E-Paper
Advertisement

ఉక్కపోతతో నిద్ర పట్టట్లేదా? ఏసీ ఉన్నా, లేకున్నా.. ఈ ట్రిక్స్‌తో హాయిగా పడుకోవచ్చు!

ఉక్కపోతతో నిద్ర పట్టట్లేదా? ఏసీ ఉన్నా, లేకున్నా.. ఈ ట్రిక్స్‌తో హాయిగా పడుకోవచ్చు!
Advertisement

Summer Sleep Tips: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. రాత్రి అయినా కూడా సెగ తగ్గటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లో ఏసీ ఉన్నా, లేకపోయినా రాత్రిళ్లు ప్రశాంతంగా పడుకోవడం ప్రస్తుతం చాలా మందికి పెద్ద టాస్క్ గా మారిపోతోంది. ఈ నేపథ్యంలో భానుడి భగ భగల నుంచి ఉపశమనం పొంది రాత్రి హాయిగా నిద్రపోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

ఏసీ ఉంటే.. ఈ తప్పులు చేయెుద్దు

చాలామంది ఇంట్లో ఏసీ ఉంది కదా అని గదిని ఐస్ ముక్కలా మార్చేస్తారు. కానీ అది ఆరోగ్యానికి, ఆర్థికంగా మంచిది కాదు. ఏసీని ఎప్పుడూ 24 డిగ్రీల నుండి 26 డిగ్రీల మధ్యలోనే సెట్ చేయండి. ఇది శరీరానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో తిప్పడం వల్ల గదిలో చల్లటి గాలి సమానంగా విస్తరిస్తుంది. దీనివల్ల రూమ్ త్వరగా చల్లబడుతుంది. మరోవైపు రాత్రంతా ఏసీ ఆన్ చేసి ఉంచడం వల్ల తెల్లవారుజామున ఒళ్లు నొప్పులు రావొచ్చు. కాబట్టి నిద్రపోయిన 2-3 గంటల తర్వాత ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమర్ పెట్టుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఏసీ లేనిపక్షంలో ట్రిక్స్!

Advertisement

ఇంట్లో ఏసీ లేకపోయినా కొన్ని చిన్న చిన్న మార్పులతో గదిని చల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం కాగానే ఇంట్లోని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. ఎదురెదురు కిటికీలు తెరవడం వల్ల వేడి గాలి బయటకు పోయి చల్లటి గాలి లోపలికి వస్తుందని తెలియజేస్తున్నారు. అలాగే టేబుల్ ఫ్యాన్ లేదా పెడెస్టల్ ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో ఐస్ ముక్కలు ఉంచితే.. ఫ్యాన్ గాలి ఆ ఐస్ ముక్కలపై పడి గదిలోకి చల్లటి ఏసీ లాంటి గాలి వస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు కిటికీలకు ఉండే కర్టెన్లపై (Curtains) కొద్దిగా నీళ్లు చల్లి తేమగా ఉంచితే.. బయటి నుంచి వచ్చే గాలి ఈ తడి కర్టెన్లు గుండా రావడం వల్ల ఇల్లు వేగంగా చల్లబడుతుందని హితవు పలుకుతున్నారు.

Also Read: Sir in AP: ఏపీలో సర్‌కు అంతా రెడీ.. జూన్ 15 నుంచి మొదలు, వైసీపీలో కొత్త టెన్షన్

ప్రశాంత నిద్రకు మరికొన్ని..

Advertisement

ప్రశాంతమైన నిద్ర కోసం మరికొన్ని చిట్కాలను సైతం నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు కేవలం కాటన్ దుస్తులనే ధరించాలని సూచిస్తున్నారు. సిల్క్ లేదా సింథటిక్ దుస్తులు వేడిని లోపలే పట్టి ఉంచుతాయని దీని శరీరానికి అసౌకర్యంగా అనిపించవచ్చని సూచిస్తున్నారు. మరోవైపు అదే విధంగా పరుపుపై కాటన్ బెడ్ షీట్స్ మాత్రమే వాడాలని హితవు పలుకుతున్నారు. వీలైతే పడుకోవడానికి గంట ముందు బెడ్ షీట్‌ను ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్ ఉంచాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు దాన్ని పరుపుపై పరిస్తే అద్భుతమైన చల్లదనం లభిస్తుందని పేర్కొంటున్నారు.

Also Read: తలుపుల వెనుక వస్తువులు, బట్టలు వేలాడదీయడం అశుభం.. వాస్తు ప్రకారం జరిగే నష్టాలు ఇవే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×