E-Paper
Advertisement

రూ.500 లోపు బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్.. వైర్‌లెస్ కంటే క్లియర్ సౌండ్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్!

రూ.500 లోపు బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్.. వైర్‌లెస్ కంటే క్లియర్ సౌండ్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్!
Advertisement

Best Wired Earphones: వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ హవా నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వైర్డ్ ఇయర్‌ఫోన్స్ మళ్లీ ట్రెండ్‌లోకి వస్తున్నాయి. బ్యాటరీ అయిపోతుందనే భయం లేకపోవడం, ఎక్కడా కనెక్షన్ కట్ అవ్వకుండా క్లియర్ సౌండ్ రావడం వల్ల చాలామంది మళ్లీ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 ప్రారంభంలో వీటి అమ్మకాలు ఏకంగా 20 శాతం పెరగడం విశేషం. ఈ క్రమంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజువారీ వాడకానికి బెస్ట్ ఆప్షన్స్:

బడ్జెట్ ధరలో మంచి క్వాలిటీ కోరుకునే వారికి జేబీఎల్ (JBL C100SI) మంచి ఎంపిక. ఇది చాలా తేలికగా ఉంటూ.. బేస్, వాయిస్ క్లారిటీని అద్భుతంగా అందిస్తుంది. ఆఫీస్ మీటింగ్స్, కాల్స్ మాట్లాడుకోవడానికి ఇది బాగా సెట్ అవుతుంది. అలాగే బోట్ (boAt BassHeads 100) మోడల్ కూడా తక్కువ ధరలో లభిస్తుంది. ముఖ్యంగా హిప్‌హాప్, డ్యాన్స్ సాంగ్స్ వినేవారికి దీనిలోని పంచి బేస్ చాలా బాగా నచ్చుతుంది.

యాపిల్ ఇయర్‌పాడ్స్ ప్రత్యేకత:

Advertisement

టైప్-సి పోర్ట్ ఉన్న ఫోన్ లేదా లాప్‌టాప్ ఉంటే.. యాపిల్ ఇయర్‌పాడ్స్ (Apple EarPods USB-C) బెస్ట్ ఛాయిస్. వీటిరి చెవుల్లో సరిగ్గా కుదిరేలా.. ఎలాంటి నొప్పి లేకుండా హాయిగా ఉండేలా డిజైన్ చేశారు. ఇందులోని బ్యాలెన్స్‌డ్ సౌండ్ సంగీతాన్ని సరికొత్తగా ఆస్వాదించేలా చేస్తుంది.

Also Read: స్టూడెంట్స్‌కు బెస్ట్ ట్యాబ్లెట్స్.. రూ.20 వేలలో టాప్ ఛాయిసెస్!

ప్రొఫెషనల్ మ్యూజిక్ లవర్స్ కోసం:

Advertisement

ప్రొఫెషనల్ మ్యూజిక్ అనుభూతిని కోరుకునే వారికి సెన్‌హైజర్ (Sennheiser IE 100 PRO) ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను పూర్తిగా తగ్గించి, ప్రతి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్‌ను విడివిడిగా క్లియర్‌గా వినిపిస్తుంది. దీని వైర్ పాడైతే మార్చుకునే సదుపాయం కూడా ఉంది. అందువల్ల ఇది ఎక్కువ కాలం మన్నుతుంది.

బడ్జెట్ ధరలో సరికొత్త మోడల్స్:

ఆంబ్రేన్ స్ట్రింగ్స్ (Ambrane Stringz 38 Lite) సాధారణ 3.5mm జాక్‌తో వస్తుంది. దీనిలోని పెద్ద డ్రైవర్ల వల్ల బేస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇక ఫోన్లలో హెడ్‌ఫోన్ జాక్ లేని వారి కోసం జిఎమ్ టైప్-సి (GM G+ Type-C) ఇయర్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంతసేపు పెట్టుకున్నా చెవులు నొప్పిరావు.

వైర్డ్ ఇయర్‌ఫోన్స్ ఎందుకు బెటర్?

వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌తో పోలిస్తే.. వైర్డ్ మోడల్స్ ధర చాలా తక్కువ. బ్లూటూత్ డివైజ్‌లలో వచ్చే ఆడియో లాగ్ (సౌండ్ ఆలస్యంగా రావడం) సమస్య వీటిలో అస్సలు ఉండదు. గేమ్స్ ఆడేటప్పుడు, హై-క్వాలిటీ మ్యూజిక్ వినేటప్పుడు అన్‌కంప్రెస్డ్ ప్యూర్ ఆడియోను ఇవి అందిస్తాయి. అందుకే మ్యూజిక్ లవర్స్ మళ్లీ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వైపు మళ్లుతున్నారు.

Also Read: ఇల్లు, ఆఫీస్ రక్షణకు బెస్ట్ Wi-Fi CCTV కెమెరాలు.. ధర మాత్రం రూ.5,000 లోపే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×