E-Paper
Advertisement

New Zealand: న్యూజిలాండ్ గగనతలంలో కళ్లు జిగేల్ అనిపించిన వెలుగు రేఖ, ఇంతకీ ఏంటది?

New Zealand: న్యూజిలాండ్ గగనతలంలో కళ్లు జిగేల్ అనిపించిన వెలుగు రేఖ, ఇంతకీ ఏంటది?
Advertisement

ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఫ్లాష్ మ్యాన్ గురించే వింటున్నాం. మెరుపు కంటే వేగంగా వచ్చి.. తట్టేసి వెళ్లిపోయే ఈ బూతు వీరుడు.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అయితే, ఇప్పుడు అతడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. న్యూజిలాండ్ గగనతలంలో ఓ తెల్లని కాంతిపుంజం.. సర్రునా ఎగురుతూ మాయమైంది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బహుశా అది ఫ్లాష్ మ్యాన్ కావచ్చని కొందరు జోకులు వేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. అది అసలు ఏమిటనేది పరిశోధకులకు కూడా అంతుబట్టలేదు. అది ఉల్క కావచ్చని మొదట్లో అంతా భావించారు. కానీ, అది నేలపై పడిన జాడ లేదు. ఇంతకీ అదేంటీ?

ఆకాశం నుంచి నేరుగా.. తెల్లని కాంతితో..

సినిమాల్లో దేవతలు భూమి పైకి దిగి వచ్చేప్పుడు.. ఒక విధమైన వెలుతురు పెడతారు. సేమ్ అదే తరహాలో న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఓ తెల్లని వెలుతురు ఆకాశం నుంచి నేలవైపు దూసుకొచ్చింది. అది ఏమిటోనని తెలుసుకొనే లోపే మయామైంది. కొందరు దీన్ని తమ మొబైల్ కెమేరాలతో రికార్డు చేశారు. కానీ, అంత స్పష్టంగా కనిపించలేదు. అయితే.. హెరెటౌంగా బోటింగ్ క్లబ్‌లో ఉన్న ఓ సిసీటీవీ కెమేరాలో స్పష్టంగా రికార్డయ్యింది. అదేదో ఏఐ వీడియో కావచ్చని కొందరు భావించినా.. అక్కడి సరస్సులో కూడా ఆ వెలుగు చాలా స్పష్టంగా కనిపించింది. జనాలు కూడా దాన్ని ప్రత్యక్షంగా చూశామని చెప్పారు.

ఇంతకీ అదేమిటీ?

Advertisement

ఏదైనా మండే వస్తువైతే ఆరెంజ్, పసుపు రంగుల్లో కూడా కనిపించాలి. పోనీ ఏదైనా ఫ్లైట్, హెలికాప్టరా అంటే.. దానికి కూడా అవకాశం లేదు. వాటి లైట్లు అంత బ్రైట్‌గా ఉండవు. పైగా ఆ లైట్ కొన్ని సెకన్లు మాత్రమే కనిపించి మాయమైంది. BBC కథనం ప్రకారం.. వెల్లింగ్టన్‌లోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆ మెరుపును అదే సమయానికి చూసినట్లు చెబుతున్నారు. కాబట్టి.. స్పేస్ క్రాఫ్ట్ అన్ని చోట్ల ఒకే టైమ్‌కు కనిపించే అవకాశం లేదు. అయితే, అది ఉల్క కావచ్చు.. లేదా అంతరిక్షంలోని వ్యర్థాలు (Space Debris) కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. అది భూమి వాతావారణంలోకి వస్తూనే మండిపోయి మాయమైపోతాయి. ఉల్క సైజు పెద్దది అయితేనే భూమికి చేరుకుంటుంది. అయితే, ఆ టైమ్‌లో ఏదీ భూమిని తాకిన ఆధారాలు లేవు.

అంతరిక్షంలో అంతా చెత్తే…

ప్రస్తుతం అంతరిక్షంలో సుమారు 6 వేలకు పైగా శాటిలైట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని కాలం చెల్లాయి. దీంతో అవి క్రమేనా వ్యర్థాలుగా మారుతున్నాయి. వాటిలో కొన్ని కక్ష్యను కోల్పోయి భూమి వైపుకు వస్తున్నాయి. అవి ఎప్పుడు ఎక్కడ భూమిని తాకుతాయో తెలీదు. న్యూజిలాండ్‌లో కనిపించినవి కూడా అదే కావచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ భూమి.. విశ్వం చిత్రమైనవి. భవిష్యత్తులో మనం ఇంకా చాలా వింతలే చూడాల్సి రావచ్చు. కాలం గడిచేకొద్ది.. భూమితో సహా విశ్వంలోని గ్రహాలన్నీ ఊహించని మార్పులకు గురవ్వుతాయి. ఇప్పటికే సూర్యుడిలో భయానకమైన మార్పులు కనిపిస్తున్నాయి. అవి భవిష్యత్తులో మన ఇంటర్నెట్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి.. వీటిని మనం హెచ్చరికలా తీసుకుని, అప్రమత్తంగా ఉండటమే ఉత్తమం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×