// // Best coolers under 10000 - బడ్జెట్‌లో.. బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే! -->
E-Paper
Advertisement

Best coolers under 10000: బడ్జెట్‌లో ఏసీ లాంటి చల్లదనం.. 2026 లోరూ.10వేలలోపు బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!

Best coolers under 10000: బడ్జెట్‌లో ఏసీ లాంటి చల్లదనం.. 2026 లోరూ.10వేలలోపు బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!
Advertisement

Best coolers under 10000: 2026 వేసవి కాలం వచ్చేసింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు కొనాలంటే మాత్రం చాలా మందికి బడ్జెట్ సరిపోదు. అలాగని ఫ్యాన్ కింద కూర్చుంటే వేడి గాలి ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో.. మధ్యతరగతి కుటుంబాలకు వరంలా నిలిచేవి ఎయిర్ కూలర్లు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 10,000 లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో (best coolers under 10000) కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. సింఫనీ, బజాజ్, క్రాంప్టన్ వంటి టాప్ బ్రాండ్‌లు తక్కువ కరెంటుతో.. ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే మోడళ్లను లాంచ్ చేశాయి. మీరు మీ బెడ్రూమ్ కోసం లేదా పెద్ద హాల్ కోసం కూలర్ వెతుకుతుంటే.. ఈ విషయాలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.

పెద్ద గదుల కోసం బెస్ట్ డెజర్ట్ కూలర్లు (Desert Coolers):
మీరు ఉండేది పెద్ద హాల్ లేదా 550 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న గది అయితే.. మీకు డెజర్ట్ కూలర్లు సరైన ఛాయిస్. ఇవి ఎక్కువ గాలిని అందిస్తాయి.

Advertisement

1. క్రాంప్టన్ ఓజోన్ డెజర్ట్ ఎయిర్ కూలర్ :
ఇది 75 లీటర్ల పెద్ద ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే హై-డెన్సిటీ హనీకోంబ్ ప్యాడ్స్. ఇవి నీటిని బాగా పీల్చుకుని గాలిని చాలా చల్లగా మారుస్తాయి. ఇందులో హ్యుమిడిటీ కంట్రోల్ ఫీచర్ ఉండటం వల్ల ఉక్కపోత లేకుండా ఎక్కువ చల్లదనాన్ని పొందవచ్చు. పెద్ద రూమ్స్ ఉన్నవారికి ఇది ది బెస్ట్ ఆప్షన్.

2. బజాజ్ షీల్డ్ సిరీస్ ఆర్టియోన్:
బజాజ్ వారి ఈ మోడల్రూ. 9,999 ధరలో లభిస్తోంది. ఇందులో డ్యూరామెరైన్ ప్రో పంప్ వాడారు. అంటే ఇది త్వరగా పాడవదు. దీని గాలి దాదాపు 60 అడుగుల దూరం వరకు వెళ్తుంది. యాంటీ బాక్టీరియల్ ఫీచర్ వల్ల మనకు స్వచ్ఛమైన గాలి అందుతుంది.

Advertisement

3. సింఫనీ సుమో 70L:
సింఫనీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది నాణ్యత. సుమో మోడల్‌లో 70 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఇది i-Pure టెక్నాలజీతో వస్తుంది. అంటే గాలిలోని దుమ్ము, ధూళిని ఫిల్టర్ చేసి మరీ మనకు అందిస్తుంది. సేల్స్ సమయంలో ఇది రూ. 10,000 లోపు దొరుకుతుంది.

బెడ్రూమ్స్ , ఆఫీసుల కోసం టవర్ & పర్సనల్ కూలర్లు:
చాలామందికి బెడ్రూమ్‌లో స్థలం తక్కువగా ఉంటుంది లేదా ఆఫీస్ డెస్క్ పక్కన పెట్టుకోవడానికి కూలర్ కావాలి. అలాంటి వారి కోసం స్లిమ్ డిజైన్ ఉన్న కూలర్లు ఇక్కడ ఉన్నాయి.

1. సింఫనీ డైట్ 50 టి :
మీరు స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉండే కూలర్ కావాలనుకుంటే.. ఇది మీకు నచ్చుతుంది. ఇది కేవలం రూ. 9,004 ధరలో లభిస్తుంది. దీనికి రిమోట్ కంట్రోల్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి పడుకున్న చోటు నుంచే ఆపరేట్ చేయవచ్చు. దీని ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్లు.

2. బజాజ్ షీల్డ్ స్కైవ్ నియోస్:
బడ్జెట్ తక్కువ ఉన్నవారికి (సుమారు రూ. 5,999) ఇది సరైనది. 36 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ కూలర్ చిన్న బెడ్రూమ్స్‌కు సరిపోతుంది. ఇది ఇన్వర్టర్ ఫ్రెండ్లీ, అంటే కరెంటు పోయినా మీ ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ మీద ఇది హాయిగా తిరుగుతుంది.

Also Read: ఫోన్ అమ్మే ముందు 4 స్టెప్స్ ఫాలో అయితే.. డేటా సేఫ్, ధర కూడా బెస్ట్

కూలర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు:
హనీకోంబ్ ప్యాడ్స్: సాధారణ గడ్డి ప్యాడ్ల కంటే.. ఇవి ఎక్కువ కాలం వస్తాయి. చల్లదనాన్ని ఎక్కువగా ఇస్తాయి.

ఐస్ ఛాంబర్: కూలర్‌లో ఐస్ వేసే అవకాశం ఉంటే ఇంకాస్త ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి గాలి వస్తుంది.

ఇన్వర్టర్ కనెక్టివిటీ: సమ్మర్‌లో కరెంటు కోతలు సహజం. కాబట్టి ఇన్వర్టర్‌పై పని చేసే కూలర్లను ఎంచుకోవడం బెస్ట్.

క్లీనింగ్: నీటి ట్యాంక్‌ను వారానికి ఒకసారి క్లీన్ చేయడం వల్ల దోమలు చేరకుండా ఉంటాయి.

2026లో రూ. 10,000 బడ్జెట్ అనేది ఎయిర్ కూలర్ కొనడానికి చాలా మంచి బడ్జెట్. మీరు పెద్ద హాల్ కోసం చూస్తుంటే.. క్రాంప్టన్ ఓజోన్ లేదా బజాజ్ ఆర్టియోన్ తీసుకోండి. అదే బెడ్రూమ్ కోసం అయితే సింఫనీ డైట్ మోడల్ చక్కగా సరిపోతుంది. మీ అవసరాన్ని బట్టి సరైనది ఎంచుకుని ఈ వేసవిని చల్లగా గడిపేయండి.

Also Read: పిల్లల కోసం తప్పకుండా కొనాల్సిన వాచ్..సేఫ్టీ, చదువు, ఫన్ అన్నీ ఒక్క వాచ్‌లోనే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×