E-Paper
Advertisement

Best Portable Mini AC: రూ.2,000 లోపు బెస్ట్ పోర్టబుల్ మినీ ఏసీలు, ఫ్యాన్లు.. ఇవి నిజంగా పనిచేస్తాయా?

Best Portable Mini AC: రూ.2,000 లోపు బెస్ట్ పోర్టబుల్ మినీ ఏసీలు, ఫ్యాన్లు.. ఇవి నిజంగా పనిచేస్తాయా?
Advertisement

Best Portable Mini AC: మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ సామాన్యులు ఏసీలు కొనలేక, కనీసం చిన్నపాటి ఉపశమనం కోసం ఆన్‌లైన్‌లో తక్కువ ధరలో లభించే పోర్టబుల్ మినీ ఏసీలు, రీఛార్జబుల్ ఫ్యాన్ల కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో రూ.1000 నుండి రూ.2000 లోపు ఆకర్షణీయమైన డిజైన్లతో ఇవి దర్శనమిస్తున్నాయి. అయితే, వీటిని కొనే ముందు ఈ గ్యాడ్జెట్స్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం.

మినీ పోర్టబుల్ ఏసీల పనితీరు:

చాలామంది వీటిని ఏసీ అని పిలుస్తారు. కానీ నిజానికి ఇవి ఎవాపరేటివ్ కూలర్లు లేదా చిన్న సైజు డెస్క్ కూలర్లు మాత్రమే. వీటిలో నీరు లేదంటే ఐస్ ముక్కలు వేయడానికి ప్రత్యేకమైన బాక్స్ ఉంటుంది. ఒక చిన్న ఫ్యాన్ ద్వారా గాలిని లోపలికి పంపి, నీటి తేమతో కూడిన చల్లని గాలిని బయటకు పంపిస్తాయి. ఈ గ్యాడ్జెట్స్ రూమ్ మొత్తాన్ని చల్లబరచలేవు. కేవలం మీరు కూర్చున్న చోట పెట్టుకుంటే మీ ముఖానికి లేదా శరీరానికి కొంత మేర చల్లదనాన్ని మాత్రమే ఇస్తాయి. అలాగే వీటిని కిటికీలు తెరిచి ఉన్నప్పుడు వాడితేనే మెరుగైన ఫలితం ఉంటుంది.

Advertisement

Also Read: రూ.30వేల లోపు బెస్ట్ ఏసీ కావాలా? వోల్టాస్, హిటాచీ, లాయిడ్లలో ఏది బెస్టో తెలుసుకోండిలా!

బెస్ట్ ఆప్షన్లుగా మినీ ఫ్యాన్లు:

ప్రస్తుతం మార్కెట్లో రూ.2000 లోపు మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న పోర్టబుల్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెస్క్ ఫ్యాన్లు, క్లిప్‌ఆన్ ఫ్యాన్లు, మెడలో వేసుకునే నెక్ ఫ్యాన్లు బాగా ప్రాచుర్యం పొందాయి. 2000 నుండి 4000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాన్లను ఒకసారి ఛార్జ్ చేస్తే 4 నుండి 6 గంటల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. కరెంట్ పోయినప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

కొనే ముందు గమనించాల్సినవి:

Advertisement

తక్కువ ధరలో వస్తున్నాయి కదా అని నాణ్యత లేని బ్రాండ్లను ఎంచుకోవద్దు. ముఖ్యంగా చైనా మేడ్ ప్రొడక్టుల విషయంలో జాగ్రత్త అవసరం. USB ద్వారా ఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూసుకోవాలి. అలాగే సౌండ్ ఎక్కువ చేసే ఫ్యాన్ల వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది కాబట్టి.. తక్కువ డెసిబుల్స్ ఉన్నవాటిని ఎంచుకోవాలి. ఈ పరికరాలు కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Also Read: ఓరినాయనో.. 100 ఇంచుల భారీ 4K టీవీ ఇంత తక్కువ ధరలోనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×