// // boAt Stone 1000 review :boAt Stone 1000 రివ్యూ.. ఈ బడ్జెట్‌లో ఇంత పవర్‌ఫుల్ సౌండ్ బాక్సా! -->
E-Paper
Advertisement

boAt Stone 1000 రివ్యూ.. ఈ బడ్జెట్‌లో ఇంత పవర్‌ఫుల్ సౌండ్ బాక్సా!

boAt Stone 1000 రివ్యూ.. ఈ బడ్జెట్‌లో ఇంత పవర్‌ఫుల్ సౌండ్ బాక్సా!
Advertisement

boAt Stone 1000 review: మ్యూజిక్ లవర్స్ కి ఒక గుడ్ న్యూస్. పార్టీ ఎక్కడైనా సరే, అక్కడ రచ్చ లేపడానికి మార్కెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది boAt Stone 1000 వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్. స్టైలిష్ లుక్, రగ్గడ్ బాడీ , గుండెల్లో మోత పుట్టించే బేస్‌తో ఈ స్పీకర్ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. బడ్జెట్ ధరలో.. లభించే ఈ బోట్ స్పీకర్ అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దీని సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ , ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు అవుట్‌డోర్ ట్రిప్స్‌కి వెళ్లినా లేదా రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నా.. ముందుగా గుర్తొచ్చేది మంచి సౌండ్ సిస్టమ్. అదే బోట్ స్టోన్ 1000 స్పీకర్. ఇది కేవలం నార్మల్ స్పీకర్ మాత్రమే కాదు.. మ్యూజిక్ లవర్స్ కు ఒక పవర్‌హౌస్ అని చెప్పొచ్చు.

Advertisement

డిజైన్ & బిల్డ్ క్వాలిటీ:
మొదటి చూపులోనే ఈ స్పీకర్ మనల్ని పడేస్తుంది. దీని డిజైన్ చాలా బోల్డ్‌గా, రఫ్‌గా ఉంటుంది. సిలికాన్, ప్లాస్టిక్ , మెటల్ గ్రిల్ కాంబినేషన్‌తో దీని బాడీని డిజైన్ చేశారు. దీని వల్ల పొరపాటున కింద పడినా గీతలు పడకుండా ‘షాక్ ప్రూఫ్’‌గా ఉంటుంది. అంతేకాదు, దీనికి ఉన్న IPX5 రేటింగ్ వల్ల చిన్నపాటి నీటి చినుకులు లేదా వాటర్ స్ప్లాషెస్ పడినా ఏమీ కాదు. పూల్ సైడ్ పార్టీలకి హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు.

సౌండ్ క్వాలిటీ:
మ్యూజిక్ సిస్టమ్‌లో మెయిన్ మ్యాటర్ సౌండే కదా! ఇందులో 14W డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. ఇవి ఇచ్చే ప్రొడక్షన్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా బేస్ లవర్స్ కోసం ఇందులో అదిరిపోయే డీప్ బేస్ సిగ్నేచర్ సౌండ్ లభిస్తుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టినా కూడా సౌండ్ అస్సలు డిస్టార్ట్ కాదు. పార్టీలలో డ్యాన్స్ వేయడానికి ఈ స్పీకర్ పక్కాగా సెట్ అవుతుంది.

Advertisement

బ్యాటరీ బ్యాకప్:
ఇందులో భారీ 3000mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే (సుమారు 4 గంటలు పడుతుంది), దాదాపు 10 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ మీరు కాల్స్ మాట్లాడటానికి వాడితే 20 గంటల వరకు టాక్ టైమ్ ఇస్తుంది. పార్టీ మధ్యలో బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ అసలు అవసరం లేదు.

కనెక్టివిటీ ఆప్షన్స్:
ఇది లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. దీంతో మొబైల్ లేదా లాప్‌టాప్‌కు ఈజీగా, స్పీడ్‌గా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ మొబైల్‌లో ఛార్జింగ్ లేకపోతే లేదా బ్లూటూత్ వాడకూడదు అనుకుంటే.. ఇందులో ఉన్న AUX కేబుల్ ఆప్షన్ ద్వారా డైరెక్ట్‌గా వైర్డ్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×