E-Paper
Advertisement

మీ పర్సనల్ డేటా లీక్ అవ్వకుండా.. సూపర్ స్పీడ్‌తో పనిచేసే బెస్ట్ బ్రౌజర్లు ఇవే!

మీ పర్సనల్ డేటా లీక్ అవ్వకుండా.. సూపర్ స్పీడ్‌తో పనిచేసే బెస్ట్ బ్రౌజర్లు ఇవే!
Advertisement

Best Web Browsers 2026: మనం రోజూ ఫోన్ లేదా లాప్‌టాప్‌లో ఇంటర్నెట్ వాడటానికి బ్రౌజర్లను ఉపయోగిస్తుంటాం. నిజానికి ఈ బ్రౌజరే మనం డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే మొదటి ద్వారం. అందుకే మనం ఏ బ్రౌజర్ వాడుతున్నామనేది చాలా ముఖ్యం. కొన్ని బ్రౌజర్లు మన వివరాలను ట్రాక్ చేస్తుంటే.. మరికొన్ని మన డేటాను దాచి ఉంచుతాయి. అలాగే బ్రౌజర్ వేగం కూడా మన సమయాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే భద్రతతో పాటు మంచి స్పీడ్ ఇచ్చే బ్రౌజర్‌ను ఎంచుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరం. ఈ నేపథ్యంలో కొన్ని బెస్ట్ అండ్ ప్రైవసీ బ్రౌజర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Brave Browser: వేగం, భద్రతల మేళవింపు

నేటి టెక్ యుగంలో చాలామంది ఇష్టపడుతున్న బ్రౌజర్ Brave Browser. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది అనవసరమైన యాడ్స్, వెబ్‌సైట్ ట్రాకర్లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. దీనివల్ల డేటా కలిసిరావడమే కాకుండా పేజీలు చాలా వేగంగా లోడ్ అవుతాయి. ఇది Google Chrome లాగే పని చేస్తుంది కాబట్టి.. వాడుక కూడా సులువుగా ఉంటుంది. దీనిలో ఉండే ప్రైవేట్ మోడ్ ద్వారా మన వివరాలు ఇతరులకు తెలియకుండా వాడుకోవచ్చు.

Tor Browser: సీక్రెట్ బ్రౌజింగ్‌కు కేరాఫ్ అడ్రస్

Advertisement

వేగంతో పనిలేదు, కేవలం వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలియకూడదు అనుకునే వారికి Tor Browser బెస్ట్ చాయిస్. ఇది ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు సర్వర్ల ద్వారా రౌట్ చేస్తుంది. దీనివల్ల బ్రౌజ్ చేసే పర్సన్ యొక్క ఐపీ అడ్రస్ ఎవరికీ దొరకదు. అయితే, ఈ భద్రతా వలయాల వల్ల బ్రౌజింగ్ స్పీడ్ కాస్త తగ్గుతుంది. అలాగే కొన్ని వెబ్‌సైట్లు ఈ బ్రౌజర్‌లో సరిగ్గా ఓపెన్ కావు.

Also Read: ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు.. 4 స్పీకర్లు, మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చేస్తోన్న షావోమి కొత్త సిరీస్!

Firefox: నచ్చినట్టు మార్చుకోవచ్చు

Advertisement

Mozilla Firefox చాలా కాలంగా నమ్మకమైన బ్రౌజర్‌గా పేరు తెచ్చుకుంది. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం వల్ల యూజర్ల ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీనిలో మనకు నచ్చినట్టు సెట్టింగ్స్ మార్చుకునే సదుపాయం ఉంది. ట్రాకర్ల నుండి రక్షణ కల్పించే ఫీచర్లు ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. మొదట్లో ఇది కాస్త నెమ్మదిగా అనిపించినా.. సరైన సెట్టింగ్స్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Microsoft Edge: విండోస్ యూజర్ల ఫేవరెట్

విండోస్ కంప్యూటర్లు వాడేవారికి Microsoft Edge చాలా బాగా సెట్ అవుతుంది. ఇది సిస్టమ్ మెమరీని ఎక్కువగా తీసుకోకుండా చాలా వేగంగా పనిచేస్తుంది. దీనివల్ల బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. దీనిలో కూడా ట్రాకింగ్ నియంత్రించే ఫీచర్లు ఉన్నాయి. కాకపోతే, మైక్రోసాఫ్ట్ సంస్థ మన డేటాను ఎలా వాడుతుందనే విషయంలో చిన్నచిన్న సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఎలాంటి సెట్టింగ్స్ మార్చకుండా వేగంగా ఇంటర్నెట్ వాడాలనుకునే వారికి ఇది బాగుంటుంది.

Vivaldi: ఫీచర్లు, కస్టమైజేషన్లు పర్ఫెక్ట్

అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకునే వారి కోసం Vivaldi బ్రౌజర్ డిజైన్ చేశారు. దీని లుక్, స్క్రీన్ స్టైల్, ట్యాబ్‌ల అమరిక.. ఇలా ప్రతీ ఒక్కదాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. దీనిలో కూడా యాడ్ బ్లాక్స్ ఉంటాయి. బ్రౌజర్ స్క్రీన్ మీదే నోట్స్ రాసుకోవడం, పనులను మేనేజ్ చేసుకోవడం లాంటి ఆప్షన్లు ఉండటం వల్ల ఆఫీస్ పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

Also Read: భారత్‌లోకి సోనీ నుంచి మోస్ట్ ప్రీమియం స్మార్ట్ టీవీలు .. Sony BRAVIA 7II సిరీస్ ప్రత్యేకతలు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×