E-Paper
Advertisement

BSNL Learners Plan: కేవలం 2 రోజులే ఛాన్స్.. రూ.9కే అపరిమిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్ లెర్నర్స్ ఆఫర్ మిస్ కావొద్దు

BSNL Learners Plan: కేవలం 2 రోజులే ఛాన్స్.. రూ.9కే అపరిమిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్ లెర్నర్స్ ఆఫర్ మిస్ కావొద్దు
Advertisement

BSNL Learners Plan: బిఎస్‌ఎన్‌ఎల్ దేశ వ్యాప్తంగా బడ్జెట్ రీచార్జ్ ప్లాన్స్‌తో యూజర్లకు మంచి లాభాలు ఇస్తున్న టెలికాం కంపెనీగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఈ కంపెనీ, సమయానుకూలంగా ప్రత్యేక ఆఫర్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తూ విద్యార్థులు సహా సాధారణ వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తోంది. ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థుల కోసం తెచ్చిన ప్రత్యేక ఆఫర్‌ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఒకసారి రీచార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ కాలింగ్ నుంచి హై స్పీడ్ డేటా వరకు అన్నీ అందించే ఈ ఆఫర్‌ ఇప్పుడు కేవలం రెండు రోజుల్లో ముగియబోతోంది. అందుకే దీని గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం.

ప్లాన్ ఎన్ని రోజులు? 

Advertisement

బిఎస్‌ఎన్‌ఎల్ 251 లెర్నర్స్ ప్లాన్ ఈ మధ్య వచ్చిన బెస్ట్ బడ్జెట్ ఆఫర్స్‌లో ఒకటి. 251 రూపాయల ధరలో వచ్చిన ఈ ప్లాన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందుతుంది. నేషనల్ రోమింగ్ కూడా పూర్తిగా ఫ్రీ. ముఖ్యంగా డేటా వినియోగం విషయంలో విద్యార్థులకు గొప్ప అవకాశం ఇచ్చారు. మొత్తం 100 జీబీ హై స్పీడ్ డేటా ఇస్తూ, రోజువారీ నిబంధన ఏమీ పెట్టలేదు. అంటే రోజుకు ఎంత డేటా వాడినా అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే ప్రతిరోజు 100 smsలు కూడా ఫ్రీగా అందిస్తున్నారు.

Also Read: Best Gaming Consoles: తక్కువ ఖర్చుతో AAA గేమింగ్.. 2025లో కొనుగోలు చేయదగిన టాప్ 10 గేమింగ్ సిస్టమ్స్

Advertisement

ఎప్పటి వరకు ఆఫర్ అంటే..

ఈ ఆఫర్ ధరకు తగ్గట్టుగానే లాభాలు ఇస్తుండటం వలన ప్రైవేట్ కంపెనీల ప్లాన్స్‌తో పోలిస్తే ఇది చాలా ఆకర్షణీయంగా మారింది. అయితే ఈ లర్నర్స్ ప్లాన్‌కు బిఎస్‌ఎన్‌ఎల్ గడువు పెట్టింది. డిసెంబర్ 13, 2025 లోపు ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకున్న వారు మాత్రమే దీని ప్రయోజనాలను పొందగలరు. గడువు కేవలం రెండు రోజుల్లో ముగియబోతుండటంతో ఇది చివరి ఛాన్స్ అని చెప్పాలి.

ఏడాది ప్లాన్స్ ఎంత ఉందంటే?

ఏడాది ప్లాన్స్ వైపు చూస్తే బిఎస్‌ఎన్‌ఎల్ 365 రోజుల పాటు పనిచేసే 2399 రూపాయల ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, నేషనల్ రోమింగ్ ఫ్రీ, రోజుకు 2 జీబీ డేటా, 100smsలు అందుతాయి. అంతేకాక బిఎస్‌ఎన్‌ఎల్ త్వరలో 5 జీ సర్వీస్‌ను ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

1రూపాయి ఫ్రీడమ్ ప్లాన్

కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో పాపులర్ ఆఫర్‌ను కూడా తిరిగి తెచ్చింది. అదే 1రూపాయి ఫ్రీడమ్ ప్లాన్. కేవలం 1 రూపాయిలో 30 రోజుల పాటు ఫ్రీ కాలింగ్, డేటా ప్రయోజనాలు అందించడంతో ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ పొందింది. బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్ కోసం చూస్తున్న వారికి బిఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్స్ మళ్లీ ఆకర్షణీయంగా మారాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×