E-Paper
Advertisement

బ్లూటూత్ ఇయర్‌బర్డ్స్‌ కింగ్ వచ్చేసింది..డోంట్ మిస్

బ్లూటూత్ ఇయర్‌బర్డ్స్‌ కింగ్ వచ్చేసింది..డోంట్ మిస్
Advertisement

BoAt Nirvana Ion review: మ్యూజిక్ లవర్స్ వైర్‌లెస్ ఇయర్‌బర్డ్స్ వాడటం ఒక డెయిలీ హాబిట్‌గా మారిపోయింది. అయితే.. రోజూ ఛార్జింగ్ పెట్టే తిప్పలు లేకుండా, మైండ్ బ్లోయింగ్ ఆడియో క్వాలిటీ ఇచ్చే ఇయర్‌బర్డ్స్ దొరికితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి పాపులర్ బ్రాండ్ ‘బోట్’ తీసుకొచ్చిందే boAt Nirvana Ion. ఏకంగా 120 గంటల బ్యాటరీ బ్యాకప్, క్రిస్టల్ బయోనిక్ సౌండ్, డ్యూయల్ ఈక్యూ మోడ్స్‌తో రచ్చ లేపుతున్న ఈ ఇయర్‌బర్డ్స్ విశేషాలు, ధర వివరాలు ఇప్పుడు చూద్దాం!

boAt Nirvana Ion TWS ఇయర్‌బర్డ్స్ :

ఈ ఇయర్ బడ్స్ చూడగానే ముందుగా ఆకట్టుకునేది దీని కాంపాక్ట్ అండ్ స్టైలిష్ కేస్ డిజైన్. ఇయర్‌బర్డ్స్ చెవిలో చాలా పర్‌ఫెక్ట్‌గా అమరిపోతాయి. రోజంతా పాటలు విన్నా, ట్రావెలింగ్ చేస్తున్నా లేదా వర్కవుట్స్ చేస్తున్నా చెవులు నెప్పి పుట్టకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. దీని ప్రీమియం ఫినిషింగ్ వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు ఒక లగ్జరీ డివైజ్ పట్టుకున్న ఫీల్ కలుగుతుంది.

క్రిస్టల్ బయోనిక్ సౌండ్ :

Advertisement

ఈ ఇయర్‌బర్డ్స్‌లో హై-క్వాలిటీ ఆడియో కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల ప్రతీ పాటలోని ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ అండ్ వోకల్స్ చాలా క్రిస్ప్‌గా, క్లియర్‌గా వినబడతాయి. అంతేకాకుండా.. దీంట్లో Dual EQ Modes ఇచ్చారు. మీకు హెవీ బాస్ కావాలనుకుంటే సిగ్నేచర్ మోడ్‌కి, లేదా మెలోడీలు వినాలంటే బ్యాలెన్స్‌డ్ మోడ్‌కి ఈజీగా స్విచ్ అవ్వవచ్చు.

కింగ్ సైజ్ 120 గంటల బ్యాటరీ ప్లేటైమ్ :

ఈ ఇయర్‌బర్డ్స్ బిగ్గెస్ట్ హైలైట్ దీని బ్యాటరీ లైఫ్! ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌ బర్డ్స్ మాత్రమే నాన్-స్టాప్‌గా 24 గంటల ప్లేటైమ్ ఇస్తాయి. కేసింగ్‌తో కలిపి చూస్తే ఏకంగా.. 120 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు రెండు మూడు వారాల పాటు ఛార్జర్ వైపు చూడాల్సిన అవసరమే ఉండదు! ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల కొన్ని నిమిషాల ఛార్జింగ్‌తోనే గంటల కొద్దీ ప్లేబ్యాక్ ఆస్వాదించవచ్చు.

క్వాడ్ మైక్ టెక్నాలజీ :

Advertisement

కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వల్ల ఇబ్బంది పడేవారికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇందులో స్పెషల్ టెక్నాలజీని అందించారు. మీరు మార్కెట్‌లో ఉన్నా లేదా ట్రాఫిక్‌లో ఉన్నా ఎదుటి వ్యక్తికి మీ వాయిస్ అత్యంత క్లియర్‌గా వినబడుతుంది.

Also Read: ఎల్జీ ఫ్రంట్ లోడ్‌లో ఇన్ని ఫీచర్లా? చేతితో ఉతికినట్లే మురికి మాయం చేసే కిర్రాక్ మెషీన్!

గేమింగ్ కోసం లో-లేటెన్సీ :

గేమర్స్ అండ్ మూవీ లవర్స్ కోసం ఇందులో ప్రత్యేకమైన BEAST Mode ఇచ్చారు. దీనివల్ల లాగ్ చాలా వరకు తగ్గి, ఆడియో అండ్ వీడియో పర్‌ఫెక్ట్‌గా సింక్ అవుతాయి. గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎనిమీస్ ఫుట్‌స్టెప్స్ లాంటి శబ్దాలు క్షణాల్లో క్యాలిక్యులేటెడ్‌గా వినబడతాయి.

ధర :

ఇన్ని హై-ఎండ్ ఫీచర్లు అండ్ 120 గంటల మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ ఉన్న ఈ బ్లూ టూత్ మార్కెట్‌లో ఆకర్షణీయమైన బడ్జెట్ ధర రూ.1,999 (ఈ-కామర్స్ ఆఫర్లలో రూ.1,699 వరకు) లభిస్తోంది.

రూ. 2,000 లోపు బడ్జెట్‌లో అన్‌స్టాపబుల్ 120 గంటల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ ఈక్వలైజర్ సౌండ్, క్రిస్టల్ క్లియర్ కాలింగ్ అండ్ ప్రీమియం లుక్స్ ఆశిస్తున్న లవర్స్ అండ్ ట్రావెలర్స్‌కి ఇది అల్టిమేట్, మోస్ట్ రికమండెడ్ అండ్ వర్త్ ఛాయిస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×