E-Paper
Advertisement

బజాజ్, ఉష, కెన్‌స్టార్.. రూ.8 వేల బడ్జెట్‌లో.. ఇల్లంతా కదిలే బెస్ట్ కూలర్లు!

బజాజ్, ఉష, కెన్‌స్టార్.. రూ.8 వేల బడ్జెట్‌లో.. ఇల్లంతా కదిలే బెస్ట్ కూలర్లు!
Advertisement

Portable Coolers: ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రతీసారి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతుంటారు. ఏసీలు కొనేంత బడ్జెట్ లేని వారికి తక్కువ ఖర్చులో ఇల్లంతా చల్లగా మారేందుకు ఎయిర్ కూలర్లు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో రూ.8000 లోపు బడ్జెట్ లో మార్కెట్ లోని టాప్ – 5 బెస్ట్ పోర్టబుల్ కూలర్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ప్రధాన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

బజాజ్ షీల్డ్ గ్లాంజా 30L

బెడ్‌రూమ్, ఆఫీస్ క్యాబిన్ వంటి మీడియం సైజ్ గదులతు ఈ కూలర్ పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలోని 30 లీటర్ల వాటర్ ట్యాంక్.. పదే పదే నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ సమయం చల్లదనాన్ని ఇస్తుంది. యాంటీ బాక్టీరియల్ హనీకాంబ్ ప్యాడ్స్, తక్కువ విద్యుత్ వినియోగం దీని ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.

ఉషా కూల్‌బాయ్ డీఎల్ఎక్స్ కూలర్

Advertisement

35 లీటర్ల ట్యాంక్ కెపాసిటీతో వచ్చే ఈ కూలర్ ఇన్వర్టర్‌పై కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీని శక్తివంతమైన బ్లోయర్ సిస్టమ్.. గది నలుమూలలా వేగంగా గాలిని సరఫరా చేస్తుంది. అలాగే దీని మెయింటెనెన్స్ కూడా చాలా తెలికని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

కెన్‌స్టార్ రోబస్టా నియో 45

ఇది 45 లీటర్ల ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫలితంగా రాత్రంతా నిరంతరాయంగా చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. దీనికున్న 12 అంగుళాల హై-స్పీడ్ ఫ్యాన్.. దాదాపు 35 అడుగుల దూరం వరకు గాలిని ప్రసారం చేస్తుంది. ఎక్కువ కూలింగ్ కావాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

బ్లాక్+డెక్కర్ రెమో 45L

Advertisement

అంతర్జాతీయ బ్రాండ్ అయిన బ్లాక్+డెక్కర్ నుండి వచ్చిన ఈ రెమో 45L కూలర్.. స్టైలిష్ లుక్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. యాంటీ బాక్టీరియల్ హనీకాంబ్ ప్యాడ్స్, కొల్లాప్సిబుల్ లూవర్స్ దీని సొంతం. దీనికి ఉండే రేర్ వీల్ లాక్ సిస్టమ్ వల్ల కూలర్ ఒకే చోట కదలకుండా స్థిరంగా ఉంటుంది.

Also Read: ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం!

సీజీ నోరిస్ 68L డెసర్ట్ కూలర్

పెద్ద గదులకు ఈ కూలర్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. 68 లీటర్ల భారీ ట్యాంక్ సామర్థ్యం ఉన్న ఈ డెసర్ట్ కూలర్.. పెద్ద గదులను సైతం నిమిషాల్లోనే కూల్ చేసేస్తుంది. అధిక ఎండలు ఉండే ప్రాంతాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: ఖాతాదారులకు భారీ షాక్.. జులైలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×