E-Paper
Advertisement

పార్టీ మోడ్ ఆన్.. తక్కువ బడ్జెట్‌లో టాప్-7 పార్టీ స్పీకర్లు, ఈ క్రేజీ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి!

పార్టీ మోడ్ ఆన్.. తక్కువ బడ్జెట్‌లో టాప్-7 పార్టీ స్పీకర్లు, ఈ క్రేజీ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి!
Advertisement

Best Party Speakers: పార్టీ అంటేనే మ్యూజిక్.. ఆ పాటలు ఊపు తెప్పించాలంటే దానికి తగ్గట్టు మంచి స్పీకర్ ఉండాల్సిందే. అయితే అన్ని సందర్భాలకూ ఒకే రకమైన స్పీకర్ సెట్ అవ్వదు. కొందరికి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా పాటలు పాడుకోవడానికి మైక్ ఉన్న స్పీకర్ కావాలి, మరికొందరికి బయట గార్డెన్‌లోనో లేదంటే టెర్రస్ మీదో ఫుల్ సౌండ్‌తో ఎంజాయ్ చేయడానికి వాటర్ ప్రూఫ్, ఎక్కువ బ్యాటరీ వచ్చే స్పీకర్ కావాలి. ఈ నేపథ్యంలో రూ.10వేల నుండి రూ.20వేల లోపు దొరికే టాప్-7 స్పీకర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

boAt PartyPal 390

ఇంట్లోనే చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలి అనుకుంటే.. కళ్లు మూసుకుని బోట్ పార్టీపాల్ 390 కొనుగోలు చేయొచ్చు. దీనికి మైక్ మాత్రమే కాదు.. గిటార్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఇంట్లో చిన్నపాటి మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించుకోవచ్చన్నమాట. 160W పవర్‌తో వచ్చే ఈ స్పీకర్ బర్త్‌డేలు, కరోకే నైట్స్‌కు సూపర్ ఛాయిస్. ఇది సుమారు 6 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ప్లే అవుతుంది. మార్కెట్లో రూ.10వేల లోపు దొరికే ది బెస్ట్ ఆప్షన్స్‌లో ఇది కూడా ఒకటి.

JBL PartyBox

Advertisement

బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ బ్రాండ్ వాల్యూ ఉండాలి. సౌండ్ క్వాలిటీలో రాజీ పడకూడదు అనుకుంటే.. జేబీఎల్ పార్టీ బాక్స్ ఎన్‌కోర్ ఎసెన్షియల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో 100W సౌండ్‌తో పాటు మ్యూజిక్‌కు తగ్గట్టుగా మారే లైటింగ్ అదనపు ఆకర్షణ. ఇది వాటర్ రెసిస్టెంట్ కాబట్టి.. పూల్ పార్టీల దగ్గర కూడా హాయిగా వాడుకోవచ్చు. దాదాపు రూ.18వేల ధర ఉండే ఈ స్పీకర్ ఇచ్చే ప్రీమియం ఫీలింగే వేరు.

Also Read: లాంచ్‌కు ముందే Vivo X300 FE ధర లీక్.. ఈ ‘అర్బన్ ఆలివ్’ లుక్ చూస్తే ఐఫోన్ కూడా పక్కకు తప్పుకోవాల్సిందే!

GOVO GoLoud 980

Advertisement

తక్కువ రేటులో కొంచెం పవర్ ఫుల్ సౌండ్ కావాలనుకునే వారికి గోవో గోలౌడ్ 980 మంచి ఆల్టర్నేటివ్. బోట్ స్పీకర్ కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ (రూ.13,000) పెట్టగలిగితే.. పెద్ద సైజు పార్టీ స్పీకర్ కావాలనుకునే వారికి ఇది బాగా సెట్ అవుతుంది. చూడటానికి కూడా ఇది చాలా స్టైలిష్‌గా ఉండి, పార్టీ మూడ్‌ను పెంచుతుంది.

Zebronics Sound Feast 800

తక్కువ ధరలో మంచి పార్టీ స్పీకర్ కావాలనుకుంటే.. జెబ్రోనిక్స్ బెస్ట్ ఆప్షన్. జస్ట్ రూ.8,500 లోపే దొరికే ఈ స్పీకర్ 55W అవుట్‌పుట్‌ను ఇస్తుంది. దీనితో పాటు ఒక వైర్‌లెస్ మైక్ కూడా వస్తుంది కాబట్టి.. చిన్న చిన్న పార్టీలు చేసుకునే వారికి ఇది సూపర్ డీల్. తక్కువ ఖర్చులో అన్ని బేసిక్ ఫీచర్లు ఉన్న స్పీకర్ కోసం చూసే వారికి ఇది సరైన ఎంపిక.

Zebronics Thump 700

పెద్ద పెద్ద ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటే.. ఈ జెబ్రోనిక్స్ తంప్ 700 కరెక్ట్. ఇది కేవలం స్పీకర్ మాత్రమే కాదు.. దీనికి వీల్స్ కూడా ఉంటాయి కాబట్టి.. ఎక్కడికైనా ఈజీగా లాక్కెళ్లొచ్చు. రెండు వైర్‌లెస్ మైక్‌లు, గిటార్ ఇన్పుట్ వంటి ఫీచర్లతో ఇదొక చిన్నపాటి మినీ పీఏ సిస్టమ్‌లా పనిచేస్తుంది. దీని ధర రూ.25,000 వరకు ఉన్నప్పటికీ.. పెద్ద ఈవెంట్‌లకు ఇది ఇచ్చే రేంజ్ మామూలుగా ఉండదు.

Portronics Iron Beats IV

స్పీకర్‌ను రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవాలి, బేస్ అదిరిపోవాలి అనుకుంటే.. పోర్ట్రానిక్స్ ఐరన్ బీట్స్ IV తీసుకోవచ్చు. దీని 250W పవర్ అంటే ఊహించుకోండి.. సౌండ్ ఎలా ఉంటుందో. రూ.12వేల ధరలో దొరికే ఈ స్పీకర్‌లో డ్యూయల్ సబ్‌వూఫర్లు ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువగా ఉన్నా.. సౌండ్‌లో మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుంది.

Boat PartyPal 65 Pro

చాలా తక్కువ బడ్జెట్‌లో దొరికే మరో మంచి ఆప్షన్ బోట్ పార్టీపాల్ 65 ప్రో. కేవలం రూ.5వేల లోపే వచ్చే ఈ స్పీకర్ 42W సౌండ్‌ను ఇస్తుంది. దీనితో పాటు కూడా మైక్ వస్తుంది కాబట్టి.. ఇంట్లో పిల్లలు, పెద్దలు సరదాగా పాటలు పాడుకోవడానికి చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ హంగామా లేకుండా, సింపుల్‌గా పార్టీని ఎంజాయ్ చేసే వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది.

Also Read: కొత్త ఏసీ కొంటున్నారా? ఈ 3 తప్పులు చేస్తే మీ డబ్బులు గోవిందా, సరైన ఏసీని ఇలా ఎంచుకోండి! 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×