E-Paper
Advertisement

ఇక చీపురుతో పనిలేదు.. రూ.5,000లోపే ఇల్లంతా క్లీన్ చేసే.. సూపర్ వాక్యూమ్ క్లీనర్స్!

ఇక చీపురుతో పనిలేదు.. రూ.5,000లోపే ఇల్లంతా క్లీన్ చేసే.. సూపర్ వాక్యూమ్ క్లీనర్స్!
Advertisement

Vacuum Cleaners: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలే. సాంప్రదాయ పద్ధతిలో చీపురుతో ఇల్లు ఊడ్చడం వల్ల కంటికి కనిపించని దుమ్ము, ధూళి కణాలు గాలిలోకి లేచి, అలర్జీలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో వ్యాక్యూమ్ క్లీనర్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంటాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువ అని అందరూ భావిస్తుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న లెటెస్ట్ వెర్షన్స్.. బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. రూ.5,000 లోపు బడ్జెట్‌లో లభిస్తున్న మార్కెట్లోని టాప్ రేటింగ్ వాక్యూమ్ క్లీనర్లు, వాటి ప్రత్యేకతల గురించి ఈ కథనంలో చూద్దాం.

యూరేకా ఫోర్బ్స్ క్విక్ క్లీన్ డీఎక్స్

క్లీనింగ్ విభాగంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్లలో యూరేకా ఫోర్బ్స్ ఒకటి. ఇది 1200 వాట్స్ శక్తివంతమైన మోటార్‌తో పనిచేయనుంది. ఇది నేలపై, కార్పెట్లలో లోతుగా దాగి ఉన్న దుమ్మును సులభంగా లాగేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ కార్డ్ వైండర్, డస్ట్ బ్యాగ్ నిండిపోతే సూచించే ఇండికేటర్ ఉన్నాయి. దీంతో పాటు 3 ఉచిత రీయూజబుల్ డస్ట్ బ్యాగులు సైతం కంపెనీ అందిస్తోంది. ఇది రూ.3,499 – 4,200 మధ్య అందుబాటులో ఉంది.

అగారో రీగల్ ప్లస్ అప్‌రైట్

Advertisement

తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్‌గా, తేలికగా ఉండే వాక్యూమ్ క్లీనర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇది 2-ఇన్-1 మోడల్. పొడవాటి స్టిక్‌లా నేలపై, హ్యాండ్‌హెల్డ్‌గా మార్చి సోఫాలు, కార్లు శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది 800 వాట్స్ మోటార్‌తో 6.5 kPa సెక్షన్ పవర్ అందిస్తుంది. ఇది రూ.2,300 – 3500 మధ్య సేల్ అవుతోంది.

అమెజాన్ బేసిక్స్ బాగ్‌లెస్ సైక్లోనిక్

ఈ బడ్జెట్‌లో అత్యంత పవర్ ఫుల్ క్లీనర్లలో ఇదీ ఒకటి. 700 వాట్స్ మోటార్ అయినప్పటికీ.. ఇది ఏకంగా 18kPa బలమైన సక్షన్ పవర్‌ను అందిస్తుంది. ఇందులో ఉన్న HEPA 12 ఫిల్టర్ గాలిలోని 99.5% అలర్జీ కణాలను ఫిల్టర్ చేస్తుంది. 1.5 లీటర్ల డస్ట్ కెపాసిటీతో వచ్చే ఈ మోడల్ సోఫాలు, గట్టి నేలలు, కార్పెట్లను సైతం సమర్థవంతంగా క్లీన్ చేయగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది అమెజాన్ లో రూ.4,629కి లభిస్తోంది.

ఇనాల్సా ఓజోయ్ ప్లస్

Advertisement

ఇనాల్సా బ్రాండ్ కు చెందిన ఈ క్లీనర్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో మల్టీపర్పస్ క్లీనింగ్ ను ఇస్తుంది. ఇల్లు, కార్ క్లీనింగ్ రెండింటికీ ఇది చాలా అనుకూలం. మంచాలు, సోఫాల కింద ఉండే ఇరుకైన సందులను కూడా ఇది సులభంగా క్లీన్ చేయగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది రూ.2,500 – 2,800 మధ్య సేల్ అవుతోంది.

Also Read: రీల్స్ చేసేవాళ్లకి పండగే.. సినిమా రేంజ్ వీడియోలు తీసే.. టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఇవే!

కెంట్ డస్టర్ వ్యాక్యూమ్ క్లీనర్

సైక్లోనిక్ 5 టెక్నాలజీతో పనిచేసే ఈ 600 వాట్స్ క్లీనర్.. 16 kPa కంటే ఎక్కువ సక్షన్ పవర్‌ను కలిగి ఉంది. కేవలం 1.2 కేజీల బరువుతో ఉండే ఈ హ్యాండ్‌హెల్డ్ క్లీనర్‌ను చేత్తో పట్టుకుని కర్టెన్లు, సోఫాలు, కార్ సీట్లను ఎంతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

Also Read: ఏంటీ, ల్యాప్‌టాప్‌ Type-C పోర్ట్‌తో.. ఇన్ని అద్భుతాలు చేయెుచ్చా? ఇన్నాళ్లు ఛార్జింగ్‌కే అనుకున్నామే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×