E-Paper
Advertisement

Boat Valour Ring 1: భారత్‌లో boAt వాలర్ రింగ్ 1 లాంచ్.. 15 రోజుల బ్యాటరీతో ప్రీమియం స్మార్ట్ రింగ్!

Boat Valour Ring 1: భారత్‌లో boAt వాలర్ రింగ్ 1 లాంచ్.. 15 రోజుల బ్యాటరీతో ప్రీమియం స్మార్ట్ రింగ్!
Advertisement

Boat Valour Ring 1: కరోనా తర్వాత ప్రతిఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రతి చిన్న విషయానికీ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన హెల్త్ కండీషన్‌ను మనమే తెలుసుకునే అవకాశం వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ల తర్వాత ఇప్పుడు స్మార్ట్ రింగ్‌లు కూడా అదే పనిని మరింత సింపుల్‌గా చేస్తున్నాయి. తాగాజా boAt భారత మార్కెట్‌లోకి ‘Valour Ring 1’ను లాంచ్ చేసింది. స్మార్ట్ వాచ్ ధరించలేని వారికి హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌ను ఈ చిన్న రింగ్ రూపంలో అందిస్తోంది.

ధర ఎంతంటే..

boAt కంపెనీ తీసుకొచ్చిన ఈ Valour Ring 1 ధర భారత మార్కెట్‌లో రూ.11,999గా ఉంది. ఈ స్మార్ట్ రింగ్‌ను ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాగే బోట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

అదనంగా హెల్త్ బెనిఫిట్స్ ప్యాకేజీ:

Advertisement

ఇక డిజైన్ పరంగా చూస్తే.. ఇది కార్బన్ బ్లాక్ మ్యాట్ ఫినిష్‌లో లభిస్తుంది. వినియోగదారుల సౌలభ్యం కోసం 7 నుంచి 12 వరకు రింగ్ సైజ్ ఆప్షన్లు ఉన్నాయి. సరైన సైజ్ ఎంపిక చేయడానికి ఇంటికే పంపే సైజింగ్ కిట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. రింగ్ కొనుగోలు చేసిన వారికి అదనంగా హెల్త్ బెనిఫిట్స్ ప్యాకేజీ లభిస్తుందని boAt వెల్లడించింది.

ఈ రింగ్ ప్రత్యేకత ఏమిటి?

Valour Ring 1 అనేది వాచ్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేలా రూపొందించిన రింగ్ ఆకార ఫిట్‌నెస్ ట్రాకర్. దీనిని ఒకసారి వేలికి ధరిస్తే.. ఎప్పటికప్పుడు మీ హెల్త్ కండీషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు పంపుతుంటుంది. దీంతోపాటు రోజంతా మీ ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. సుమారు 6 గ్రాముల బరువుతో తేలికగా ఉండే ఈ రింగ్.. రోజువారీ వినియోగంలో ఎలాంటి అసౌకర్యం కలిగించదు.

హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లు:

Advertisement

ఈ స్మార్ట్ రింగ్‌లో హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, HRV విశ్లేషణ, SpO₂ ట్రాకింగ్, అడుగుల లెక్కింపు, యాక్టివిటీ ట్రాకింగ్, బాడీ టెంపరేచర్ పర్యవేక్షణ, ఒత్తిడి స్థాయి అంచనా వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ మీ నిద్ర దశలను లోతుగా విశ్లేషించి, శరీరానికి విశ్రాంతి అవసరమైన సమయాన్ని కూడా సూచిస్తుంది.

40 స్పోర్ట్స్ మోడ్‌లు:

ఈ వాలర్ రింగ్ 1లో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి ఫీచర్లతో పాటు మొత్తం 40 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈ డేటా మొత్తాన్ని boAt Crest Companion యాప్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు. దీంతో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

15 రోజులు వాడుకోవచ్చు:

ఇక బ్యాటరీ విషయంలో కూడా ఈ రింగ్ ఎంతో మెరుగైనది. దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 15 రోజుల వరకు నాన్‌స్టాప్‌గా ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. దీంతో ఛార్జింగ్ టెన్షన్ లేకుండా దీర్ఘకాలం వినియోగించుకోవచ్చు. మొత్తానికి Valour Ring 1ను చిన్న సైజులోనే పూర్తి హెల్త్ ట్రాకింగ్ అనుభూతిని అందించే ఒక స్మార్ట్ గాడ్జెట్‌గా చెప్పొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×