E-Paper
Advertisement

టాప్ 5 వాటర్ ప్యూరిఫైయర్స్.. కాపర్, జింక్ ఫిల్టర్లతో మీ ఆరోగ్యానికి డబుల్ ప్రొటెక్షన్!

టాప్ 5 వాటర్ ప్యూరిఫైయర్స్.. కాపర్, జింక్ ఫిల్టర్లతో మీ ఆరోగ్యానికి డబుల్ ప్రొటెక్షన్!
Advertisement

Best water purifiers: ఈ రోజుల్లో ప్యూర్ వాటర్ తాగడం ఒక అవసరం అయితే.. ఆ నీటిలో హెల్త్ బెనిఫిట్స్ ఉండడం ఒక ట్రెండ్. అందుకే మార్కెట్లోకి కాపర్ (రాగి), జింక్  ఫిల్టర్లు ఉన్న లేటెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చేశాయి. ఇవి నీటిలోని క్రిములను చంపడమే కాకుండా.. బాడీకి కావలసిన ఇమ్యూనిటీని పెంచుతాయి. మీ ఇంటికి ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా ? మీకోసమే ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఫీచర్లు, పూర్తి వివరాలతో  స్మార్ట్ గైడ్..

కాపర్, జింక్ ఫిల్టర్లతో కూడిన టాప్ 5 వాటర్ ప్యూరిఫైయర్స్
వాటర్ ప్యూరిఫైయర్ అనగానే ఒకప్పుడు కేవలం RO+UV మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రజలు కేవలం “క్లీన్ వాటర్” కోసం కాకుండా “హెల్తీ మినరల్ వాటర్” కోసం సెర్చ్ చేస్తున్నారు. రాగి పాత్రల్లో.. నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని, జింక్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మనకు తెలుసు. ఇప్పుడు ఈ రెండు గుణాలను ఒకే ప్యూరిఫైయర్‌లో అందిస్తూ టాప్ బ్రాండ్స్ దుమ్మురేపుతున్నాయి.

1. Aquaguard Marvel NXT 2X (Active Copper & Zinc):

Advertisement

యూరేకా ఫోర్బ్స్ నుంచి వచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఇందులో 10-స్టేజ్ ప్యూరిఫికేషన్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది నీటిలో కాపర్ మరియు జింక్ అయాన్లను కరెక్ట్ క్వాంటిటీలో ఇన్ఫ్యూజ్ చేస్తుంది. దీని వల్ల నీటి టేస్ట్ పెరగడమే కాకుండా, బాడీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది.

2. Havells Delite Kop’ere:

హావెల్స్ నుంచి వచ్చిన ఈ ప్యూరిఫైయర్ లుక్‌లోనే కాదు, పర్ఫార్మెన్స్‌లోనూ తోపు. ఇందులో 100% స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉంటుంది, ఇది ప్లాస్టిక్ ట్యాంకుల కంటే చాలా సేఫ్. ఇది కాపర్, జింక్ యాక్టివ్ షీల్డ్‌తో వస్తుంది. ప్రతి 4 గంటలకోసారి ట్యాంక్‌లోని నీటిని UV LED తో ఆటోమేటిక్‌గా శానిటైజ్ చేయడం దీని హైలైట్.

Advertisement

Also Read: కిచెన్ లో ఇది ఉంటే చాలు.. రూపాయి ఖర్చు లేకుండా సూపర్ టేస్టీ జ్యూస్ రెడీ

3. HUL Pureit Copper+ Mineral RO:

హిందుస్థాన్ యూనిలీవర్ వారి ప్యూర్ ఇట్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. దీనిలో 99.8% ప్యూర్ కాపర్ డోసింగ్ టెక్నాలజీ ఉంది. మీరు నార్మల్ RO వాటర్ కావాలా లేదా కాపర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కావాలా అనేది బటన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నీటిని 7 స్టేజీల్లో ప్యూర్ చేస్తుంది.

4. Urban Company Native M1 Water Purifier:

స్మార్ట్ హోమ్స్ కోసం ఇదొక వండర్ఫుల్ ఛాయిస్. 10-స్టేజ్ ప్యూరిఫికేషన్‌తో పాటు ఇందులో కాపర్, జింక్ , ఆల్కలైన్ మినరల్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. దీని బెస్ట్ ఫీచర్ ఏంటంటే, దీని ఫిల్టర్ లైఫ్ ఏకంగా 2 సంవత్సరాలు (లేదా 12,000 లీటర్లు) వస్తుంది. అంటే పదే పదే సర్వీసింగ్ చేయించే తలనొప్పి ఉండదు.

5. Kent Supreme Copper RO:

ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన కెంట్ కూడా కాపర్ రేంజ్‌లో అదరగొడుతోంది. ఇది RO+UV+UF తో పాటు యాక్టివ్ కాపర్ క్యాట్రిడ్జ్ కలిగి ఉంది. కెంట్ పేటెంటెడ్ “మినరల్ RO” టెక్నాలజీ నీటిలోని సహజ ఖనిజాలను కోల్పోకుండా కాపాడుతుంది. అంతేకాదు.. ఇందులో వాటర్ వేస్టేజ్ చాలా తక్కువ.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×