E-Paper
Advertisement

Best Smartphones: రూ. 40,000 బడ్జెట్ ఉందా? అయితే ఈ 3 పవర్‌ఫుల్ ఫోన్లపై ఓ లుక్కేయండి!

Best Smartphones: రూ. 40,000 బడ్జెట్ ఉందా? అయితే ఈ 3 పవర్‌ఫుల్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
Advertisement

Best Smartphones: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ. 40,000 బడ్జెట్ అనేది ప్రీమియం ఫీచర్లు ఉన్న ఫోన్ ను కొనుగోలు చేసేందుకు సరిగ్గా సరిపోతుంది. ఈ ధరలో ఫ్లాగ్‌షిప్ స్థాయి పర్ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరాలు, అదిరిపోయే డిజైన్ కలిగిన ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్, గూగుల్, రియల్‌మి బ్రాండ్లు మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ‘వన్‌ప్లస్ 13R’, ‘గూగుల్ పిక్సెల్ 9a’, ‘రియల్‌మి GT 7’ మోడల్స్.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఫోన్లకు సంబంధించి ప్రధాన ఫీచర్లు, మూడింటిలో ఏది బెస్ట్? అనేది ఈ కథనంలో చూద్దాం.

వన్‌ప్లస్ 13R (OnePlus 13R)

ప్రస్తుతం మార్కెట్లో వన్‌ప్లస్ 13R హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ ఉంది. దీనివల్ల హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. 6.78 అంగుళాల అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లేను దీనికి అందించారు. కెమెరాల విషయానికి వస్తే వెనుక వైపు 50ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను ఈ ఫోన్ కలిగి ఉంది.

గూగుల్ పిక్సెల్ 9a (Google Pixel 9a)

Advertisement

కెమెరా ప్రియులను గూగుల్ పిక్సెల్ 9a మెుబైల్ కట్టిపడేస్తోంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దీని కెమెరా పర్ఫార్మెన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫోన్ 6.3 ఇంచుల OLED డిస్‌ప్లేతో రూపొందింది. గూగుల్ సొంత టెన్సార్ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్.. ప్యూర్ ఆండ్రాయిడ్ 15 అనుభవాన్ని అందిస్తుంది. పైగా గూగుల్ ఇచ్చే అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు దీని అదనపు బలం కానున్నాయి. ఇక ఇందులో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. మెగాపిక్సెల్స్ సంఖ్య తక్కువగా అనిపించినా గూగుల్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కారణంగా ఫోటోలు మాత్రం ఫ్లాగ్‌షిప్ లెవెల్లో వస్తాయి. దీంతో పాటు 5100 mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉండటం విశేషం.

రియల్‌మి GT 7 (Realme GT 7)

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, బిగ్ బ్యాటరీ, క్రేజీ లుక్ కావాలని భావిస్తే.. రియల్‌మి GT 7 ట్రై చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను వాడారు. అలాగే 6.78 అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 7000 mAh బ్యాటరీ, 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను ఇది కలిగి ఉంది. కెమెరా పరంగా చూస్తే వెనుక వైపు 50ఎంపీ + 50ఎంపీ + 8ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను దీనికి ఫిక్స్ చేశారు.

Advertisement

Also Read: భూమ్మీద ఉంటారో లేదో.. డిసైడ్ చేసుకోండి.. పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

మూడింటిలో ఏది బెస్ట్?

ఈ మూడు ఫోన్లు కూడా రూ. 40,000 లోపు సెగ్మెంట్‌లో దేనికదే సొంత ప్రత్యేకతను కలిగి ఉంది. మీకు బ్రాండ్ వాల్యూ, ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే వన్‌ప్లస్ 13R బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఫ్లాగ్‌షిప్ కెమెరా, గూగుల్ AI ఫీచర్లు ముఖ్యం అనుకుంటే గూగుల్ పిక్సెల్ 9a తీసుకోవచ్చు. ఒకవేళ మీరు హెవీ గేమర్ అయ్యుండి.. అదిరిపోయే బ్యాటరీ లైఫ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే కళ్లు మూసుకుని రియల్‌మి GT 7ని ఎంచుకోవచ్చు. మీ అవసరానికి దగ్గరగా ఉన్న దానిని మీరే ఎంచుకోండి.

Also Read: కూలర్ కావాలా? ఈ ఛాన్స్ అస్సలు వదలకండి.. అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×