// // Best party speakers under 12000: రూ.12 వేలలోపు బెస్ట్ పార్టీ స్పీకర్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు కేక పుట్టించే సౌండ్! -->
E-Paper
Advertisement

రూ.12 వేలలోపు బెస్ట్ పార్టీ స్పీకర్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు కేక పుట్టించే సౌండ్!

రూ.12 వేలలోపు బెస్ట్ పార్టీ స్పీకర్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు కేక పుట్టించే సౌండ్!
Advertisement

Best party speakers under 12000: వీకెండ్ వచ్చిందంటే చాలు.. వారం మొత్తం పడ్డ అలసటను మర్చిపోవడానికి ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ ప్లాన్ చేసుకుంటాం. కానీ గట్టిగా బేస్ ఇచ్చే మ్యూజిక్ సిస్టమ్ లేకపోతే ఆ పార్టీ బోర్ కొట్టేస్తుంది. అందుకే మీ బడ్జెట్ రేంజ్‌లో, హోమ్ పార్టీలను క్లబ్ లాగా మార్చేసేలా రూ.12,000 లోపు దొరికే టాప్ 5 లేటెస్ట్ పార్టీ స్పీకర్ల వివరాలు మీకోసం తీసుకొచ్చాం. అదిరిపోయే డిజైన్, వైర్‌లెస్ మైక్, డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేసే సౌండ్‌తో ట్రెండ్ అవుతున్న ఆ స్పీకర్స్ ఏంటో చూసేయండి.

వీకెండ్ రచ్చ కోసం పార్టీ స్పీకర్స్!

మ్యూజిక్ లవర్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా.. ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అవుతూ డిజైన్ చేసిన బెస్ట్ స్పీకర్స్ లిస్ట్

Advertisement

1. boAt PartyPal 320 (120W RMS Sound):
బోట్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్పీకర్ ప్రస్తుత మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఇందులో 120W RMS పవర్‌ఫుల్ సౌండ్ ఉంటుంది. ఇంటి లోపల అయినా.. ఓపెన్ టెర్రస్ పైన అయినా సరే దీని బేస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని క్రేజీ ఫ్లేమ్ ఎల్‌ఈడీలైటింగ్, మైక్ సపోర్ట్ చాలా బాగుంటాయి. అంతే కాకుండా.. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 12 గంటల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.

2. Zebronics Party Fyre 700 (120W):
మీకు బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, ట్రెండీ లుక్ కావాలంటే జెబ్రోనిక్స్ బెస్ట్ ఆప్షన్. లేటెస్ట్ బ్లూటూత్ v5.3 కనెక్టివిటీతో ఇది వస్తుంది. దీని బిల్ట్ క్వాలిటీ చాలా రగ్గడ్‌గా ఉంటుంది. 9 రకాల ఆర్‌జిబి లైటింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇవి పార్టీ వైబ్‌ను పెంచుతాయి. దీంతో పాటు వైర్‌లెస్ మైక్ ఉచితంగా వస్తుంది. గిటార్ ఇన్పుట్ కూడా ఉంది. కాబట్టి లైవ్ మ్యూజిక్ ప్లే చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్.

Advertisement

3. boAt PartyPal 300 (70W RMS):
కొద్దిగా తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ క్వాలిటీ కావాలనుకునే.. వారికి బోట్ పార్టీపాల్ 300 మంచి ఛాయిస్. ఇది పోర్టబుల్ డిజైన్‌తో వస్తుంది. అంటే హ్యాండిల్‌ పట్టుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీతో స్పష్టమైన వాయిస్ వస్తుంది. హై వాల్యూమ్‌లో కూడా ఆడియో డిస్టార్షన్ ఉండదు. 6 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. చిన్న రూమ్ పార్టీలకు ఇది అల్టిమేట్.

4. GOBOULT Partybox X200 (160W):
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సరికొత్త బ్రాండ్ ఇది. ఏకంగా 160W పవర్ అవుట్‌పుట్‌తో వస్తుండటంతో సౌండ్ చాలా లౌడ్‌గా ఉంటుంది. పెద్ద హాల్స్‌లో కూడా థియేటర్ ఎఫెక్ట్ ఇస్తుంది. 5 రకాల ఈక్వలైజర్ (EQ) మోడ్స్ ఉన్నాయి. మీకు నచ్చినట్లు బేస్, ట్రెబుల్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని డైనమిక్ ఎల్‌ఈడీ ప్యానెల్ పార్టీ రూమ్‌కు మంచి కలర్‌ఫుల్ లుక్ ఇస్తుంది.

Also Read: రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ గురూ!

5. SnapUp Groove Z Pro (50W High Bass):
తక్కువ ధరలోనే ఎక్కువ పంచ్ ఇచ్చే స్పీకర్ ఇది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే, బేస్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డీప్ బేస్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. దీని కాంపాక్ట్ సైజ్, టైప్-సి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. ఇది బ్యాచ్‌లర్స్ రూమ్స్, చిన్నపాటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు, ట్రావెలింగ్‌లో వెంట తీసుకెళ్లడానికి ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

మీరు స్పీకర్ కొనేటప్పుడు కేవలం వాట్స్ మాత్రమే కాకుండా, ‘RMS Output’ ఎంత ఉందో చూసుకోవాలి. RMS ఎక్కువగా ఉంటేనే సౌండ్ క్లారిటీగా, బేస్ పంచ్‌గా వస్తుంది. పైనున్న 5 స్పీకర్లు ఈ ఫార్ములాకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. మరింకెందుకు ఆలస్యం, మీ నెక్స్ట్ వీకెండ్ గెట్-టు-గెదర్ కోసం వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×