E-Paper
Advertisement

కిచెన్ పని చిటికెలో అయిపోవాలా? స్మార్ట్ కిచెన్ కోసం మోడ్రన్ మిక్సీలు

కిచెన్ పని చిటికెలో అయిపోవాలా? స్మార్ట్ కిచెన్ కోసం మోడ్రన్ మిక్సీలు
Advertisement

Best mixer grinder under 7000: ఇండియన్ కిచెన్ లో ఘాటైన మసాలాలు నూరాలన్నా, ఇడ్లీ-దోస పిండి రుబ్బాలన్నా ఒక పవర్‌ఫుల్ మిక్సీ గ్రైండర్ ఉండాల్సిందే! లేదంటే వంటగదిలో సగం టైమ్ అక్కడే వృథా అవుతుంది. అయితే, మార్కెట్లో వందల ఆప్షన్స్ ఉండటంతో ఏది బెస్ట్ అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మీ కన్‌ఫ్యూజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, మహిళల నమ్మకాన్ని గెలుచుకున్న రూ.5,000 నుంచి రూ. 7,000 లోపు లభించే టాప్ 5 హెవీ డ్యూటీ మిక్సీల లిస్ట్..

కిచెన్‌ను స్మార్ట్‌గా మార్చే టాప్ 5 మిక్సీలు:

రోజూ గట్టి పచ్చళ్లు, గరం మసాలాలు చేసే మన వంటకాలకు కనీసం 750W నుంచి 900W మోటార్ ఉన్న మిక్సీలు చాలా అవసరం. క్వాలిటీ, డ్యూరబిలిటీలో బెస్ట్ అనిపించుకున్న 5 మోడల్స్ ఇవే..

1. సుజాత డైనమిక్స్ 900-వాట్ (Sujata Dynamix DX):

Advertisement

ఇండియన్ కిచెన్స్‌లో సుజాత బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే 900W పవర్‌ఫుల్ మోటార్ అత్యంత గట్టి మసాలాలు, పచ్చళ్లను కూడా కేవలం కొన్ని సెకన్లలోనే స్మూత్ పేస్ట్‌గా మార్చేస్తుంది. ఈ మిక్సీని నిరంతరాయంగా 90 నిమిషాల పాటు రన్ చేసినా మోటార్ త్వరగా వేడెక్కదు. ఇందులో హై-క్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు వస్తాయి, ఇవి రస్ట్ పట్టవు. వీటి ధర సుమారు రూ. 5,600 – రూ.6,200 వరకు ఉంటుంది.

2. ఫిలిప్స్ 750-వాట్ ఫుడ్ ప్రాసెసర్ (Philips HL7707/00):

ఇది కేవలం సాధారణ మిక్సీ మాత్రమే కాదు, వంటగదిలో మీకు సర్వసమర్థుడైన సహాయకుడు. మిక్సింగ్ , గ్రైండింగ్‌తో పాటు కిచెన్ పనులన్నింటినీ ఇది ఈజీ చేస్తుంది. కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం, ఫ్రెష్ జ్యూస్ చేయడం వంటివి చిటికెలో అయిపోతాయి. దీని జార్ల నుంచి లిక్విడ్స్ బయటకు రాకుండా లాకింగ్ సిస్టమ్ అద్భుతంగా ఉంటుంది. కాగా ధర సుమారు రూ.6,500 -రూ.6,900 వరకు ఉంటుంది.

3. ప్రీతి జోడియాక్ 750-వాట్ (Preethi Zodiac MG-218):

Advertisement

సౌత్ ఇండియాలో ప్రీతి బ్రాండ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిలోని వెగా W5 మోటార్ హెవీ డ్యూటీ గ్రైండింగ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇడ్లీ, దోస పిండిని ఇది చాలా సాఫ్ట్‌గా రుబ్బుతుంది. మీ కిచెన్‌కు ప్రీమియం లుక్ ఇచ్చేలా దీని బాడీ డిజైన్ ఉంటుంది. అంతే కాకుండా బట్టర్, పచ్చళ్ల కోసం వేర్వేరు స్పీడ్ సెట్టింగ్స్ దీనిలో అందుబాటులో ఉన్నాయి. ధర సుమారు రూ.6,800 – రూ.7,200 వరకు ఉంటుంది.

Also Read: స్మార్ట్ ఫీచర్స్, అదిరిపోయే బేస్.. మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హోమ్ ఆడియో సిస్టమ్స్!

4. బాష్ ట్రూమిక్స్ ప్రో 1000-వాట్ (Bosch TrueMixx Pro):

మీకు పక్కా పల్లెటూరి రోటి పచ్చడి రుచి కావాలా? అయితే బాష్ ట్రూమిక్స్ ప్రో బెస్ట్ ఛాయిస్. దీనిలోని ప్రత్యేకమైన టెక్నాలజీ మసాలాల సహజ సిద్ధమైన నూనెల సువాసనలు కోల్పోకుండా గ్రైండ్ చేస్తుంది. రోట్లో దంచినట్లుగా ఉండేలా దీని బ్లేడ్స్ డిజైన్ చేయబడ్డాయి. ఇదిలా ఉంటే.. ఇది కమర్షియల్ రేంజ్ పవర్‌తో వస్తుంది కాబట్టి ఎంత లోడ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. దీని ధర సుమారు రూ.6,200 – రూ.6,700 వరకు ఉంటుంది.

5. బాష్ ట్రూమిక్స్ బోల్డ్ 750-వాట్ (Bosch TrueMixx Bold):

మీకు బాష్ బ్రాండ్ క్వాలిటీ కావాలి, కానీ తక్కువ బడ్జెట్‌లో అనుకుంటే ఈ 750W మోడల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. తక్కువ శబ్దంతో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వడం దీని స్పెషాలిటీ. మిక్సీ జార్ కింద ఉండే కప్లర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి, త్వరగా అరిగిపోవు. అంతే కాకుండా వీటి జార్ మూతలు గట్టిగా లాక్ అవ్వడం వల్ల మిక్సీ తిరిగేటప్పుడు చేత్తో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉంటే వీటి ధర సుమారు రూ.5,100 – రూ.5,500 వరకు ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×