E-Paper
Advertisement

10 నిమిషాల ఛార్జ్‌తో 12 గంటలు బ్యాకప్.. 3D ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్‌తో సరికొత్త బోట్ హెడ్‌ఫోన్స్ లాంచ్!

10 నిమిషాల ఛార్జ్‌తో 12 గంటలు బ్యాకప్.. 3D ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్‌తో సరికొత్త బోట్ హెడ్‌ఫోన్స్ లాంచ్!
Advertisement

boAt Nirvana Eutopia 2 ANC: ప్రముఖ ఆడియో సంస్థ బోట్.. భారతదేశంలోకి మరొక ప్రీమియం హెడ్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. boAt Nirvana Eutopia 2 ANC పేరుతో వచ్చిన ఈ ఓవర్-ఈర్ హెడ్‌ఫోన్స్‌‌ను మంచి సౌండ్ క్వాలిటీతో పాటు ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. రోజూ పాటలు వినేవారికి, ప్రయాణాలు చేసేవారికి ఈ హెడ్‌ఫోన్స్ బాగా నచ్చుతుంది.

కలర్ ఆప్షన్స్ ఇవే..

భారతదేశంలో ఈ కొత్త హెడ్‌ఫోన్స్ ధరను రూ.4,999గా నిర్ణయించారు. ఇవి కాస్మిక్ బ్లాక్, యుటోపియన్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తాయి. వీటిని బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: బాక్స్ ఓపెన్ చేయగానే మైండ్ పోయింది.. ఐఫోన్ ప్లేస్‌లో ఆయిల్ డబ్బా, ఫ్లిప్‌కార్ట్‌కు ఇచ్చిపడేసిన కోర్టు!

10 నిమిషాలు ఛార్జింగ్‌తో..

ఈ హెడ్‌ఫోన్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ బ్యాకప్ గురించే. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 80 గంటల పాటు నిరంతరంగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, దాదాపు 12 గంటల పాటు పాటలు వినవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.

సౌండ్ క్వాలిటీ అదుర్స్..

Advertisement

మంచి బేస్, స్పష్టమైన వాయిస్ అందించడానికి ఇందులో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్‌ను అమర్చారు. హై-రెస్ ఆడియో, 3డి స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు చూసినా, పాటలు విన్నా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. బయటి శబ్దం ఏమీ వినపడకుండా ఉండేందుకు 45dB అడాప్టివ్ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇచ్చారు. ఇది మనం ఉండే వాతావరణాన్ని బట్టి శబ్దాలను ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది.

సరికొత్త స్మార్ట్ ఫీచర్లు..

ఇది బ్లూటూత్ 5.4 వెర్షన్‌పై పనిచేస్తుంది. గూగుల్ ఫాస్ట్‌పేర్ సపోర్ట్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు త్వరగా కనెక్ట్ అవుతుంది. చెవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెమరీ ఫోమ్ కుషన్లు ఉపయోగించారు. వీటిని మడతపెట్టుకుని క్యారీ కేస్‌లో పెట్టుకుని ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లవచ్చు. అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు స్పష్టత కోసం ఏఐ ఈఎన్‌ఎక్స్ సాంకేతికతను ఇందులో అందించారు.

Also Read: ఇంట్లో తేమగా ఉందని హ్యూమిడిఫైయర్ వాడుతున్నారా? నిపుణులు ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×