E-Paper
Advertisement

Best Watches for Men: ఫార్మల్ అయినా క్యాజువల్ అయినా ఈ అనలాగ్ వాచీలతో.. మీ లుక్ అదిరిపోవడం గ్యారెంటీ బాస్!

Best Watches for Men: ఫార్మల్ అయినా క్యాజువల్ అయినా ఈ అనలాగ్ వాచీలతో.. మీ లుక్ అదిరిపోవడం గ్యారెంటీ బాస్!
Advertisement

Best Watches for Men: ప్రస్తుతం స్మార్ట్ వాచీలలో ఎన్ని మోడల్స్ వచ్చినా,’అనలాగ్ వాచీ’ ఇచ్చే క్లాసిక్ లుక్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక చక్కని అనలాగ్ వాచ్ పురుషుల అందానికి పరిపూర్ణతను ఇస్తుంది. స్టైల్‌తో పాటు కంఫర్ట్ కూడా ముఖ్యమే కాబట్టి.. వాచ్ ఎంచుకునేటప్పుడు డయల్ సైజు, స్ట్రాప్ మెటీరియల్, బ్రాండ్ నాణ్యతను గమనించాలి. టైటాన్, కాసియో, ఫాస్ట్రాక్ వంటి బ్రాండ్లు తక్కువ ధరలోనే అద్భుతమైన డిజైన్లను అందిస్తున్నాయి. మీ రోజువారీ అవసరాలకు, పర్సనాలిటీకి సరిపోయే సరైన అనలాగ్ వాచ్ గురించి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి బట్టలు ఎంత ముఖ్యమో, అతను పెట్టుకునే వాచ్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా పురుషుల విషయంలో.. వాచ్ అనేది కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాదు, అది వారి హోదాను, అభిరుచిని ప్రతిబింబిస్తుంది. అందుకే ఎందరో సెలబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు అందరూ అనలాగ్ వాచీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

Advertisement

అనలాగ్ వాచీలే ఎందుకు ఎంచుకోవాలి ?

స్మార్ట్ వాచీలలా వీటికి రోజూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. పెళ్లిళ్లు, ఆఫీసు మీటింగ్స్ లేదా క్యాజువల్ పార్టీలు.. ఇలా సందర్భం ఏదైనా అనలాగ్ వాచ్ ఇట్టే సెట్ అయిపోతుంది.

Advertisement

స్టైల్, కంఫర్ట్ కోసం ముఖ్యమైన చిట్కాలు:

1. డయల్ సైజు , షేప్: మీ మణికట్టు సైజును బట్టి డయల్ ఎంచుకోవాలి. సన్నని మణికట్టు ఉన్నవారు పెద్ద డయల్ వాచీలు పెట్టుకుంటే భారంగా అనిపిస్తాయి. సాధారణంగా 38mm నుంచి 42mm డయల్ సైజు చాలా మందికి కంఫర్ట్‌గా ఉంటుంది. రౌండ్ డయల్ ఎప్పుడూ సేఫ్ ఆప్షన్, కానీ కొత్తగా ట్రై చేయాలనుకుంటే స్క్వేర్ లేదా రెక్టాంగిల్ డయల్స్ ట్రై చేయవచ్చు.

2. స్ట్రాప్ మెటీరియల్ : కలర్ ,మెటీరియల్ వాచ్ అందాన్ని మారుస్తాయి.

లెదర్ స్ట్రాప్స్: ఇవి క్లాసికల్, ఫార్మల్ లుక్ ఇస్తాయి. బ్రౌన్ లేదా బ్లాక్ లెదర్ వాచీలు సూట్లు , ఫార్మల్ షర్టులపైకి అద్భుతంగా ఉంటాయి.

మెటల్ చైన్ వాచీలు: ఇవి చాలా కాలం మన్నికగా ఉంటాయి. సిల్వర్ లేదా గోల్డ్ ఫినిషింగ్ ఉన్న చైన్ వాచీలు రిచ్ లుక్ ఇస్తాయి.

సిలికాన్ లేదా ఫ్యాబ్రిక్: ఇవి క్యాజువల్ వేర్ స్పోర్టి లుక్ కోసం బాగుంటాయి. ధరించడానికి చాలా తేలికగా ఉంటాయి.

3. క్వార్ట్జ్ వర్సెస్ ఆటోమేటిక్: చాలా వరకు అనలాగ్ వాచీలు ‘క్వార్ట్జ్’ టెక్నాలజీతో వస్తాయి. ఇవి బ్యాటరీతో పనిచేస్తాయి. చాలా కచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. అదే ‘ఆటోమేటిక్’ వాచీలు మీ చేతి కదలికల ద్వారా నడుస్తాయి. ఇవి కొంచెం ఖరీదైనవి అయినా.. వాచ్ ప్రియులకు ఇవి చాలా ఇష్టం.

Also Read: ఈ రేంజ్‌‌లో ఫీచర్లా ? వన్ ప్లస్ 16 లీక్డ్ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న కొన్ని బ్రాండ్లు:

కాసియో : ఎడ్జిఫైస్ సిరీస్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

టైటాన్ : ఇండియన్ మార్కెట్‌లో నమ్మకమైన బ్రాండ్. వీరి ‘ఎడ్జ్’ సిరీస్ వాచీలు చాలా సన్నగా, స్టైలిష్‌గా ఉంటాయి.

ఫాస్ట్రాక్: యూత్ కోసం ట్రెండీ మరియు అఫర్డబుల్ డిజైన్లకు ఇది కేరాఫ్ అడ్రస్.

ఫాసిల్ : వింటేజ్ లుక్ ఇష్టపడే వారికి ఫాసిల్ బెస్ట్ ఛాయిస్.

మీ వాచ్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వాటర్ రెసిస్టెంట్ అని ఉన్నప్పటికీ.. నీటికి దూరంగా ఉంచడం మేలు. లెదర్ స్ట్రాప్స్ అయితే తడి తగలకుండా చూసుకోవాలి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×