E-Paper
Advertisement

AC Offers in Summer: రూ.35 వేల లోపు లభించే బెస్ట్ ఏసీలు.. మీరే ఓ లుక్కేయండి..!

AC Offers in Summer: రూ.35 వేల లోపు లభించే బెస్ట్ ఏసీలు.. మీరే ఓ లుక్కేయండి..!
Advertisement

Best AC’s Under 35,000 Rupees: వేసవి కాలంలో అత్యంత తక్కువ ధరలో ఏసీలను కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అధిక ధర కారణంగా తమ ప్లాన్‌లను మార్చుకుంటుంటారు. అయితే ఇప్పుడు అతి తక్కువ ధరలో ఏసీలను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకో శుభవార్త.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ఒక ప్రత్యేకమైన సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో దేశంలో స్ప్లిట్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 55 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై రూ.4,500 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది.

Advertisement

అంతేకాదండోయ్ అమెజాన్ అనేక బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. అందులో HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా రూ.5,000 వరకు తగ్గింపు వస్తుంది. అలాగే HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు పోందొచ్చు.

Advertisement

J&K బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ.3750 తక్షణ తగ్గింపు లభిస్తుంది. కాబట్టి కొత్త ఏసీని కొనుగోలు చేయాలనుకుంటే.. కేవలం రూ.35,000 లోపు పొందగలిగే అత్యుత్తమ ఏసీలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Also Read: ష్.. బాగా ఉక్కపోస్తుందా.. సగం ధరకే ఈ ఏసీని కొనేయండి..!

లాయిడ్ 1.5-టన్ను త్రీ-స్టార్ స్ప్లిట్ AC:

లాయిడ్ 1.5-టన్ను త్రీ-స్టార్ స్ప్లిట్ AC అమెజాన్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది క్లీన్ ఎయిర్ ఫిల్టర్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, తక్కువ గ్యాస్ డిటెక్షన్ ఫీచర్ వంటి అధునాతన ఫీచర్‌లతో వస్తుంది. అంతేకాకుండా ఐదు కూలింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. ఈ ఏసీ ధర విషయానికొస్తే.. కేవలం రూ.32,990 ధరకు అందుబాటులో ఉంది.

క్యారియర్ 1.5-టన్ను త్రీ-స్టార్ స్ప్లిట్ AC:

ఈ ఏసీపై అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 34,990 ధరకు ఈ క్యారియర్ 1.5-టన్ను ఏసీని కొనుక్కోవచ్చు. ఇది వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ను తీసుకువచ్చే ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్, హెచ్‌డి ఫిల్టర్, వేగవంతమైన కూలింగ్ కోసం ఇన్‌స్టా కూల్, ఎక్కువసేపు ఉండేలా హైడ్రో బ్లూ కోటింగ్, రిఫ్రిజెరాంట్ లీకేజ్ డిటెక్టర్, ADC సెన్సార్ వంటి అధ్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Also Read: ప్రతి నెల కేవలం రూ.1793 చెల్లిస్తే చాలు.. 1.5 టన్ Godrej ఏసీ పొందే ఛాన్స్

క్రూయిజ్ 1.5-టన్నుల త్రీ స్టార్ స్ప్లిట్ AC:

క్రూయిజ్ 1.5-టన్నుల ఏసీ 1.5 టన్నుల సామర్థ్యంతో వస్తుంది. ఈ ఏసీ అమెజాన్‌‌లో రూ. 28,290 ధరకు అందుబాటులో ఉంది. ఇది కన్వర్టిబుల్ 4-ఇన్-1 కూలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. అలాగే HD ఫిల్టర్, PM 2.5 ఫిల్టర్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను కలిగి ఉంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×