E-Paper
Advertisement

మీ ఇల్లు సేఫ్‌గా ఉండాలా ? ఈ కెమెరాలపై ఓ లుక్కేయండి!

మీ ఇల్లు సేఫ్‌గా ఉండాలా ? ఈ కెమెరాలపై ఓ లుక్కేయండి!
Advertisement

Best Outdoor Security Cameras 2026: ఈ రోజుల్లో ఇల్లు సేఫ్‌గా ఉండటం కంటే మరేం కావాలి చెప్పండి? మనం ఊరెళ్లినా, ఆఫీస్‌లో ఉన్నా మన ఇంటిని కనిపెట్టుకుని ఉండే నమ్మకమైన ‘మూడో కన్ను’ అవుట్‌డోర్ సెక్యూరిటీ కెమెరా. టెక్నాలజీ మారే కొద్దీ దొంగతనాల తీరు కూడా మారింది. అందుకే మీ హోమ్ ప్రొటెక్షన్ కోసం నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫీచర్లు, కలర్ నైట్ విజన్, సోలార్ పవర్‌తో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ అవుట్‌డోర్ హోమ్ సెక్యూరిటీ కెమెరాల గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ అవుట్‌డోర్ సెక్యూరిటీ కెమెరాలు:

Advertisement

టెక్నాలజీ పరంగా ఈ ఏడాది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. పాత కాలం నాటి బ్లర్ పిక్చర్స్ ఇచ్చే సీసీ కెమెరాల రోజులు పోయాయి. ఇప్పుడు వస్తున్న కెమెరాలలో మనుషులకు, జంతువులకు, అలాగే డెలివరీ బాయ్స్‌కి మధ్య తేడాను గుర్తించే ‘AI ఇంటెలిజెన్స్’ వచ్చేసింది. ఈ ఏడాది పాపులర్ అయిన కొన్ని బెస్ట్ అవుట్‌డోర్ కెమెరాలు..

1. EufyCam S3 Pro:
ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న కెమెరాలలో EufyCam S3 Pro టాప్‌లో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది మాక్స్ కలర్ విజన్్ టెక్నాలజీతో వస్తుంది. అంటే అర్ధరాత్రి కారుచీకట్లో కూడా పగటిపూట లాంటి కలర్ ఫుల్ 4K వీడియోలను రికార్డ్ చేస్తుంది. పైగా దీనికి సోలార్ ప్యానెల్స్ ఉండటం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ అస్సలు ఉండదు. ఎలాంటి మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు లేకుండా లోకల్ స్టోరేజ్ ఆప్షన్ ఇవ్వడం దీని ప్లస్ పాయింట్.

Advertisement

2. SimpliSafe Outdoor Camera:
మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే అలర్ట్ చేయడానికి సింప్లీ సేఫ్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న ప్రొటెక్షన్ ద్వారా లైవ్ ఏజెంట్లు మీ కెమెరాను మానిటర్ చేస్తారు. ఎవరైనా దొంగలు వస్తే కెమెరా స్పీకర్ ద్వారా “పోలీసులు వస్తున్నారు.. వెళ్ళిపోండి” అని లైవ్‌లో హెచ్చరిస్తారు. దొంగతనం జరగక ముందే ఆపడానికి ఇది బెస్ట్ చాయిస్.

Also Read: స్మార్ట్ వాషింగ్ మెషీన్ కొంటున్నారా? 20 ఏళ్ల మోటార్ వారంటీతో పవర్‌ఫుల్ మోడల్స్‌

3. Google Nest Cam (Outdoor/Battery):
గూగుల్ హోమ్ ఎకోసిస్టమ్ వాడేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్. దీని ఫేషియల్ రికగ్నిషన్ (మనుషుల ముఖాలను గుర్తుపట్టే విధానం) చాలా అక్యూరేట్‌గా ఉంటుంది. మీ ఇంట్లోకి వచ్చేది మీ నైబరా లేక కొత్తవారా అనేది ఇది ఈజీగా కనిపెడుతుంది. దీని వీడియో క్వాలిటీ, ఆడియో క్లారిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.

4. Ring Spotlight Cam Pro:
అమెజాన్ అలెక్సా సపోర్ట్‌తో వచ్చే ఈ కెమెరాలో మోషన్ డిటెక్షన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరైనా మీ కాంపౌండ్‌లోకి రాగానే దీనికి ఉన్న బ్రైట్ స్పాట్‌లైట్ ఆన్ అయిపోతుంది. సైరన్ మోగుతుంది. వైర్డ్, బ్యాటరీ, సోలార్.. ఇలా అన్ని వేరియంట్లలో ఇది లభిస్తుంది.

హోమ్ సెక్యూరిటీ కెమెరా కొనాలనుకుంటే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు.. అందులో ఏఐ అలర్ట్స్, నైట్ విజన్ క్లారిటీ, బ్యాటరీ లైఫ్ ఎలా ఉన్నాయో చూసుకోవడం ముఖ్యం. మీ ఇల్లు ఎల్లప్పుడూ సేఫ్‌గా ఉండాలంటే పైన పేర్కొన్న కెమెరాలలో మీ బడ్జెట్‌కు తగ్గదాన్ని ఎంచుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×