E-Paper
Advertisement

AMOLED స్క్రీన్, 12 రోజుల బ్యాటరీ.. డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్‌తో దుమ్ములేపుతున్న బోట్ కొత్త వాచెస్!

AMOLED స్క్రీన్, 12 రోజుల బ్యాటరీ.. డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్‌తో దుమ్ములేపుతున్న బోట్ కొత్త వాచెస్!
Advertisement

Boat Ultima Vogue 2: ప్రముఖ టెక్ సంస్థ బోట్ నుంచి స్టోర్మ్ కాల్ 4, అల్టిమా వోగ్ 2 అనే పేరుతో రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు భారత్ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా డైరెక్ట్ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇవి రావడం విశేషం. ప్రతిదానికీ విడిగా ఛార్జర్ వెతుక్కునే తిప్పలు లేకుండా.. మన ఫోన్ కేబుల్‌తోనే వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడీ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ల ధరలు ఎలా ఉన్నాయి? ఫీచర్లు ఎలా ఉన్నాయి? సేల్ ఎప్పటి నుంచి.. వంటి వివరాలు తెలుసుకుందాం.

ధర ఎంతంటే?

ఈ స్మార్ట్‌వాచ్‌ల ధరల విషయానికి వస్తే.. బోట్ స్టోర్మ్ కాల్ 4 కేవలం రూ.1,599కే లభిస్తుండగా, ప్రీమియం లుక్ ఉన్న అల్టిమా వోగ్ 2 ధరను రూ.2,799గా నిర్ణయించారు. స్టోర్మ్ కాల్ 4 ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభం కాగా.. జూన్ 12 నుండి ఇవి మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి.

స్టోర్మ్ కాల్ 4 ఫీచర్లు ఇవే:

Advertisement

తక్కువ ధరలో వచ్చే స్టోర్మ్ కాల్ 4 మోడల్‌ 1.96 ఇంచుల పెద్ద హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 12 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి అన్ని రకాల హెల్త్ ఫీచర్లతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Also Read: 10,000mAh బ్యాటరీ, 8000 నిట్స్ స్క్రీన్‌తో Honor Win Turbo.. ధర ఎంతో తెలిస్తే?

అల్టిమా వోగ్ 2 ప్రత్యేకతలు:

Advertisement

కొంచెం స్టైలిష్, ప్రీమియం లుక్ కోరుకునే వారి కోసం అల్టిమా వోగ్ 2 బాగా నచ్చుతుంది. దీనిలో 1.96 ఇంచుల బ్రైట్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు మెటాలిక్ ఫ్రేమ్ డిజైన్ ఇచ్చారు. ఇది 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. మిగిలిన హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లన్నీ స్టోర్మ్ కాల్ 4 లాగే ఇందులోనూ కొనసాగించారు.

సరికొత్త ఛార్జింగ్ విప్లవం:

మార్కెట్లో ఇప్పటికే చాలా స్మార్ట్‌వాచ్‌లు ఉన్నప్పటికీ.. బోట్ తెచ్చిన టైప్-సి ఛార్జింగ్ ఫీచర్ వీటికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. స్మార్ట్‌వాచ్ ఛార్జర్ పోగొట్టుకుంటే పడే ఇబ్బందులకు ఇది శాశ్వత పరిష్కారం. ఆఫీస్ డెస్క్ మీదో, బ్యాగులోనో ఉండే సాధారణ మొబైల్ కేబుల్‌తోనే దీన్ని సులువుగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: ఈ ఫీచర్లు తెలిస్తే అస్సలు వదలరు.. సింగిల్ ఛార్జ్‌తో 55 గంటలు రన్ అయ్యే వివో కొత్త ఇయర్‌బడ్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×