E-Paper
Advertisement

ఈ ఒక్క స్పీకర్ చాలు.. ఇంటిని థియేటర్ చేసేయచ్చు.. వీధి చివరి వరకూ మోతమోగాల్సిందే!

ఈ ఒక్క స్పీకర్ చాలు.. ఇంటిని థియేటర్ చేసేయచ్చు.. వీధి చివరి వరకూ మోతమోగాల్సిందే!
Advertisement

Bose Speaker: ప్రస్తుతం మార్కెట్ లో చాలా కంపెనీలకు చెందిన స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బోస్ కంపెనీకి చెందిన స్పీకర్స్ కు మ్యూజిక్ లవర్స్ లో మంచి గుడ్ విల్ ఉంది. నాణ్యవంతమైన మ్యూజిక్ కు ఈ స్పీకర్లు ప్రాముఖ్యత సంపాదించాయి. అయితే బోస్ కంపెనీకి చెందిన ఓ స్పీకర్.. హైలెట్ గా నిలుస్తోంది. దాని ధర ఏకంగా రూ.38,900. ఇంతకీ ఈ స్పీకర్ ప్రత్యేకతలు ఏంటి? దీనిని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

360 డిగ్రీల సౌండ్ టెక్నాలజీ

బోస్ స్పీకర్ లోని హైలెట్ ఫీచర్ గా దీనిని చెప్పవచ్చు. ఇది 360 డిగ్రీలు సమానంగా మ్యూజిక్ ను ప్రసారం చేస్తుంది. కాబట్టి గదిలో ఏ డైరెక్షన్ లో పెట్టి మ్యూజిక్ ఆన్ చేసినా.. ప్రతీ మూలకు ధ్వని చేరుతుంది. ఇది చాలా బేస్ తో మ్యూజిక్ ను అందించడం వల్ల పబ్ లో ఉన్న ఫీలింగ్ ను యూజర్లు పొందవచ్చు.

వై-ఫై కనెక్టివిటీ

Advertisement

ఇది బ్లూటూత్ తోనే కాకుండా Wi-Fi ద్వారా కూడా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు Wi-Fi ద్వారా క్లౌడ్ మ్యూజిక్ సర్వీసెస్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. బయటకు వెళ్లినప్పుడు సాధారణ బ్లూటూత్ స్పీకర్‌లా వాడుకోవచ్చు.

వాయిస్ కంట్రోల్ సపోర్ట్

గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి వాయిస్ కంట్రోల్ ఫీచర్లు దీనిలో ఇన్ బిల్ట్ గా వస్తాయి. ఫలితంగా మీ వాయిస్ తోనే పాటలు మార్చడం, సౌండ్ లెవెల్స్ పెంచడం వంటివి చేసుకోవచ్చు. అంతేకాకుండా వార్తలు, క్లైమెట్ అప్డేట్స్ ను సైతం ఈ స్పీకర్ ను అడిగి తెలుసుకోవచ్చు.

చినుకులు పడినా.. నో ప్రొబ్లం!

Advertisement

ఈ స్పీకర్ కు IPX4 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు. కాబట్టి స్పీకర్ పై చినుకులు పడినా లేదా వంటగదిలో వాటర్ చిమ్మినా ఎలాంటి సమస్య ఉండదు. ఇది దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల చిన్న చిన్న దెబ్బలకు కూడా తట్టుకోలగదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: రియల్‌మీ నయా ఫోన్స్.. రేపే విడుదల.. ఫీచర్లు కెవ్వు కేక!

కొనడం వల్ల కలిగే లాభాలు

ఇది చిన్న సైజులో ఉండటం వల్ల ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీ ఉండటం వల్ల వైర్లతో పని లేకుండా ఎక్కడైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. వెకేషన్స్ కు కూడా మీతో పాటు తీసుకెళ్లి మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఇది సుమారు 12 గంటల వరకు నిరంతరాయంగా ప్లేబ్యాక్ అందిస్తుంది. దీనివల్ల లాంగ్ ట్రిప్స్, పార్టీలకు ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.

Also Read: భోజన ప్లేట్లు గుండ్రంగానే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక మిస్టరీ ఇదే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×