E-Paper
Advertisement

Best Smartphones: మీ వద్ద రూ.25,000 ఉన్నాయా? ఈ అద్భుతమైన ఫోన్లపై లుక్కేయండి.. ఎంత బాగున్నాయో!

Best Smartphones: మీ వద్ద రూ.25,000 ఉన్నాయా? ఈ అద్భుతమైన ఫోన్లపై లుక్కేయండి.. ఎంత బాగున్నాయో!
Advertisement

Best Smartphones: ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.5,000 నుంచి రూ.1,00,000 పైగా ధరల్లో మెుబైల్స్ లభిస్తున్నాయి. అయితే బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్స్ కోసం వెతికేవారికి ఈ కథనంలో అద్భుతమైన మెుబైల్స్ గురించి అందించడం జరుగుతోంది. రూ.25,000 లోపు బడ్జెట్ లో ప్రస్తుతం మార్కెట్ లభిస్తున్న తోపు స్మార్ట్ ఫోన్స్, వాటి ధరలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Redmi Note 15 5G

షావోమీ నుండి వచ్చిన ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో పాటు IP66 రేటింగ్ (ధూళి, నీటి రక్షణ) కలిగి ఉంది. ఇందులో 6.77 అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. కెమెరా ప్రియుల కోసం 108MP ప్రైమరీ కెమెరాను సైతం అందించారు. రూ.21,000-23,000 మధ్య ఈ మెుబైల్ సేల్ అవుతోంది.

OnePlus Nord CE 5 5G

Advertisement

వన్ ప్లస్ అభిమానులకు ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. దీనిలోని 7,100mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఆక్సిజన్ OS 15తో ఈ మెుబైల్ ఎంతో స్మూత్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.24,000-25,000 మధ్య అందుబాటులో ఉంది.

Vivo T4 5G

రూ.25,000లోపు బడ్జెట్ లో మంచి బ్యాటరీ ఫోన్ కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. బ్యాటరీ పరంగా ఇది అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో 7,300mAh బ్యాటరీ ఉంటుంది. దీనితో పాటు 32MP సెల్ఫీ కెమెరా సైతం ఉంది. ఫొటోలు, వీడియోలు, రీల్స్ తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఈ మెుబైల్ బాగా సెట్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ మెుబైల్ రూ.24,999కి అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: Gold Price Fall: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం రివర్స్ ట్రెండ్.. ఎందుకీ విచిత్ర పరిస్థితి!

Nothing Phone 3a

నథింగ్ నుంచి ఫోన్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఈ ఫోన్ 6.7 అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. మీడియాటెక్ Dimensity 7300-Ultra చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. వెనుక వైపు రెండు 50MP కెమెరాలు (Main + Ultra-wide) ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కూడా రూ.24,999కి లభిస్తోంది.

Also Read: Butterfly vs Philips: మధ్యతరగతి బ్రాండ్స్.. ఈ రెండు ఇండక్షన్స్ స్టవ్స్‌లో.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×