E-Paper
Advertisement

బెస్ట్ పవర్ బ్యాంక్ కొనాలా? వైర్‌లెస్,ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో అదరగొడుతున్న బ్రాండ్స్!

బెస్ట్ పవర్ బ్యాంక్ కొనాలా? వైర్‌లెస్,ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో అదరగొడుతున్న బ్రాండ్స్!
Advertisement

Best power banks in 2026 India: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే నిమిషం గడవదు. ఆఫీస్ వర్క్, రీల్స్ చూడటం, లొకేషన్ నావిగేషన్.. ఇలా ప్రతి దానికీ ఫోన్ కావాల్సిందే. కానీ ఎంత పెద్ద ఫోన్ అయినా సాయంత్రానికి బ్యాటరీ డెడ్ అయిపోతుంది. ముఖ్యంగా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ఛాప్ అయితే.. వచ్చే టెన్షన్ మామూలుగా ఉండదు. అందుకే మీ బ్యాటరీ యాంగ్జైటీకి చెక్ పెట్టేలా.. ఈ ఏడాది మార్కెట్‌ను రూల్ చేస్తున్న బెస్ట్ పోర్టబుల్ చార్జర్స్ ,పవర్ బ్యాంక్స్ గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మొబైల్ బ్యాటరీ అయిపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అందుకే ఒక మంచి పవర్ బ్యాంక్ మన బ్యాగ్‌లో ఉండటం చాలా ముఖ్యం. అయితే పవర్ బ్యాంక్ అనగానే.. కేవలం ఫోన్ చార్జ్ చేసే డివైజ్ మాత్రమే కాదు, ఇప్పుడు వైర్‌లెస్, మ్యాగ్‌సేఫ్, లాప్‌టాప్‌లను కూడా చార్జ్ చేసే క్రేజీ టెక్నాలజీలు వచ్చేశాయి. మార్కెట్లో చాలా మోడల్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ..

Xiaomi Power Bank 4i 20000mAh (33W):

Advertisement

హెవీ యూజర్స్ ,ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్లకు ఇది ఒక బెస్ట్ ఛాయిస్. ఇందులో 20000mAh భారీ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అంతేకాదు.. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఒకేసారి మూడు డివైజ్‌లను చార్జ్ చేసుకోవడానికి యూఎస్‌బీ-సి, యూఎస్‌బీ-ఏ పోర్టులు ఇచ్చారు. ఫోన్‌తో పాటు చిన్నపాటి లాప్‌టాప్‌లను కూడా ఇది ఈజీగా చార్జ్ చేయగలదు.

Ambrane 20000mAh (22.5W) :

బడ్జెట్ ధరలో నమ్మకమైన పవర్ బ్యాంక్ కావాలనుకుంటే యాంబ్రేన్ (Ambrane),అర్బన్ (URBN) బ్రాండ్స్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. ఈ రెండింటిలోనూ 22.5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. యాంబ్రేన్ మోడల్‌లో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో తెలియడానికి ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. అలాగే ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ కాకుండా స్పెషల్ సేఫ్‌గార్డ్స్ ఉన్నాయి. ఇటు అర్బన్ పవర్ బ్యాంక్ కూడా చాలా కాంపాక్ట్‌గా ఉంటూ మొబైల్స్, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లను సేఫ్‌గా చార్జ్ చేస్తుంది.

Spigen ArcPack 10000mAh (30W):

Advertisement

మీకు చేతిలో ఇమిడిపోయేలా, ఎక్కువ బరువు లేకుండా ఉండే పవర్ బ్యాంక్ కావాలంటే స్పిగెన్ ఆర్క్‌ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 10000mAh కెపాసిటీతో చిన్నగా ఉన్నప్పటికీ ఏకంగా 30W ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్‌ను ఇస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇన్‌బిల్ట్‌గా యూఎస్‌బీ-సి కేబుల్ వస్తుంది. దీని దీని వల్ల విడిగా కేబుల్స్ మోయాల్సిన అవసరం అస్సలు ఉండదు.

వైర్‌లెస్ అండ్ మ్యాగ్‌సేఫ్ పవర్ బ్యాంక్స్ ట్రెండ్:

ఇప్పుడు వైర్లు లేని వైర్‌లెస్ చార్జింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఐఫోన్ వాడే వాళ్ల కోసం యాంబ్రేన్ మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ 10000mAh పవర్ బ్యాంక్ అందుబాటులో ఉంది. ఇది ఫోన్ వెనుక అయస్కాంతంలా అతుక్కుపోయి 22.5W స్పీడ్‌తో వైర్డ్‌గానూ, వైర్‌లెస్‌గానూ చార్జ్ చేస్తుంది. అలాగే డైలీఆబ్జెక్ట్స్ లూప్ క్వి2 (Qi2) సర్టిఫైడ్ 20000mAh పవర్ బ్యాంక్ కూడా ఒక ప్రీమియం ఆప్షన్. ఇది అల్యూమినియం బాడీతో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి వచ్చే.. డిటాచబుల్ స్టాండ్ వల్ల ఫోన్ చార్జ్ అవుతున్నప్పుడు హ్యాపీగా సినిమాలు కూడా చూసుకోవచ్చు.

Also Read: ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? స్మార్ట్ కనెక్టివిటీతో అదరగొడుతున్న శామ్‌సంగ్ టాప్ మోడల్స్!

ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

ప్రస్తుతం జనాలు రియల్ టైమ్ యూజ్ ఉన్న గ్యాడ్జెట్స్‌ని ఇష్టపడుతున్నారు. మీకు ఎక్కువ కెపాసిటీ కావాలంటే షియోమీ లేదా యాంబ్రేన్ 20000mAh మోడల్స్ తీసుకోండి. అదే ఆఫీస్ ప్రయాణాలకు లైట్ వెయిట్‌గా కావాలంటే స్పిగెన్ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ లాంటి ప్రీమియం ఫోన్స్ ఉంటే.. మాత్రం మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ చార్జర్స్ వైపు వెళ్లడం మంచిది. మీ అవసరానికి తగ్గట్టు పర్ఫెక్ట్ పవర్ బ్యాంక్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×