E-Paper
Advertisement

పార్టీలకి బాస్ వచ్చేసాడు! 80W బేస్ ఎఫెక్ట్‌తో.. కొత్త బ్లూటూత్ స్పీకర్ రచ్చ!

పార్టీలకి బాస్ వచ్చేసాడు!  80W బేస్ ఎఫెక్ట్‌తో.. కొత్త బ్లూటూత్ స్పీకర్ రచ్చ!
Advertisement

boAt Stone 900 bluetooth speaker: ఈ రోజుల్లో చిన్న పార్టీ అయినా.. ఫ్రెండ్స్ గెట్-టుగెదర్ అయినా బ్యాక్‌గ్రౌండ్‌లో గట్టి మ్యూజిక్ ఉండాల్సిందే. అందుకే ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt మార్కెట్లోకి సరికొత్త boAt Stone 900 Bluetooth Speaker లాంచ్ చేసింది. అల్ట్రా-మ్యాసివ్ 80W సౌండ్ అవుట్‌పుట్ , పవర్‌ఫుల్ బేస్‌తో వచ్చే ఈ స్పీకర్, ఇండోర్ , అవుట్‌డోర్ పార్టీలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. లేటెస్ట్ ఫీచర్స్,ట్రెండీ లుక్, రీజనబుల్ ధరతో వచ్చిన ఈ స్పీకర్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!

boAt Stone 900 బ్లూటూత్ స్పీకర్ పూర్తి వివరాలు:

1.డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ:

boAt Stone 900 స్పీకర్ చూడటానికి చాలా పవర్‌ఫుల్‌గా, రగ్గడ్ డిజైన్‌తో వస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనికి తోడు స్పీకర్ చుట్టూ ఉండే Dynamic RGB Lights మ్యూజిక్ బీట్స్‌కి తగ్గట్టుగా మారుతూ పార్టీ వైబ్స్‌ను క్రియేట్ చేస్తాయి. చీకట్లో ఈ లైటింగ్ ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది IPX6 వాటర్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. అంటే.. పూల్ పార్టీలలో చిన్న పాటి నీటి తుంపర్లు పడినా లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌లో వర్షం వచ్చినా ఈ స్పీకర్‌కి ఏమీ కాదు.

2. ఆడియో పవర్:

Advertisement

ఈ స్పీకర్ మెయిన్ హైలైట్ దీని ఆడియో అవుట్‌పుట్. ఇందులో ఏకంగా 80W RMS Sound ని అందించారు. సామ్‌సంగ్ లేదా జేబీఎల్ వంటి లగ్జరీ బ్రాండ్స్ ఇచ్చే ఆడియో లెవెల్‌ను ఇది తక్కువ ధరలోనే అందిస్తోంది. boAt సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీతో రావడం వల్ల బేస్ చాలా డీప్‌గా, గట్టిగా వినిపిస్తుంది. హై వాల్యూమ్‌లో పెట్టినా కూడా ఆడియో ఎక్కడా డిస్టార్షన్ అవ్వదు. సినిమా పాటలైనా.. మాస్ బీట్స్ అయినా క్లారిటీ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది.

3.బ్యాటరీ లైఫ్ అండ్ కనెక్టివిటీ:

పెద్ద స్పీకర్ కదా బ్యాటరీ త్వరగా అయిపోతుందేమో అని టెన్షన్ పడక్కర్లేదు. ఇందులో భారీ బ్యాటరీని ఇచ్చారు. కాబట్టి ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీడియం వాల్యూమ్‌లో.. దాదాపు 10 నుంచి 12 గంటల పాటు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. ఇది Type-C ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Advertisement

TWS ఫీచర్: మీ దగ్గర ఇలాంటివి రెండు boAt Stone 900 స్పీకర్లు ఉంటే.. ‘ట్రూ వైర్‌లెస్ స్టీరియో’ ఫీచర్ ద్వారా రెండింటినీ కనెక్ట్ చేసి 160W థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు.

కనెక్టివిటీ: ఇది లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్‌తో పాటు, AUX కేబుల్, USB డ్రైవ్ , SD కార్డ్ సపోర్ట్‌తో వస్తుంది.

Also Read: వాయిస్ ఇక నెక్స్ట్ లెవెల్! ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్‌తో.. DJI కొత్త వైర్‌లెస్ మైక్

4. ధరల వివరాలు:

boAt Stone 900 బ్లూటూత్ స్పీకర్ ఇండియన్ మార్కెట్లో ఆఫర్లను బట్టి సుమారుగా రూ.6,499 నుంచి రూ.7,499 ప్రారంభ ధరతో లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ అఫీషియల్ వెబ్‌సైట్లలో కార్డ్ ఆఫర్స్ వాడితే ఇది మరింత తక్కువ ధరకే దొరికే ఛాన్స్ ఉంది.

మీరు అవుట్‌డోర్ పార్టీల కోసం, రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవడానికి ఒక పవర్‌ఫుల్ 80W స్పీకర్ కోసం చూస్తుంటే.. boAt Stone 900 బెస్ట్ ఛాయిస్. ఈ బడ్జెట్ ధరలో ఇంత గట్టి బేస్, RGB లైట్స్, వాటర్ ప్రూఫ్ ఫీచర్స్ ఉన్న స్పీకర్ దొరకడం నిజంగా పైసా వసూల్ డీల్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×