E-Paper
Advertisement

డీప్ బేస్‌తో దద్దరిల్లిపోవాల్సిందే.. రూ.10 వేల లోపే Blaupunkt కొత్త పార్టీ స్పీకర్ లాంచ్, ఎక్కడ కొనాలంటే?

డీప్ బేస్‌తో దద్దరిల్లిపోవాల్సిందే.. రూ.10 వేల లోపే Blaupunkt కొత్త పార్టీ స్పీకర్ లాంచ్, ఎక్కడ కొనాలంటే?
Advertisement

Best Party Speakers: మ్యూజిక్ లవర్స్ కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ బ్లూపంక్ట్ భారత మార్కెట్లోకి ‘రాక్ అండ్ రోల్ రేవ్’ పేరిట సరికొత్త పార్టీ స్పీకర్‌ను లాంచ్ చేసింది. పార్టీల్లో డీప్ బేస్, హై-ఎనర్జీ సౌండ్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. మార్కెట్లో చాలా స్పీకర్లు ఎక్కువ సౌండ్ ఇస్తామని చెబుతాయి కానీ, బేస్ విషయంలో నిరాశపరుస్తాయి. అయితే జర్మన్ టెక్నాలజీతో వచ్చిన ఈ కొత్త స్పీకర్ ఆ లోటును తీరుస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది.

అదిరిపోయే సౌండ్ క్వాలిటీ:

ఈ స్పీకర్ కేవలం పెద్దగా శబ్దం చేయడం మాత్రమే కాదు.. వినే ప్రతి పాటలో స్పష్టతను, గంభీరత్వాన్ని అందిస్తుంది. పాటలు వింటున్నా లేదా కచేరీ చేస్తున్నా సరే, యూజర్లు ఒక సరికొత్త అనుభూతిని పొందుతారు. ఇందులో అమర్చిన రెండు 6.5 ఇంచుల ఊఫర్లు గరిష్ట వాల్యూమ్‌లో కూడా డిస్టార్షన్ (కరుకుదనం) లేకుండా, ఎంతో స్పష్టమైన లోతైన బేస్‌ను అందిస్తాయి.

Advertisement

Also Read: కొత్త ఫోన్‌కు పాత ఛార్జర్ వాడుతున్నారా? PPS టెక్నాలజీ గురించి తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యరు!

బేస్ బూస్ట్, లైటింగ్స్ ప్రత్యేకత:

సాధారణంగానే ఈ స్పీకర్ మంచి బేస్ ఇస్తుంది. కానీ పాటల్లో మరింత జోష్ కావాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ‘బేస్ బూస్ట్’ బటన్‌ను ఇచ్చారు. దీనిని నొక్కగానే సాఫ్ట్‌వేర్ సాయంతో బేస్ మరింత పెరిగి, క్లబ్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. దీనికి తోడు మ్యూజిక్ బీట్స్‌కు అనుగుణంగా మారే కలర్‌ఫుల్ నియాన్ లైట్లు పార్టీ మూడ్‌ను మరింత పెంచుతాయి.

బ్యాటరీ లైఫ్, మైక్రోఫోన్:

Advertisement

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్పీకర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకధాటిగా 12 గంటల పాటు ఇది నాన్‌స్టాప్‌గా ప్లే అవుతుంది. దీంతో పవర్ కట్ అయినా పార్టీకి ఎలాంటి బ్రేక్స్ పడవు. అలాగే పాటలు పాడటం ఇష్టపడే వారి కోసం కంపెనీ దీనితో పాటు ఒక వైర్డ్ కచేరీ మైక్రోఫోన్‌ను ఉచితంగా ఇస్తోంది. దీని ద్వారా వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

ధర ఎంతంటే?

ఫీచర్లు భారీగా ఉన్నప్పటికీ ఈ బ్లూపంక్ట్ రాక్ అండ్ రోల్ రేవ్ పార్టీ స్పీకర్ ధరను అందుబాటులోనే ఉంచారు. భారత మార్కెట్లో దీని ధర రూ.9,990గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్పీకర్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు ప్రముఖ ఎలక్ట్రానిక్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Also Read: ఇక నుంచి ఆ పనికి టాయిల్ పేపర్లు అక్కర్లేదు.. బాత్రూమ్ అలవాట్లనే మార్చేస్తున్న స్మార్ట్ టాయిలెట్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×