E-Paper
Advertisement

Smart Gadgets: ఇల్లు మీది.. పని వాటిది.. మీ శ్రమను తగ్గించే 5 స్మార్ట్ గ్యాడ్జెట్స్!

Smart Gadgets: ఇల్లు మీది.. పని వాటిది.. మీ శ్రమను తగ్గించే 5 స్మార్ట్ గ్యాడ్జెట్స్!
Advertisement

Smart Gadgets: ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతీది స్మార్ట్ గా మారిపోతున్నాయి. ఇంట్లో రోజూవారీ శ్రమను తగ్గించే.. ఎన్నో రకాల స్మార్ట్ గ్యాడ్జెట్లు సైతం మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి ఐదు అత్యుత్తమమైన స్మార్ట్ హోమ్ పరికరాలను ఈ కథనంలో అదించడం జరుగుతోంది. ఇవి మీ శ్రమను తగ్గించడమే కాకుండా ఇంటిని స్మార్ట్ మార్చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్ ప్లగ్స్ (Smart Plugs)

ఇవి ఇంట్లోని సాధారణ సాకెట్లను స్మార్ట్‌గా మారేస్తాయి. గీజర్ ఆన్ చేసి మర్చిపోవడం, ఫోన్ ఓవర్‌ఛార్జ్ అవ్వడం లాంటి సమస్యలకు ఇవి చెక్ పెడతాయి. ఆఫీస్ నుండి వస్తూనే ఏసీ ఆన్ చేసుకోవాలన్నా బెడ్ పైనుంచి లేవకుండానే టేబుల్ ఫ్యాన్ ఆర్పాలన్నా ఇవి చాలా ఉపయోగపడతాయి.

రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్

Advertisement

ఇల్లు ఊడవడం, తుడవడం అనేది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు.. మీ ప్రమేయం లేకుండానే ఇల్లంతా తిరుగుతూ దుమ్మును శుభ్రం చేస్తాయి. మీరు ఆఫీసులో ఉన్నప్పుడు కూడా యాప్ ద్వారా దీన్ని ఆన్ చేయవచ్చు. ఇంటికి వచ్చేసరికి ఇల్లు నీట్‌గా మారిపోతుంది.

స్మార్ట్ డిస్‌ప్లేలు / వాయిస్ అసిస్టెంట్లు

అలెక్సా లేదా గూగుల్ హోమ్ వంటివి పాటలు వినడానికే కాకుండా ఇంటిని స్మార్ట్ గా మార్చేస్తాయి. ఉదయాన్నే అలారం పెట్టడం, ముఖ్యమైన పనులను గుర్తు చేయడం (Reminders), వంట వండేటప్పుడు రెసిపీలు చూడటం వంటి పనులను కేవలం వాయిస్ కమాండ్స్‌తోనే ఇవి చేసిపెడతాయి.

స్మార్ట్ బల్బులు (Smart Bulbs)

Advertisement

రాత్రి నిద్రపోయేటప్పుడు లైట్ స్విచ్ వేయడానికి లేవడం బద్ధకంగా అనిపిస్తే ఇవి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. ఫోన్ ద్వారా లేదా వాయిస్‌తో వీటిని కంట్రోల్ చేయవచ్చు. మన మూడ్‌కి తగ్గట్టుగా లైటింగ్ రంగులను, బ్రైట్‌నెస్‌ను మార్చుకునే వెసులుబాటు వీటిలో ఉంటాయి.

Also Read: మీ ఫోన్ వర్షంలో తడిసిందా? ఈ 5 తప్పులు చేస్తే.. ఇక అంతే సంగతులు!

వీడియో డోర్‌బెల్స్ (Video Doorbells)

కుటుంబ సభ్యుల భద్రతకు ఈ స్మార్ట్ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని సాయంతో కాలింగ్ బెల్ కొట్టగానే బయట ఎవరున్నారో ఇంట్లో కూర్చునే ఫోన్‌లో చూడొచ్చు. మనం ఇంట్లో లేకపోయినా డెలివరీ బాయ్‌తో మాట్లాడి పార్సిల్ పక్కన పెట్టమని చెప్పే వెసులుబాటు వీటి ద్వారా కలుగుతుంది.

Also Read: చాంతాడంత బ్యాటరీ.. మూడు రోజుల బ్యాకప్.. మార్కెట్లోని టాప్-4 బాహుబలి ఫోన్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×