E-Paper
Advertisement

BSNL – Sanchar Mitra: సరికొత్తగా BSNL సంచార్ మిత్ర యాప్.. ఇక మీ కేవైసీ వివరాలన్నీ సేఫ్, ఎలాగంటే?

BSNL – Sanchar Mitra: సరికొత్తగా BSNL సంచార్ మిత్ర యాప్.. ఇక మీ కేవైసీ వివరాలన్నీ సేఫ్, ఎలాగంటే?
Advertisement

BSNL – Sanchar Mitra: దేశవ్యాప్తంగా కస్టమర్ సేవలను మరింత వేగవంతంగా, సుస్థిరంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆధారిత పాత వ్యవస్థలో ఎదురైన సాంకేతిక అంతరాయాలకు పరిష్కారంగా, సంస్థ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కొత్త మొబైల్ అప్లికేషన్ ‘సంచార్ మిత్ర’ను అధికారికంగా ప్రారంభించింది.

SIM రిజిస్ట్రేషన్‌కు కొత్త ప్లాట్‌ఫామ్:

ఈ యాప్‌ను ముఖ్యంగా కొత్త కస్టమర్ ఆన్‌బోర్డింగ్, SIM కార్డ్ జారీ, రీప్లేస్‌మెంట్ ప్రక్రియలను మరింత సులభంగా, వేగంగా నిర్వహించేందుకు అభివృద్ధి చేశారు. ఆధార్ ఆధారిత e-KYC ద్వారా కస్టమర్ గుర్తింపు ప్రక్రియను ఈ యాప్ మరింత భద్రంగా పూర్తి చేయగలుగుతుందని సంస్థ వెల్లడించింది. ఇక నుంచి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది. దీంతో సిమ్ యాక్టివేషన్ వంటి ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా, సమయాన్ని ఆదా చేసేలా చేస్తుంది.

ఆ ఒప్పందం ముగియడంతో:

Advertisement

ఇంతకు ముందు BSNLలో కస్టమర్ నమోదు కోసం ఉపయోగించిన ‘సంచార్ ఆధార్’ యాప్‌ను ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసింది. అయితే, ఆ సంస్థతో ఉన్న ఒప్పందం గడువు ముగియడంతో, దేశవ్యాప్తంగా కొత్త SIMలు, రీప్లేస్‌మెంట్ SIMల జారీ ప్రక్రియలో తాత్కాలిక సమస్యలు తలెత్తాయి.

BSNL ఇన్-హౌస్ పరిష్కారం:

ఈ సంచార్ మిత్ర యాప్‌ను BSNL ఇంజినీర్లే అత్యవసర పరిస్థితుల్లో అభివృద్ధి చేశారు. దీంతో ప్రైవేట్ వెండర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, డేటా భద్రత, సిస్టమ్ నియంత్రణ పూర్తిగా BSNL చేతుల్లోకి వచ్చింది.  ప్రస్తుతం ఈ యాప్ కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందని సంస్థ తెలిపింది.

విదేశీ సంస్థలపై ఆధారపడకుండా..

Advertisement

స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ యాప్ ద్వారా, బయటి సంస్థలపై ఆధారపడకుండా కీలక సేవలను కొనసాగించాలనే దిశగా BSNL ముందడుగు వేసింది. భవిష్యత్తులో కస్టమర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సాఫీగా, అంతరాయం లేకుండా సాగుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

అయితే ఈ సంచార్ మిత్ర యాప్‌ను రిటైలర్లు, ఫ్రాంచైజీల కోసం మాత్రమే రూపొందించారు. కస్టమర్లకు నేరుగా రీఛార్జ్ చేయడం లేదా బిల్లులు చెల్లించడం వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో లేవు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×