E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాప్-5 రియల్‌మీ మొబైల్స్.. వీటి ధరలు తెలిస్తే మీరూ కొనేస్తారు!

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాప్-5 రియల్‌మీ మొబైల్స్.. వీటి ధరలు తెలిస్తే మీరూ కొనేస్తారు!
Advertisement

Best Mobiles Under 30000: ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో రియల్‌మీ హవా మామూలుగా లేదు. ముఖ్యంగా కుర్రాళ్లను ఆకట్టుకునే అదిరిపోయే డిజైన్లు, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇవ్వడంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో మీరు కూడా రూ.30వేల లోపు మంచి ఫోన్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 5 ఫోన్లపై ఓ లుక్కేయండి..

Realme 14 Pro+ 5G

ఫొటోలు తీయడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ల కోసమే ఈ ఫోన్. దీనిలో ఉండే 50MP మెయిన్ కెమెరా పిక్చర్‌లను చాలా క్లారిటీగా తీస్తుంది. ఎంతలా అంటే.. చీకట్లో తీసినా కూడా ఫొటోలు చాలా నీట్‌గా వస్తాయి. ఇక దీని డిస్‌ప్లే విషయానికొస్తే.. వీడియోలు చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అలాగే దీని 6000mAh బ్యాటరీ వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రోజంతా ఫోన్ వాడుతున్నా ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ ఉండదు.

Realme GT 6T

Advertisement

ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వకూడదు, స్పీడ్‌గా పని చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో ఉన్న పవర్‌ఫుల్ ప్రాసెసర్ వల్ల గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడా లాగ్ అవ్వదు. ఈ ఫోన్ స్క్రీన్ చాలా బ్రైట్‌గా ఉంటుంది కాబట్టి.. బయట ఎండలో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు.. గంటల తరబడి వాడుకోవచ్చు.

Also Read: గేమర్లకు, సినిమా ప్రియులకు పండగే.. Xiaomi Civi 6 Proలో భారీ మార్పులు, ఫైనల్ లుక్ చూశారా?

Realme P4 Pro

Advertisement

కొత్తగా వచ్చిన ఈ ఫోన్ చూడ్డానికి చాలా స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. సాధారణంగా పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా ఉంటుందని అంటారు కానీ, ఇందులో 7000mAh భారీ బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ చాలా తేలికగా అనిపిస్తుంది. ఫోన్ ఎక్కువ సేపు చేతిలో పట్టుకుని వాడే వారికి ఇది భలే కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే దీని 80W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ ఇట్టే నిండిపోతుంది.

Realme 13 Pro Plus

ఫోన్ చేతిలో ఉంటే రిచ్‌గా కనిపించాలి అనుకునే వారు దీనికి ఫిదా అయిపోతారు. ఫోన్ వెనుక ఉండే లెదర్ ఫినిషింగ్ చాలా ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. దీని కెమెరాలో జూమ్ ఆప్షన్ చాలా బాగుంటుంది. దూరంగా ఉన్న వాటిని కూడా క్లారిటీ తగ్గకుండా ఫొటోలు తీయొచ్చు. వర్షంలో తడిచినా లేదంటే పొరపాటున నీళ్లలో పడినా ఫోన్‌కి ఏమీ అవ్వదు. అంత పటిష్టంగా దీన్ని తయారు చేశారు.

Realme 15 5G

తక్కువ బడ్జెట్‌లో అన్ని రకాల ఫీచర్లు ఉన్న ఆల్‌రౌండర్ ఫోన్ కావాలంటే ఇది తీసుకోండి. దీని స్క్రీన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎక్కడా ఇబ్బంది అనిపించదు. అలాగే మల్టీటాస్కింగ్‌ చేసినా కూడా ఈ ఫోన్ స్పీడ్ తగ్గదు. తక్కువ ధరలో మంచి 5G స్పీడ్, ఎక్కువ సేపు వచ్చే బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఇదొక పర్ఫెక్ట్ ఛాయిస్.

Also Read: ఐఫోన్ రేంజ్ కెమెరా, సూపర్ స్పీడ్.. ఈ Vivo S50t ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×