E-Paper
Advertisement

Discount offer on Cars: ఈ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్.. రూ.1.82 లక్షల వరకు.. ఫిబ్రవరి 29 చివరి తేదీ!

Discount offer on Cars: ఈ కార్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్.. రూ.1.82 లక్షల వరకు.. ఫిబ్రవరి 29  చివరి తేదీ!
Advertisement

Huge Discount offers on Cars in February 2024: ప్రస్తుతం వాహనాల వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ఫీచర్లు, మైలేజీ పరంగా బాగానే ఉన్నా.. ధరలు మాత్రం భారీ స్థాయిలో ఉండటంతో కొందరు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఎప్పుడైనా వాహనాలపై డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటిస్తే కొనేందుకు ఎదురుచూస్తున్నారు.

అలాంటి వారికోసం ఈ ఏడాది ఫిబ్రవరి నెల మంచి ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు. ఈ నెలలో ప్రముఖ వాహన తయారీ కంపెనీలు తమ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అమ్మకాలను పెంచుకోవడానికి, గతేడాది స్టాక్‌ను క్లియర్ చేయడానికి కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.

Advertisement

అందులో మారుతీ, హుందాయ్, మహింద్రా వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. మారుతీ తన నెక్సా, ఎరినా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తుంది. దాదాపు రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఎక్స్‌ యూవీ 300, ఎక్స్ యూవీ 400పై కూడా అద్భుతమైన తగ్గింపును మహీంద్రా ఇస్తోంది. ఇవే కాకుండా.. వీటితో పాటు హ్యుందాయ్, హోండా కంపెనీలు కూడా తమ కార్లపై ఎవరూ ఊహించని డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి.

READ MORE: Discount on MG Comet EV: ఎలక్ట్రిక్ కారుపై బంపరాఫర్.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్.. త్వరపడండి!

Advertisement

2023 హ్యుందాయ్ వెర్నాపై రూ.55 వేల వరకు బెనిఫిట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 2023 మహీంద్రా బొలెరోపై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. 2023 హ్యుందాయ్ అల్కాజర్‌పై రూ.45వేల వరకు తగ్గింపు.. 2023 మహీంద్రా ఎక్స్ యూవీ300 పై రూ.1.82 లక్షల వరకు బెనిఫిట్ డిస్కౌంట్.. అలాగే ఎక్స్‌యూవీ 400పై రూ.4.2 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

అలాగే వీటితో పాటుగా.. 2023 మారుతీ గ్రాండ్ విటారాపై రూ.75 వేల వరకు బెనిఫిట్ ఆఫర్స్ లభిస్తాయి. 2023 మారుతీ జిమ్నీపై రూ.1.50 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్‌లు ఉన్నాయి. అలాగే మారుతీ అల్టోకె10 పై రూ.62 వేల వరకు బెనిఫిట్ ఆఫర్స్..

2023 మారుతీ ఫ్రాంక్స్‌పై రూ.83 వేల వరకు బెనిఫిట్ ఆఫర్స్.. ఎస్ ప్రెస్సో, వాగన్ ఆర్‌పై దాదాపు రూ.61 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. అంతేకాకుండా హోండా సిటీపై రూ.1.11 లక్షల వరకు బెనిఫిట్ ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటుగా.. హోండా అమెజ్‌పై రూ.92 వేల వరకు బెనిఫిట్ ఆఫర్లను పొందవచ్చు.

READ MORE: Cars Offers : కొత్త కార్లపై భారీ రాయితీలు..! ఎంతంటే?

అందువల్ల ఈ ఏడాది మంచి ధరలో అద్భుతమైన ఫీచర్లు గల కార్ మోడళ్లను కొనుక్కోవాలనుకునే వారికి ఫిబ్రవరి నెల అద్భుతమైన అవకాశమని చెప్పాలి. ఇక వీటికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధిత షోరూమ్‌కి వెళ్లి తెలుసుకోవచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×