E-Paper
Advertisement

బట్టలు తళతళలాడాల్సిందే.. నీళ్లు సేవ్ అవ్వాల్సిందే! మీ కోసం బెస్ట్ వాషింగ్ మెషీన్లు

బట్టలు తళతళలాడాల్సిందే.. నీళ్లు సేవ్ అవ్వాల్సిందే! మీ కోసం బెస్ట్ వాషింగ్ మెషీన్లు
Advertisement

High efficiency washing machine: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది కామన్‌గా మారిపోయింది. కానీ.. చాలా మందిని వేధించే సమస్య ఒక్కటే..వాషింగ్ మెషీన్ వేస్తే చాలు నీళ్లు ఎక్కువగా ఖర్చవుతాయి. అంతే కాకుండా కరెంట్ బిల్లు మోత మోగుతుంది. మీకూ ఇదే ప్రాబ్లం ఉందా? అయితే మీరు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన టైం వచ్చింది.

ప్రస్తుతం ఇప్పుడు అందరూ High-Efficiency (HE) Wash Systems వైపే మొగ్గు చూపుతున్నారు. ఇవి తక్కువ నీటిని వాడుకుంటూనే.. డిటర్జెంట్‌ను పవర్‌ఫుల్‌గా మిక్స్ చేసి బట్టలను డ్యామేజ్ చేయకుండా క్లీన్ చేస్తాయి. అలాంటి టాప్ 5 వాషింగ్ మెషీన్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

1. LG AI Direct Drive Front Load:

Advertisement

ఎల్‌జీ బ్రాండ్ అనగానే నమ్మకం గుర్తొస్తుంది. దీనిలోని AI DD టెక్నాలజీ బట్టల బరువును మాత్రమే కాదు. ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నెస్‌ను కూడా గుర్తించి, దానికి తగినట్లుగా డ్రమ్ మూవ్‌మెంట్స్‌ను సెట్ చేస్తుంది. దీనిలోని 6 మోషన్ టెక్నాలజీ వల్ల ప్రతి చుక్క నీరు సద్వినియోగం అవుతుంది. పర్ఫార్మెన్స్ తగ్గకుండానే వాటర్, కరెంట్ భారీగా ఆదా అవుతాయి.

2. Samsung Ecobubble Wi-Fi Fully Automatic:

శామ్‌సంగ్ ఎకోబబుల్ టెక్నాలజీ ఒక వండర్ అనే చెప్పాలి. ఇది నీటిని, డిటర్జెంట్‌ను కలిపి బబుల్స్‌గా మారుస్తుంది. ఈ బబుల్స్ బట్టల్లోకి చాలా వేగంగా చొచ్చుకుపోయి మొండి మరకలను సైతం ఈజీగా తొలగిస్తాయి. చల్లని నీటితో కూడా ఇది అద్భుతంగా క్లీన్ చేయగలదు. దీని వల్ల వాటర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కరెంట్ చాలా సేవ్ అవుతుంది. పైగా స్మార్ట్‌థింగ్స్ యాప్‌తో ఫోన్ నుంచే ఆపరేట్ చేయొచ్చు.

3. IFB Senator Neo:

Advertisement

ఇండియన్ కండిషన్స్‌కు, ముఖ్యంగా హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) సమస్య ఉన్న ఇళ్లకు IFB బెస్ట్ ఛాయిస్. దీనిలోని ‘Aqua Energie’ టెక్నాలజీ నీటిని సాఫ్ట్ గా మార్చి, డిటర్జెంట్ బాగా కరిగేలా చేస్తుంది. దీని 4D వాష్ సిస్టమ్ డైనమిక్ వాటర్ జెట్స్‌ను వాడుతుంది. తక్కువ నీటితోనే బట్టల మూలమూలలా క్లీన్ అవుతుంది. మీ పట్టుబట్టలు, డెలికేట్ బట్టలకు ఇది కేరాఫ్ అడ్రస్.

4. Bosch 5 Star Inverter Touch Control:

బాష్ వాషింగ్ మెషీన్స్ వాటి బిల్డ్ క్వాలిటీ , పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్. దీనిలోని ‘EcoSilence Drive’ మోటార్ అస్సలు శబ్దం రాకుండా స్మూత్‌గా పని చేస్తుంది. దీనిలోని ‘ActiveWater Plus’ ఫీచర్ చాలా స్మార్ట్. ఇది బట్టల లోడ్‌ను బట్టి కచ్చితంగా ఎంత నీరు కావాలో.. అంత మాత్రమే వాడుకుంటుంది. ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వనివ్వదు.

Also Read: అమేజాన్ ప్రైమ్ డే సేల్.. సగానికి పైగా తగ్గిన టాప్ బ్రాండ్ సౌండ్‌బార్ల ధరలు.. డోంట్ మిస్!

5. Whirlpool 360 Bloomwash Pro :

మీకు ఫ్రంట్ లోడ్ వద్దు. టాప్ లోడ్ మోడలే కావాలి అనుకుంటే వర్ల్‌పూల్ బ్లూమ్‌వాష్ పర్ఫెక్ట్. సాధారణంగా .. టాప్ లోడ్ మెషీన్లు ఎక్కువ నీటిని తీసుకుంటాయి. కానీ ఇది అలా కాదు. దీని హెడ్జ్ టెక్నాలజీ బట్టలను 360 డిగ్రీల కోణంలో బ్లూమ్ లాగా తిప్పుతూ క్లీన్ చేస్తుంది. దీని వల్ల కన్వెన్షనల్ టాప్ లోడర్స్ కంటే దాదాపు 20% వరకు నీరు ఆదా అవుతుంది.

వాషింగ్ మెషీన్ కొనడం అనేది ఒక వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. అందుకే కేవలం ధర తక్కువగా ఉందని కాకుండా.. లాంగ్ రన్‌లో వాటర్, పవర్ బిల్స్ సేవ్ చేసేలా 5-స్టార్ రేటింగ్, High-Efficiency టెక్నాలజీ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం స్మార్ట్ మూవ్. పైన చెప్పిన వాటిలో మీ బడ్జెట్ మరియు ఫ్యామిలీ సైజును బట్టి బెస్ట్ ఆప్షన్‌ను లాక్ చేసేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×