E-Paper
Advertisement

మీ పేరెంట్స్‌కు ఫోన్ కావాలా? యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ ఉన్న.. బెస్ట్ ఫ్లిప్, కీప్యాడ్ మెుబైల్స్ ఇవే!

మీ పేరెంట్స్‌కు ఫోన్ కావాలా? యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ ఉన్న.. బెస్ట్ ఫ్లిప్, కీప్యాడ్ మెుబైల్స్ ఇవే!
Advertisement

Keypad Phones 2026: ఒకప్పుడు మెుబైల్ అనగానే కీప్యాడ్ ఫోన్లే అందరికీ గుర్తుకువచ్చేవి. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ స్మార్ట్ ఫోన్స్ యుగంలోనే ఇంకా ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే వీటిలో గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ వంటి స్మార్ట్ ఫీచర్లు సైతం ఇన్ బిల్ట్ గా వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ కు బదులు తల్లిదండ్రులకు మంచి ఫీచర్ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికోసం.. మార్కెట్ లోని బెస్ట్ కీప్యాడ్, ఫ్లిప్ ఫోన్లను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

Nokia 2780 Flip

ఫీచర్ల ఫోన్ విభాగంలో నోకియాకు మంచి గుడ్ విల్ ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీ ఆధునిక ఫీచర్లు కలిగిన కీప్యాడ్, ఫ్లిప్ ఫోన్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన Nokia 2780 Flip బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఇది KaiOS 3.1 వెర్షన్ తో పనిచేస్తుంది. యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. 5 MP కెమెరా, USB టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ ను దీనికి అందించారు.

Nokia 2760 Flip

Advertisement

పైన పేర్కొన్న ఫ్లిప్ ఫోన్ కు బెడ్జెట్ వెర్షన్ గా నోకియా ఈ ఫోన్ తీసుకొచ్చింది. ఇందులోనూ యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. అయితే ఫోన్ స్టోరేజ్ ను పెంచుకునేందుకు అవసరమైన ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఇందులో ఉండదు.

TCL Flip 2

టీసీఎల్ కంపెనీకి చెందిన ఈ లేటెస్ట్ ఫ్లిప్ మెుబైల్.. మంచి బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంది. 1850 mAh బ్యాటరీతో ఈ సెగ్మెంట్ లో మిగిలిన వాటికంటే మెరుగైన బ్యాటరీ లైఫ్ ను ఇది అందిస్తుంది. ఇందులో కూడా యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించుకోవచ్చు.

Nokia 6300 4G

Advertisement

ఫ్లిప్ మోడల్ కాకుండా సంప్రదాయబద్దమైన కీప్యాడ్ మెుబైల్ ను కోరుకుంటే నోకియాకు చెందిన దీనిని ట్రై చేయవచ్చు. ఈ బటన్స్ ఫోన్ సైతం.. యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ఈ యాప్స్ ముందే ఫోన్ లో ఇన్ స్టాల్ వస్తాయి.

Nokia 8110 4G

నోకియాకు చెందిన యూనిక్ డిజైన్ మెుబైల్.. బనానా ఫోన్ గా బాగా పాపులర్ అయ్యింది. ఇది పాత డిజైన్ అయిన్పపటికీ.. 4G సపోర్ట్, గూగుల్ సర్వీసెస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. KaiOS, స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ వర్క్ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 2MP కెమెరా, 25 రోజుల బ్యాటరీ లైఫ్ ను ఈ ఫోన్ అందిస్తుంది.

Also Read: మోస్ట్ ట్రెండింగ్ ఫోన్.. HD+ స్క్రీన్, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. బడ్జెట్‌లో ది బెస్ట్ భయ్యా!

Alcatel Go Flip 4

స్ట్రాంగ్ బాడీతో వచ్చిన ఫ్లిప్ మెుబైల్ కోరుకుంటే.. ఆల్కాటెల్ గో ఫ్లిప్ 4 ను ట్రై చేయవచ్చు. ఇది యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. 2.8 అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 1.44 అంగుళాలసెకండరీ స్క్రీన్ ను ఇది కలిగి ఉంది. అలాగే USB టైప్-సి ఛార్జింగ్, KaiOS 3.0, బేసిక్ స్మార్ట్ ఫోన్ యాప్స్ తో ఈ ఫోన్ లభిస్తుంది.

Also Read: షావోమీ మైండ్ బ్లోయింగ్ ఏసీ లాంచ్.. మనుషులు ఎక్కడ ఉన్నారో.. గుర్తించి మరీ కూలింగ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×