E-Paper
Advertisement

బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలా? కరెంట్ ఆదా చేయడంలో వీటికి తిరుగులేదు!

బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలా? కరెంట్ ఆదా చేయడంలో వీటికి తిరుగులేదు!
Advertisement

Smart BLDC Fans: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫ్యాన్ అని దేన్ని చూసినా.. పాత మోటార్లకే వైఫై ముక్క తగిలించి అమ్ముతున్నారు. కానీ సిగ్నిఫై (ఫిలిప్స్ లైటింగ్) బ్రాండ్ నుండి వచ్చిన ఎకోలింక్ (EcoLink) BLDC ఫ్యాన్లు మాత్రం అలా కాదు. ఈ సిరీస్‌లో ఐరోక్వాడ్ (AiroQuad), ఐరోఎలివేట్ (AiroElevate), ఐరోజ్వెల్ (AiroJewel), ఐరోజామెట్రీ (AiroGeometry) అనే నాలుగు మోడల్స్ ఉన్నాయి. వీటి పనితీరు, ఫీచర్లు అన్నీ ఒకటే అయినా.. కేవలం లుక్స్ విషయంలో మాత్రమే తేడాలుంటాయి.

BLDC ఫ్యాన్ అంటే?
సాధారణ ఫ్యాన్లలో ఉండే పాత ఏసీ ఇండక్షన్ మోటార్ల స్థానంలో దీనిలో బ్రష్‌లెస్ డీసీ (BLDC) మోటార్‌ను వాడతారు. ఇది సాఫ్ట్‌వేర్ ద్వారా డిజిటల్ పద్ధతిలో కంట్రోల్ అవుతుంది. అందుకే దీనికి వైఫై, రిమోట్ కనెక్టివిటీని జోడించడం చాలా తేలికైంది. నిజం చెప్పాలంటే.. ఇది కేవలం స్మార్ట్ ఫ్యాన్ మాత్రమే కాదు, కరెంట్ బిల్లును భారీగా తగ్గించే ఒక అద్భుతమైన టెక్నాలజీ.

కరెంట్ బిల్లుల భారం తగ్గుతుంది:

Advertisement

సాధారణ ఫ్యాన్లు తిరగడానికి దాదాపు 75 నుండి 80 వాట్ల పవర్ తీసుకుంటాయి. కానీ ఈ ఎకోలింక్ BLDC ఫ్యాన్లు ఫుల్ స్పీడ్‌లో తిరిగినా కేవలం 35 వాట్లు మాత్రమే వాడుకుంటాయి. అంటే దాదాపు 60% వరకు కరెంట్ ఆదా అవుతుంది. మన దేశంలో వేసవికాలంలో రోజంతా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి.. వీటి వల్ల కరెంట్ బిల్లులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అందుకే వీటికి ప్రభుత్వం 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఇచ్చింది

Also Read: మీ ప్రైవేట్ ఫొటోలు, చాట్స్ హ్యాకర్స్ చేతికి వెళ్లకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఇలా చేయండి!

కంట్రోల్ చేయడం చాలా ఈజీ:

Advertisement

ఈ ఫ్యాన్లను ఫిలిప్స్ విజ్ (WiZ) యాప్ ద్వారా మొబైల్ నుండే ఆపరేట్ చేయవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ కమాండ్స్‌తో కూడా కంట్రోల్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు బాక్స్‌లోనే ఒక ఆర్ఎఫ్ (RF) రిమోట్ వస్తుంది. దీనికి ఎలాంటి లైన్-ఆఫ్-సైట్ అవసరం లేదు. అంటే.. ఫ్యాన్ వైపు చూపిస్తూనే నొక్కాల్సిన పనిలేదు. ఒకవేళ ఇంట్లో వైఫై ఆగిపోయినా ఈ రిమోట్ హ్యాపీగా పనిచేస్తుంది. దీనిలో ఉండే బ్రీజ్ మోడ్, స్లీప్ మోడ్, టైమర్ వంటి ఫీచర్లు మన నిద్రను మరింత సుఖవంతం చేస్తాయి.

ఇన్‌స్టాలేషన్ ఎలాగంటే?

ఇంట్లో పాత ఫ్యాన్ తీసేసి దీన్ని పెట్టడం చాలా సులభం. ఎలాంటి వైరింగ్ మార్చాల్సిన అవసరం లేదు. కానీ పాత రెగ్యులేటర్లతో మాత్రం దీన్ని వాడకూడదు. డైరెక్ట్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. పాత ఫ్యాన్లకు స్మార్ట్ స్విచ్‌లు పెడితే ఒక రకమైన గిరగిర శబ్దం వస్తుంది. కానీ ఈ BLDC ఫ్యాన్లలో మోటార్ చాలా సైలెంట్‌గా తిరుగుతుంది. కేవలం గాలి శబ్దం తప్ప మోటార్ సౌండ్ అస్సలు వినిపించదు.

ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి?

ఈ నాలుగు ఫ్యాన్ల పనితీర, గాలి ఇచ్చే సామర్థ్యం (230 CMM) ఒక్కటే. కాబట్టి మీ రూమ్ లుక్‌ని బట్టి మోడల్ ఎంచుకోవచ్చు. సింపుల్‌గా ఉండాలంటే స్క్వేర్ డిజైన్ ఉన్న ఐరోక్వాడ్, కాస్త మోడ్రన్‌గా కనిపించాలంటే ఐరోఎలివేట్ లేదా ఐరోజ్వెల్ బాగుంటాయి. ఒకవేళ రెండు రూమ్‌ల కోసం ఒకేసారి ఆర్డర్ చేయాలనుకుంటే ఐరోజ్వెల్, ఐరోజామెట్రీ మోడల్స్ రెండు ఫ్యాన్ల కాంబో ప్యాక్‌లలో కూడా దొరుకుతాయి. వీటికి రిజిస్ట్రేషన్ ద్వారా 5 ఏళ్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది.

Also Read: లీకైన గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ఈ కలర్, డిజైన్ చూస్తే టెక్ ప్రియులకు పిచ్చెక్కిపోవాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×