// // Best Water Purifiers 2026: స్మార్ట్ ఫీచర్స్, ప్యూర్ వాటర్! -->
E-Paper
Advertisement

స్మార్ట్ ఫీచర్స్, ప్యూర్ వాటర్! మీ ఇంటి కోసం బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్

స్మార్ట్ ఫీచర్స్, ప్యూర్ వాటర్! మీ ఇంటి కోసం బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్
Advertisement

Best Water Purifiers 2026: ఈ రోజుల్లో మనం తాగే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే, మన ఆరోగ్యం అంత పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ఇళ్లల్లో బోర్‌వెల్ ద్వారా వచ్చే  నీర, మున్సిపల్ సప్లై ద్వారా వచ్చే క్లోరిన్ నీరు.. ఈ రెండింటినీ క్లీన్ చేయడం పెద్ద సవాలుగా మారింది. మే నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైయర్స్ ఈ సమస్యకు పక్కా సొల్యూషన్ ఇస్తున్నాయి. మీ కుటుంబానికి ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ ఏడాది టాప్ రేటింగ్ పొందిన బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వివరాలు మీకోసం!

టాప్-రేటెడ్ వాటర్ ప్యూరిఫైయర్స్ :
మన ఇంట్లోకి వచ్చే నీటిలో ఉండే విపరీతమైన సాల్ట్స్ , క్రిములు, కెమికల్స్ తీసేయడానికి కేవలం నార్మల్ ఫిల్టర్లు సరిపోవు. అందుకనే RO, UV, UF, మినరల్ కంట్రోల్ ఉన్న స్మార్ట్ ప్యూరిఫైయర్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 2026లో కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్న ఆ 6 బెస్ట్ మోడల్స్ ఇవే..

Advertisement

1. KENT Grand Plus :
మనదేశంలో వాటర్ ప్యూరిఫైయర్స్ అనగానే గుర్తొచ్చే నమ్మకమైన బ్రాండ్ ‘కెంట్’. బోర్‌వెల్ నీటిలో TDS ఎక్కువగా ఉన్నా కూడా దీనిలోని RO+UV+UF+TDS కంట్రోలర్ టెక్నాలజీ నీటిని చాలా టేస్టీగా మారుస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, స్టోరేజ్ ట్యాంక్‌లో కూడా ‘UV LED’ లైట్ ఉంటుంది. దీని వల్ల నిల్వ ఉన్న నీటిలో మళ్లీ బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. 9 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ మోడల్ పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్ ఛాయిస్.

2. Aquaguard Delight NXT:
ఆక్వాగార్డ్ నుంచి వచ్చిన ఈ మోడల్ మున్సిపల్ , బోర్‌వెల్ నీరు రెండింటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దాదాపు 2000 PPM వరకు ఉన్న TDS ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఇందులో ఉండే ‘Aquasaver’ టెక్నాలజీ వల్ల సాధారణ RO ఫిల్టర్ల కంటే 60% వరకు నీటి వృథా తగ్గుతుంది. నీటిని వృథా చేయకూడదు అనుకునేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

Advertisement

3. Native by Urban Company M2:
సరికొత్త స్మార్ట్ టెక్నాలజీతో దూసుకుపోతున్న మోడల్ ఇది. దీని హైలైట్ ఏంటంటే.. ఈ ప్యూరిఫైయర్‌కు 2 సంవత్సరాల వరకు ఎలాంటి సర్వీసింగ్ అవసరం లేదు! మొబైల్ యాప్ ద్వారా దీని ఫిల్టర్ లైఫ్‌ను మనం ట్రాక్ చేయవచ్చు. ఇందులో 10-స్టేజ్ ప్యూరిఫికేషన్ ఉండటమే కాకుండా కాపర్, ఆల్కలైన్ గుణాలను నీటిలో కలుపుతుంది.

4. Pureit Revito Prime:
హెచ్‌యూఎల్ (HUL) ప్యూర్ఇట్ నుంచి వచ్చిన ఈ మోడల్ తక్కువ నీటి వృథా ఫీచర్‌తో వస్తుంది. బోర్‌వెల్ నీటిలోని గట్టిదనాన్ని తగ్గించి, సహజమైన కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పోకుండా ఇది కాపాడుతుంది. దీని లుక్ చాలా మోడ్రన్‌గా ఉండి కిచెన్ అందాన్ని పెంచుతుంది.

5. Atomberg Intellon :
ఫ్యాన్లు, మిక్సీలతో పాపులర్ అయిన అటాంబర్గ్ ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ రంగంలోనూ దుమ్మురేపుతోంది. దీనిలో ‘Adaptive Flow’, ‘Taste Tune’ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీ ఇంట్లో వచ్చే నీటి సోర్స్ (బోర్‌వెల్ లేదా మున్సిపల్) బట్టి మీరు యాప్ ద్వారా టేస్ట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొత్త తరం టెక్నాలజీని ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది.

6. AO Smith Z5 Plus:

ప్రీమియం క్వాలిటీ , హెల్తీ వాటర్ కావాలనుకునే వారికి ఏఓ స్మిత్ బెస్ట్ ఛాయిస్. ఇది 100% RO గుండా నీటిని పంపిస్తుంది (ఎలాంటి బైపాస్ లేకుండా). దీనిలోని ‘Alkaline Mineralizer’ టెక్నాలజీ నీటి pH లెవెల్స్‌ను కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల నీరు మన శరీరానికి మరింత ఆరోగ్యాన్ని ఇస్తుంది.

వాటర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
TDS లెవెల్స్: మీ ఇంటి నీటి TDS 300 కంటే తక్కువ ఉంటే కేవలం UV+UF ఫిల్టర్ సరిపోతుంది. కానీ 300 దాటితే మాత్రం ఖచ్చితంగా RO ప్యూరిఫైయర్ ఉండాలి.

సర్వీస్ , మెయింటెనెన్స్: మీ ఏరియాలో ఏ బ్రాండ్ సర్వీస్ బాగుందో చూసి కొనుక్కోవడం ఎల్లప్పుడూ మంచిది.

సురక్షితమైన నీరు తాగడం అనేది లగ్జరీ కాదు, మన హక్కు , బాధ్యత. మే నాటి ఈ లేటెస్ట్ ఆప్షన్లలో మీ బడ్జెట్, ఇంటి నీటి క్వాలిటీకి సరిపోయే బెస్ట్ ప్యూరిఫైయర్‌ను ఎంచుకుని మీ ఫ్యామిలీ హెల్త్‌ను ప్రొటెక్ట్ చేసుకోండి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×