E-Paper
Advertisement

ఏసీ లైఫ్ పెరగాలంటే సరైన స్టెబిలైజర్ ఉండాల్సిందే! కంప్రెసర్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

ఏసీ లైఫ్ పెరగాలంటే సరైన స్టెబిలైజర్ ఉండాల్సిందే! కంప్రెసర్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
Advertisement

Best Stabilizer For 1.5 ton AC: ఇంట్లో ఏసీ వాడకం పెరిగిన ఈ రోజుల్లో.. స్టెబిలైజర్ ఎంపిక చాలా ముఖ్యం. చాలా మంది 1.5 టన్ ఏసీ కొంటారు. చేస్తారు కానీ సరైన స్టెబిలైజర్ తీసుకోకపోతే.. కంప్రెసర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కారణంగా ఏపీ తక్కువ రోజుల్లోనే పాడయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టం జరగకుండా ముందుగానే సరైన స్టెబిలైజర్ తీసుకోవడం మంచిది. ఇంతకీ 1.5 టన్ ఏసీ కోసం ఎలాంటి స్టెబిలైజర్ కొనాలి ? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్టెబిలైజర్ ఎందుకు అవసరం?

Advertisement

మన దేశంలో వోల్టేజ్ మార్పులు సాధారణం. తక్కువ లేదా ఎక్కువ వోల్టేజ్ ఏసీపై కంప్రెసర్‌పై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా తొందరగానే ఇది కంప్రెసర్ బర్న్ అవ్వడానికి దారి తీస్తుంది. అందుకే సరైన స్టెబిలైజర్ AC జీవితాన్ని పెంచుతుంది.

1. సరైన కెపాసిటీ (kVA):
1.5 టన్ AC కోసం సాధారణంగా 4 kVA నుంచి 5 kVA స్టెబిలైజర్ సరిపోతుంది. తక్కువ కెపాసిటీ తీసుకుంటే ఏసీకి సరైన ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి ఎప్పుడూ మీ AC పవర్ రేటింగ్‌కు సరిపడే స్టెబిలైజర్ తీసుకోవాలి.

Advertisement

2. వోల్టేజ్ రేంజ్ :
స్టెబిలైజర్ వోల్టేజ్ రేంజ్ 130V నుంచి 290V మధ్య ఉండటం బెస్ట్. గ్రామీణ ప్రాంతాల్లో వోల్టేజ్ డ్రాప్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైడ్ రేంజ్ స్టెబిలైజర్ తీసుకోవడం మంచిది.

3. డిలే టైమర్ ఫీచర్ :
పవర్ కట్ తర్వాత వెంటనే ఏసీ ఆన్ కాకుండా కొన్ని నిమిషాల గ్యాప్ ఇచ్చే డిలే టైమర్ ఉండాలి. ఇది కంప్రెసర్‌ను రక్షిస్తుంది. ఈ ఫీచర్ లేకపోతే.. కంప్రెసర్ త్వరగా డ్యామేజ్ అవుతుంది.

4. ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్:
ఓవర్‌లోడ్ లేదా షార్ట్ సర్క్యూట్ సమయంలో ఏసీని కాపాడే ప్రొటెక్షన్ ఉండాలి. మంచి క్వాలిటీ స్టెబిలైజర్ ఈ ఫీచర్ తప్పనిసరిగా కలిగి ఉంటుంది.

5. డిజిటల్ డిస్‌ప్లే:
డిజిటల్ డిస్‌ప్లే ఉన్న స్టెబిలైజర్ వోల్టేజ్ లెవల్స్‌ను సింపుల్‌గా తెలుసుకునేలా చేస్తుంది. ఇది యూజర్‌కు అదనపు సౌలభ్యం ఇస్తుంది.

Also Read: చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఫ్రిజ్ ఇదేనా? తక్కువ కరెంట్ బిల్లుతో ఎక్కువ స్టోరేజ్.. ఇంకా ఎన్నో !

6. ఇన్వర్టర్ ఏసీలకు స్టెబిలైజర్ అవసరమా?
కొన్ని కొత్త ఇన్వర్టర్ ఏసీలు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్‌ను తట్టుకునేలా డిజైన్ చేస్తారు. అయినప్పటికీ.. వోల్టేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్టెబిలైజర్ వాడటం సేఫ్.

7. తప్పుడు స్టెబిలైజర్ వల్ల వచ్చే నష్టం:

  • కంప్రెసర్ బర్న్ అవుతుంది.
  • AC పనితీరు తగ్గుతుంది.
  • ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతుంది.
  • రిపేర్ ఖర్చులు అధికంగా ఉంటాయి.

1.5 టన్ AC కోసం సరైన స్టెబిలైజర్ ఎంచుకోవడం చిన్న విషయం అనిపించినా అది మీ ఏసీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. సరైన కెపాసిటీ, వైడ్ వోల్టేజ్ రేంజ్, సేఫ్టీ ఫీచర్స్ ఉన్న స్టెబిలైజర్ తీసుకుంటే.. మీరు పెద్ద ఖర్చులను తప్పించుకోవచ్చు. ఒక మంచి స్టెబిలైజర్ అంటే మీ ఏసీకి ఇన్సూరెన్స్ లాంటిదే.

Also Read:  56 గంటల బ్యాటరీ లైఫ్.. 50dB నాయిస్ క్యాన్సిలేషన్! రియల్ మీ కొత్త బడ్స్ ఫీచర్స్ మాములుగా లేవుగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×