దగ్గరే ఉంటుంది. జియో కొత్త సిమ్ తీసుకోవాలంటే కనీసం రూ.349తో స్టార్టర్ ప్యాక్ వేయించుకోవాలి. ఇందులో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా వస్తుంది. అటు ఎయిర్‌టెల్‌లో అయితే రూ.299 రీఛార్జ్ చేయాలి. దీనిలో కూడా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్స్ వస్తాయి. ఎయిర్‌టెల్ సంస్థ పెద్ద పెద్ద నగరాల్లో సిమ్‌ను ఇంటికే డెలివరీ చేసే సౌకర్యం కూడా కల్పిస్తోంది.

ఏ ప్లాన్ తీసుకోవడం బెటర్?

ఎక్కువ ఖర్చు వద్దు.. నెంబర్ యాక్టివ్‌గా ఉంటే చాలు అని అనుకుంటే మాత్రం కళ్లు మూసుకుని BSNL తీసుకోవచ్చు. ఎందుకంటే.. ప్రారంభంలో అయ్యే ఖర్చు అక్కడ చాలా తక్కువ. కానీ ఇంటర్నెట్ స్పీడ్ ముఖ్యం, సినిమా డౌన్‌లోడ్లు నిమిషాల్లో అవ్వాలి, 5G వాడుకోవాలి అని అనుకుంటే మాత్రం జియో లేదంటే ఎయిర్‌టెల్ బెస్ట్ ఆప్షన్స్. గ్రామీణ ప్రాంతాల్లో BSNL సిగ్నల్ బాగున్నా.. డేటా స్పీడ్ విషయంలో ప్రైవేట్ కంపెనీలు కొంచెం ముందున్నాయి. కాబట్టి.. మీ అవసరాన్ని బట్టి ఏది కావాలో మీరే డిసైడ్ అవ్వడం ఉత్తమం.

Also Read: నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకున్నా.. ఈ స్కోడా ‘డ్యూయోబెల్’ సౌండ్ వినిపించాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×