E-Paper
Advertisement

ఫ్రిజ్ లోపల ఏముందో ఫోన్లోనే చూసేయొచ్చు! ఈ స్మార్ట్ ఫ్రిజ్‌లను మించినవి లేవు

ఫ్రిజ్ లోపల ఏముందో ఫోన్లోనే చూసేయొచ్చు! ఈ స్మార్ట్ ఫ్రిజ్‌లను మించినవి లేవు
Advertisement

Best smart refrigerators 2026: ఈ రోజుల్లో ఇల్లు మాత్రమే కాదు, మన వంటగది కూడా చాలా స్మార్ట్‌గా మారిపోతోంది. కేవలం నీళ్లు, కూరగాయలు చల్లబరిచే రోజులు పోయాయి. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ‘స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తున్నాయి. మీ ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాలు ఉన్నాయి? ఏవి అయిపోవచ్చాయి? అనేది ఆఫీసులో కూర్చుని మీ ఫోన్ ద్వారానే లైవ్‌గా చూసేయొచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న బెస్ట్ కనెక్టెడ్ స్మార్ట్ ఫ్రిజ్‌లు, వాటి అద్భుతమైన ఫీచర్లు మీకోసం.

స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్:

1. శామ్‌సంగ్ బిస్పోక్ AI ఫ్యామిలీ హబ్ (Samsung Bespoke AI Family Hub):

ప్రస్తుతం స్మార్ట్ ఫ్రిజ్ మార్కెట్లో కింగ్ ఎవరంటే.. శామ్‌సంగ్ అనే చెప్పాలి. లేటెస్ట్ మోడల్స్‌లో పెద్ద 32-ఇంచుల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో గూగుల్ జెమిని ఏఐ సపోర్ట్ ఉండటం విశేషం.

Advertisement

ఇన్‌బిల్ట్ కెమెరాలు: మీరు సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఫ్రిజ్ లోపల పాలు లేదా గుడ్లు ఉన్నాయో లేదో ఫోన్ యాప్ (SmartThings) ద్వారా లైవ్‌గా చెక్ చేయొచ్చు.

వాయిస్ కంట్రోల్ డోర్స్: చేతిలో గిన్నెలు ఉన్నప్పుడు “Open the fridge door” అని చెప్తే చాలు. ఆటోమేటిక్‌గా డోర్ తెరుచుకుంటుంది.

2. ఎల్‌జీ స్మార్ట్ ఇన్‌స్టావ్యూ (LG Smart InstaView with AI):

Advertisement

ఎల్‌జీ బ్రాండ్ అనగానే మనకు గుర్తొచ్చేది నమ్మకం. వీరి ఇన్‌స్టావ్యూ ఫ్రిజ్ డోర్‌ను రెండు సార్లు నాక్ (Knock) చేస్తే, లోపల ఏముందో.. ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ద్వారా బయటికే కనిపిస్తుంది. దీని వల్ల ఫ్రిజ్ మాటిమాటికీ తీయనవసరం లేదు కాబట్టి కరెంట్ ఆదా అవుతుంది. ఇందులో ఉన్న AI ఫ్రెష్ సిస్టమ్ మీరు ఫ్రిజ్ ఎక్కువగా ఏ సమయాల్లో తీస్తారో గమనించి, ఆ టైమ్‌కు ముందే కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

3. హయర్ లూమియర్ 4-డోర్ సిరీస్ (Haier Lumiere 4-Door):

స్టైలిష్ మిర్రర్ గ్లాస్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ ఫ్రిజ్ బడ్జెట్ , ప్రీమియం రేంజ్‌లో బెస్ట్ ఆప్షన్. ఇందులో వై-ఫై కనెక్టివిటీతో పాటు ఇండియాలోనే మొదటి సారి కలర్‌ఫుల్ డిజిటల్ డిస్‌ప్లేను అందించారు. పెద్ద ఫ్యామిలీస్ కోసం ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న టాప్ స్మార్ట్ ఫీచర్స్:

మీరు కొత్తగా ఫ్రిజ్ కొనాలనుకుంటే.. కేవలం లీటర్ల కెపాసిటీ మాత్రమే కాదు, ఈ కింది ట్రెండీ ఫీచర్స్ కూడా చూసుకోండి.

AI ఎనర్జీ మోడ్: కొత్త బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE 2026) నిబంధనల ప్రకారం రూపొందించిన ఈ ఫీచర్, మీ వాడకాన్ని బట్టి కరెంట్ బిల్లును 10% వరకు తగ్గిస్తుంది.

రెసిపీ సలహాలు: ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలను బట్టి ఇవాళ ఏం వండవచ్చో రెసిపీలను స్క్రీన్‌పైనే చూపిస్తుంది. వస్తువుల ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడితే అలర్ట్స్ కూడా పంపుతుంది.

కన్వర్టిబుల్ ఆప్షన్స్: అవసరాన్ని బట్టి ఫ్రీజర్‌ను నార్మల్ ఫ్రిజ్‌గా మార్చుకునే వెసులుబాటు.

ప్రస్తుతం స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పాతకాలపు సింగిల్ డోర్ ఫ్రిజ్‌ల కంటే.. ఇన్వర్టర్ కంప్రెసర్ , వై-ఫై కనెక్టివిటీ ఉన్న 3-స్టార్, 5-స్టార్ మోడల్స్ వైపే జనాలు మొగ్గు చూపుతున్నారు. మీ వంటగదికి ఒక మోడ్రన్, లగ్జరీ లుక్ ఇవ్వాలనుకుంటే.. ఒక మంచి ఏఐ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ హోమ్ డెలివరీ చేసేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×