E-Paper
Advertisement

2026లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

2026లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Advertisement

Electric Scooters: ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో సామాన్యులు ఎలక్ట్రిక్ స్కూటర్ల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో వందల సంఖ్యలో బ్రాండెడ్, నాన్-బ్రాండెడ్ మోడల్స్ రావడంతో ఏది ఎంచుకోవాలో తెలియక కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా బ్యాటరీల భద్రత, రేంజ్ తగ్గిపోవడం, సర్వీస్ సెంటర్లు మూతపడటం వంటివి ఈవీ రంగంలో ప్రధాన సవాళ్లుగా మారాయి. 2026 నాటి పరిస్థితుల ప్రకారం కొనుగోలు చేయదగిన టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Read also-Iran Warned Tech Firms: గల్ఫ్‌లో 18 టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్, అలర్టయిన అమెరికా

1. TVS మోటార్స్

Advertisement

భారతదేశంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ TVS. వీరి ‘TVS iQube’ క్లాసిక్ డిజైన్‌తో కుటుంబ అవసరాలకు అద్భుతంగా సరిపోతుంది. ఇక బడ్జెట్ ప్రియుల కోసం తెచ్చిన ‘TVS Orbitar’లో BaaS (Battery as a Service) సిస్టమ్ ఉంది. అంటే, కస్టమర్ కేవలం బండిని మాత్రమే దాదాపు రూ.50,000 కి కొని, బ్యాటరీని కంపెనీ నుండి నెలకు సుమారు రూ.860 రెంట్‌కు తీసుకుని వాడుకోవచ్చు. దేశవ్యాప్తంగా వీరికి బలమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉంది.

2. బజాజ్ చేతక్ (Bajaj Chetak)

మార్కెట్లోని మెజారిటీ స్కూటర్లు ప్లాస్టిక్ బాడీతో వస్తుంటే, బజాజ్ చేతక్ మాత్రం పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, గట్టిదనం కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో ఫీచర్లు తక్కువైనా, 90 నుండి 100 కిమీ స్థిరమైన రేంజ్ ఇస్తుంది. అత్యంత తక్కువ కంప్లైంట్లు ఉన్న స్కూటర్ ఇది.

3. ఏథర్ ఎనర్జీ (Ather Rizta & Ather 450X)

Advertisement

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వడంలో ఈ సంస్థ ముందుంటుంది. వీరి ‘Ather Rizta’ విశాలమైన సీటు, ఎక్కువ బూట్ స్పేస్‌తో వచ్చే పక్కా ఫ్యామిలీ స్కూటర్. అలాగే ‘Ather 450X’ అద్భుతమైన పికప్, టాప్ స్పీడ్‌తో కాలేజ్ యువతకు పర్ఫెక్ట్ ఆప్షన్.

4. హీరో విడా (Hero Vida)

అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి చార్జింగ్ సమస్యను తీర్చడానికి ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్‌ను అందించారు. బ్యాటరీలను సులభంగా విడదీసి ఇంట్లోకి తీసుకెళ్లి చార్జ్ చేసుకోవచ్చు. దీని డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండి, మహిళలను బాగా ఆకట్టుకుంటుంది.

5. రివర్ ఇండియా (River Indie)

బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ స్కూటర్ ని ‘ఈవీల SUV’ అని పిలుస్తారు. పెద్ద టైర్లు, రఫ్ అండ్ టఫ్ బాడీతో రోడ్డుపై దీనికి ప్రత్యేక ప్రెజెన్స్ ఉంటుంది. ఫ్యామిలీ అవసరాలతో పాటు లగేజీ మోయడానికి, డెలివరీ సర్వీసుల వారికి ఇది అత్యంత అనుకూలమైన మల్టీ-పర్పస్ వాహనం.

Read also-ప్రపంచంలో ఎక్కువ బైక్‌లు ఉన్న దేశం ఏదో తెలుసా? భారత్ ఏ స్థానంలో ఉందంటే?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నాన్-బ్రాండెడ్ వాహనాలు వద్దు: ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండే కాలంలో నాన్-బ్రాండెడ్ ఈవీల వల్ల బ్యాటరీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నమ్మకమైన బ్రాండ్లనే ఎంచుకోండి. మీకు ప్రతిరోజూ కనీస ప్రయాణం ఉంటేనే ఎలక్ట్రిక్ వాహనం వర్త్ అవుతుంది. లేదంటే పెట్రోల్ వాహనాలే బెస్ట్. కొనే ముందు మీ ఏరియాలో ఆ కంపెనీ సర్వీస్ ఎలా ఉందో పాత కస్టమర్లను అడిగి తెలుసుకోండి. తప్పకుండా టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×