E-Paper
Advertisement

వర్క్ స్ట్రెస్ ఎక్కువైందా మామ? ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తో.. ఆఫీస్ లైఫ్‌ను హ్యాపీగా మార్చేయ్!

వర్క్ స్ట్రెస్ ఎక్కువైందా మామ? ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తో.. ఆఫీస్ లైఫ్‌ను హ్యాపీగా మార్చేయ్!
Advertisement

Office Gadgets: నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులపై పని ఒత్తిడి (Work Stress) రోజురోజుకూ పెరిగిపోతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, టార్గెట్స్ అందుకోవడానికి నిరంతరం శ్రమించడం వల్ల శారీరక, మానసిక అలసట తప్పడం లేదు. అయితే ఆధునిక సాంకేతికత, కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లను ఉపయోగించడం ద్వారా ఈ పని ఒత్తిడిని సగం వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ సామర్థ్యాన్ని పెంచుతూ వారి పనిని సులువు చేసే కొన్ని అత్యుత్తమ గ్యాడ్జెట్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

Noise-Canceling Headphones

ఆఫీసు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు చుట్టూ ఉండే శబ్దాలు కొన్ని సార్లు ఏకాగ్రతను దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి సమయంలో ‘యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్’ (ANC) ఫీచర్ ఉన్న హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి చుట్టుపక్కల వచ్చే అనవసరపు శబ్దాలను మీ చెవి వరకూ చేరకుండా అడ్డుకుంటాయి. తద్వారా చేసే పనిపై పూర్తి శ్రద్ధ పెట్టేలా తోడ్పాటు అందిస్తాయి.

Ergonomic Keyboard & Mouse

Advertisement

కీబోర్డు, మౌస్‌లను సరైన పొజిషన్‌లో వాడకపోవడం వల్ల చేతులు, మణికట్టు నొప్పులు (RSI) వస్తుంటాయి. దీనివల్ల చాలా మందిలో పని చేయాలనే మూడ్ దెబ్బతింటుంది. కాబట్టి మార్కెట్లో దొరికే ఎర్గోనామిక్ డిజైన్ కీబోర్డులు, వర్టికల్ మౌస్‌లు చేతులకు సహజమైన పట్టును ఇస్తాయి. ఇవి ఎంతసేపు పనిచేసినా అలసట రానివ్వవు. తద్వారా శారీరక ఒత్తిడి చాలా వరకు తగ్గించుకోవచ్చు.

Smart Coffee Mugs

పని ఒత్తిడిలో పడి చాలామంది పక్కనే పెట్టుకున్న టీ లేదా కాఫీని తాగడం మర్చిపోతుంటారు. తీరా చూసేసరికి అది చల్లారిపోతుంది. ఈ సమస్యకు ‘స్మార్ట్ కాఫీ మగ్స్’ చక్కని పరిష్కారం. ఇవి కాఫీ లేదా టీని నచ్చిన ఉష్ణోగ్రత వద్ద గంటల తరబడి వేడిగా ఉంచుతాయి. పని మధ్యలో ఒక వేడి సిప్.. మీ ఒత్తిడిని క్షణాల్లో మాయం చేస్తుంది.

Multi-Port Charging Stations

Advertisement

డెస్క్ నిండా వైర్లు, వేర్వేరు ఛార్జర్లు ఉంటే చూసేటందుకే గందరగోళంగా ఉండి చిరాకు తెప్పిస్తుంది. ఒకే ఒక్క వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ లేదా మల్టీ పోర్ట్ గాన్ (GaN) ఛార్జర్ ఉంటే.. ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌ను ఒకే చోట నీట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. డెస్క్ ఎంత క్లీన్‌గా ఉంటే మైండ్ అంత ప్రశాంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు.

Also Read: ‘తేమ’ను తరిమికొట్టే మిషన్.. పోర్టబుల్ బెటరా? హోల్ హౌస్ మంచిదా?

Sit-Stand Desk Converters

రోజంతా ఒకే చోట కూర్చోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు హైట్ అడ్జస్టబుల్ డెస్క్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒక బటన్ నొక్కగానే ఇవి పైకి లేస్తాయి. దీనివల్ల కొద్దిసేపు కూర్చుని, మరికొద్దిసేపు నిలబడి పనిచేసుకోవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి నడుము నొప్పి రాకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.

Also Read: UPI వాడుతున్నారా? రేపు మీ అకౌంట్ ఖాళీ కాకూడదంటే.. ఇప్పుడే ఇది చదవండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×