E-Paper
Advertisement

Best Finger Ring Holders: మొబైల్‌ను ఒక్క చేత్తో పట్టుకుని రీల్స్, షార్ట్స్ చూడటం కష్టంగా ఉందా? ఈ గ్యాడ్జెట్స్ మీ కోసమే!

Best Finger Ring Holders: మొబైల్‌ను ఒక్క చేత్తో పట్టుకుని రీల్స్, షార్ట్స్ చూడటం కష్టంగా ఉందా? ఈ గ్యాడ్జెట్స్ మీ కోసమే!
Advertisement

Best Finger Ring Holders: ఇప్పుడున్న కుర్రాళ్లు అన్నం లేకపోయినా బతికేస్తారేమో కానీ, చేతిలో ఫోన్ లేకపోతే మాత్రం పిచ్చెక్కిపోతారంతే. పొద్దున్న నిద్ర లేచిన దగ్గరి నుంచి మొదలయ్యే ఆ స్క్రోలింగ్ యుద్ధం రాత్రి నిద్రపోయే వరకు ఆగదు. అయితే ఒక్క చేత్తో స్టైల్‌గా ఇన్‌స్టా రీల్స్, షార్ట్స్ స్క్రోల్ చేస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ, ఆ ఫోన్ బరువంతా మోస్తూ కింద సపోర్ట్‌గా ఉన్న చిటికెన వేలు పడే తిప్పలు మాటల్లో చెప్పలేనివి.

పాపం.. గంటల కొద్దీ ఆ ఒత్తిడికి వేలు వంకర పోవడం, నొప్పులు పడటం, ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పి ఫోన్ మొహం మీద పడటం లాంటివి ఓ రేంజ్‌లో జరుగుతుంటాయి. అందుకే చిటికెన వేలు పడుతున్న ఈ నరకాన్ని తప్పించి, స్క్రోలింగ్‌ను సులభతరం చేయాలంటే.. ఖచ్చితంగా ఈ క్రేజీ ‘ఫింగర్ గ్యాడ్జెట్స్’ గురించి తెలుసుకోవాల్సిందే.

Finger Ring Holders

Advertisement

ఇవి చిన్న మెటల్ లేదా ప్లాస్టిక్ రింగ్‌ల మాదిరి ఉండి ఫోన్ వెనుక భాగంలో అతుక్కుంటాయి. మన చూపుడు వేలిని ఈ రింగ్‌లో ఉంచడం ద్వారా ఫోన్‌పై గ్రిప్ పెరుగుతుంది. ఇవి 360 డిగ్రీలు తిరుగుతాయి కాబట్టి.. రీల్స్ చూడటానికి లేదా వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ఫోన్‌ను ఏ యాంగిల్‌లోనైనా సెట్ చేసుకోవచ్చు. Lamicall లేదా అమెజాన్ బేసిక్స్ వంటి బ్రాండ్లలో ఇవి రూ.300 నుండి రూ.800 వరకు లభిస్తాయి. లోకల్ షాపుల్లో అయితే కేవలం రూ.200 నుండే అందుబాటులో ఉన్నాయి.

Also Read: స్టాక్ అయిపోయేలోపే కొనేయండి బాసూ.. కేవలం రూ.6,623కే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ!

Loop/ Strong Grip:

Advertisement

ఎక్కువ సేపు ఇన్‌స్టా రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చూసేవాళ్లకి ఈ లూప్ గ్రిప్ సరైన ఎంపిక. ఇవి మెత్తని ఫ్యాబ్రిక్‌తో తయారైన స్ట్రాప్స్. వీటిని తగిలించుకుంటే వేళ్లకు చాలా మృదువుగా ఉండి, ఎంతసేపు పట్టుకున్నా నొప్పి కలగనివ్వవు. ఫోన్ లూప్స్ వంటి బ్రాండ్లలో ఇవి రూ.200 నుంచి రూ.500 మధ్యలో దొరుకుతాయి. ఇవి ఫోన్‌ కేస్‌కు అతుక్కుపోయేలా ఉంటాయి. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ లేదా అబిడ్స్ వంటి మొబైల్ మార్కెట్లలో వీటిని తక్కువ ధరలోనే కొనేయొచ్చు.

Pop Sockets

ఈ పాప్ సాకెట్స్ చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని అవసరమైనప్పుడు బయటకు లాగి వేళ్లతో పట్టుకోవచ్చు. అలాగే పని అయిపోయాక మళ్లీ లోపలికి నొక్కేయొచ్చు. ఇవి ఫోన్‌ను టేబుల్‌పై స్టాండ్‌లా నిలబెట్టడానికి కూడా పనికొస్తాయి. ఒరిజినల్ పాప్ సాకెట్స్ ధర రూ.700 నుండి మొదలవుతుంది. కానీ ఇతర కంపెనీలవైతే రూ.200 నుంచి రూ.500 లోపే ఉంటాయి.

అయితే, మీకు మంచి బ్రాండెడ్ ఫింగర్ గ్రిప్ హోల్డర్స్‌ కావాలనుకుంటే.. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్‌సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్లు MagSafe మోడల్స్‌ను ఎంచుకుంటే ఫోన్‌కు మురికి అంటకుండా వాడుకోవచ్చు. ఏదైనా సేల్ ఉన్నప్పుడు కొంటే ఇంకా తక్కువ ధరకే వచ్చేస్తాయి.

Also Read: ఐఫోన్‌కు చెక్ పెట్టేలా iQOO కొత్త ఫోన్.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5తో భారత్‌లోకి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×