E-Paper
Advertisement

Best Split Air Conditioners: ఏంటి భయ్యా నిజమా.. రూ.25వేల లోపే బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలా? డోంట్ మిస్!

Best Split Air Conditioners: ఏంటి భయ్యా నిజమా.. రూ.25వేల లోపే బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలా? డోంట్ మిస్!
Advertisement

Best Split Air Conditioners: ప్రస్తుతం బయట ఎండలు ఎలా మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అసలు గడప దాటి బయటకు వెళ్లాలంటేనే ప్రాణం పోతోంది. పోనీ ఇంట్లో ఉందామంటే.. ఆ సెగలు, ఉక్కపోతకు ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దయిపోతున్నాం. ఫ్యాన్ వేసినా వేడి గాలే వస్తుంటే.. ‘ఒక్క ఏసీ ఉంటే ఎంత బాగుండు’ అని ప్రతి మధ్యతరగతి మనిషికి అనిపించడం ఇప్పుడు సర్వసాధారణం.

కానీ, ఏసీ అంటే వేలల్లో ఖర్చు, కరెంట్ బిల్లు భయం.. ఇవన్నీ మనల్ని వెనక్కి లాగుతుంటాయి. అయితే ఒకప్పటిలా ఏసీలు ఇప్పుడు కొనలేనంత ఖరీదైనవి కావు. సామాన్యుల కష్టాన్ని అర్థం చేసుకున్నట్టుగా కొన్ని ప్రముఖ కంపెనీలు బడ్జెట్ ధరలోనే ఆధునిక ఫీచర్లతో స్ప్లిట్ ఏసీలను తీసుకొచ్చాయి. కేవలం రూ.25,000 లోపే బ్రాండెడ్ ఏసీ దొరకడం అంటే నిజంగా ఈ వేసవిలో మనకి పెద్ద ఊరట అనే చెప్పాలి. మరి ఆ ఏసీలేంటి? వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దామా..

బడ్జెట్ ధరలో బెస్ట్ ఆప్షన్స్:

Advertisement

సాధారణంగా ఈ ధరలో 0.8 టన్ నుండి 1 టన్ సామర్థ్యం గల ఏసీలు అందుబాటులో ఉంటాయి. ఇవి చిన్న గదులకు, స్టడీ రూమ్‌లకు బాగా సెట్ అవుతాయి. వీటిలో ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండటం వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తాయి. Cruise, SHARP, Daikin, Voltas, Lloyd వంటి ప్రముఖ బ్రాండ్లు ఈ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఏసీలను అందిస్తున్నాయి.

Also Read: షావోమీ కొత్త సరుకు.. ఫోన్‌తోనే ఆపరేట్ చేయొచ్చు, కరెంటు బిల్లు కూడా తక్కువే!

అధునాతన ఫీచర్లు:

Advertisement

ఈ ఏసీల్లో కేవలం కూలింగ్ మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఫిల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. క్రూయిజ్ ఏసీలో 7-స్టేజ్ ఫిల్ట్రేషన్ ఉంటే, లాయిడ్ ఏసీలో యాంటీ వైరల్, PM 2.5 ఫిల్టర్లు ఉన్నాయి. ఇవి గాలిలోని ధూళి కణాలను, బ్యాక్టీరియాను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అలాగే Convertible Modes అనే ఆప్షన్ ద్వారా మన అవసరానికి తగ్గట్టుగా ఏసీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు. దీనివల్ల కరెంట్ బిల్లు భారం కూడా తగ్గుతుంది.

50 డిగ్రీల ఎండలోనూ:

ఏసీ కొనేటప్పుడు అది ఎంతకాలం మన్నుతుందనేది చాలా ముఖ్యం. ఇప్పుడు వస్తున్న బడ్జెట్ ఏసీల్లోనూ 100% కాపర్ కండెన్సర్ కాయిల్స్‌ను వాడుతున్నారు. ఇవి తుప్పు పట్టకుండా ఉండటమే కాకుండా వేగంగా కూలింగ్ ఇవ్వడానికి సహాయపడతాయి. ముఖ్యంగా డైకిన్ వంటి బ్రాండ్లు Econo Mode వంటి ఫీచర్లతో తక్కువ పవర్‌లో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. 50 డిగ్రీల ఎండలో కూడా గదిని చల్లబరిచే శక్తి వీటికి ఉంటుంది.

మెయింటెనెన్స్ ముఖ్యం:

అయితే, స్ప్లిట్ ఏసీలను కొనే ముందు మీరు ఏ గదిలో దానిని ఫిక్స్ చేయాలనుకుంటున్నారో ఆ గది పరిమాణాన్ని బట్టి టన్ను సామర్థ్యాన్ని ఎంచుకోవడం ముఖ్యం. సరైన మెయింటెనెన్స్, ఎప్పటికప్పుడు ఫిల్టర్లను శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ ఏసీలు ఏళ్ల తరబడి చల్లదనాన్ని అందిస్తాయి. మీ జేబుకు చిల్లు పడకుండా, ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి ఇవి బెస్ట్ ఆప్షన్స్.

Also Read: భారత మార్కెట్లోకి నాయిస్ మాస్టర్ బడ్స్ 2.. ఇందులో వాడిన అత్యాధునిక ఫీచర్లు నెక్ట్స్ లెవెల్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×