E-Paper
Advertisement

కనీ వినీ ఎరుగని ఆఫర్.. 70 రోజుల పాటు రోజూ 3GB డేటా.. BSNL కొత్త ప్లాన్ చూశారా?

కనీ వినీ ఎరుగని ఆఫర్.. 70 రోజుల పాటు రోజూ 3GB డేటా.. BSNL కొత్త ప్లాన్ చూశారా?
Advertisement

BSNL 599 Prepaid Plan: టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ధరల మోతకు చెక్ పెడుతూ.. సామాన్యులకు మరింత చేరువయ్యేలా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారీ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం కేవలం రూ.599లకే అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ, 5G సేవలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఆఫర్ రావడం విశేషం.

రూ.599 ప్లాన్ ప్రత్యేకతలు:

ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఏకంగా 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు.. ప్రతిరోజూ 3GB చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గానూ 210GB హైస్పీడ్ డేటాను వాడుకోవచ్చు. సోషల్ మీడియా బ్రౌజింగ్, ఓటిటి (OTT) సినిమాలు చూడటం, ఆన్‌లైన్ గేమింగ్ ఆడేవారికి ఈ ప్లాన్ బాగా కలిసొస్తుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉచిత అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం కూడా లభిస్తాయి.

Advertisement

Also Read: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. కేవలం రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. యూజర్లకు పండగే!

తక్కువ బడ్జెట్‌లో రూ.51 ప్లాన్:

రూ.599 ప్లాన్ ధర ఎక్కువ అనుకునే వారి కోసం BSNL మరో చౌకైన ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.51కే లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. నెల రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, నేషనల్ రోమింగ్ సౌకర్యాలు లభిస్తాయి. కొత్తగా బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి మారాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.

అందరికీ అందుబాటులో కనెక్టివిటీ:

Advertisement

పెద్ద పెద్ద టెలికాం ఆపరేటర్లకు గట్టి పోటీ ఇస్తూ.. అందరికీ అందుబాటులో ఉండే నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. ఎక్కువ వ్యాలిడిటీ, భారీ డేటా, మెరుగైన కవరేజీని అందిస్తున్న ఈ కొత్త ప్లాన్స్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను పొందొచ్చు. బడ్జెట్ ధరలో మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ప్రస్తుతం BSNL బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

Also Read: అల్టిమేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Honor X80 రెడీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×