E-Paper
Advertisement

చిన్న ఇళ్లకు బెస్ట్ ఛాయిస్..తక్కువ స్థలంలో ఇమిడిపోయే వాషింగ్ మెషీన్లు!

చిన్న ఇళ్లకు బెస్ట్ ఛాయిస్..తక్కువ స్థలంలో ఇమిడిపోయే వాషింగ్ మెషీన్లు!
Advertisement

Best compact washing machines: ఈ రోజుల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిపోవడంతో ఇళ్లలో స్పేస్ చాలా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా బాల్కనీలోనో, బాత్రూమ్ పక్కనో వాషింగ్ మెషీన్ పెట్టాలంటే స్థలం సరిపోక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ.. కేవలం తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ, మొండి మరకలను సైతం చిటికెలో వదిలించే స్మార్ట్, కాంపాక్ట్ వాషింగ్ మెషీన్లు ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీల కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో దుమ్మురేపుతున్న టాప్ 5 కాంపాక్ట్ వాషింగ్ మెషీన్స్ ధరలు , పూర్తి వివరాలు మీకోసం..

చిన్న ఇళ్ల కోసం అదిరిపోయే 5 కాంపాక్ట్ వాషింగ్ మెషీన్లు:

మారుతున్న కాలానికి అనుగుణంగా హోమ్ అప్లయన్సెస్ సైజ్ కూడా స్మార్ట్‌గా మారిపోతోంది. జనం ఇప్పుడు పెద్ద పెద్ద మెషీన్ల కంటే ‘స్పేస్ సేవింగ్’ గ్యాడ్జెట్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీ చిన్న ఇంటికి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే.. బట్టలను మురికి లేకుండా క్లీన్ చేసే టాప్ 5 మోడల్స్..

Advertisement

1. LG 6.5 kg Inverter Fully-Automatic Top Loading Washing Machine:

ఎల్జీ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఇన్వర్టర్ మోడల్ చాలా కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా.. దీనిలోని ‘స్మార్ట్ మోషన్’, ‘టర్బో డ్రమ్’ టెక్నాలజీ వల్ల బట్టలు అస్సలు పాడవకుండా క్లీన్ అవుతాయి. ఇందులో ఉండే ఇన్వర్టర్ మోటార్ వల్ల సౌండ్ చాలా తక్కువగా వస్తుంది. అంతే కాకుండా కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది. దీని ధర రూ.17,490 వరకు ఉంటుంది.

Advertisement

2. Samsung 6.0 kg Inverter 5 Star Top Load Washing Machine:

శాంసంగ్ బ్రాండ్ కి చెందిన ఈ 6 కేజీల వాషింగ్ మెషీన్ చిన్న ఫ్యామిలీస్ కి, బ్యాచిలర్స్ కి ఒక పర్ఫెక్ట్ గాడ్జెట్. దీని విడ్త్ చాలా తక్కువగా ఉండటం వల్ల బాల్కనీ కార్నర్‌లో ఈజీగా సెట్ అయిపోతుంది. దీనిలోని ‘Eco Bubble’ టెక్నాలజీ డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల లోపలి వరకు వెళ్లేలా చేస్తుంది. దీని వల్ల మొండి మరకలు కూడా త్వరగా వదిలిపోతాయి. ధర రూ. 15,990 వరకు ఉంటుంది.

3. Godrej 6.2 Kg Fully-Automatic Top Loading Washing Machine:

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ బిల్డ్ క్వాలిటీ , స్పేస్ సేవింగ్ డిజైన్ కావాలనుకుంటే గోద్రెజ్ సూపర్ ఆప్షన్. దీని 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ వల్ల కరెంట్ చాలా తక్కువగా కాలుతుంది. ఇందులో ఉన్న ‘టర్బో 6 పల్సేటర్’ టెక్నాలజీ బట్టలను 6 వైపులా తిప్పుతూ చేత్తో ఉతికినట్లుగా క్లీన్ చేస్తుంది. దీని కంట్రోల్ ప్యానెల్ కూడా వాటర్ ప్రూఫ్‌గా ఉంటుంది. ధర రూ. 12,990 వరకు ఉంటుంది.

4. Whirlpool 6 Kg Whitemagic Royal Fully-Automatic:

వర్ల్‌పూల్ నుంచి వచ్చిన ఈ వైట్‌మ్యాజిక్ రాయల్ సిరీస్ దాని స్లీక్ లుక్ కి చాలా ఫేమస్. ఇది ఇరుకైన ప్లేస్‌లో కూడా చక్కగా సరిపోతుంది. ఇందులో ‘హార్డ్ వాటర్ వాష్’ ఫీచర్ ఉంది. అంటే మీ ఇంట్లో బోర్ వాటర్ లేదా ఉప్పు నీరు వస్తున్నా సరే, ఇది డిటర్జెంట్‌ను బాగా కరిగించి బట్టలను తెల్లగా ఉతుకుతుంది. తక్కువ నీటితోనే ఎక్కువ క్లీనింగ్ ఇవ్వడం దీని స్పెషాలిటీ. ధర రూ. 14,490 వరకు ఉంటుంది.

5. Panasonic 6 Kg Fully-Automatic Top Loading Washing Machine:పానాసోనిక్ మోడల్స్ వాటి డ్యూరబిలిటీకి (మన్నికకు) పెట్టింది పేరు. ఈ 6 కేజీల కాంపాక్ట్ వాషర్ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు సులువుగా ఒక చోటు నుండి మరో చోటుకి మార్చవచ్చు. దీనిలోని ‘అక్వా బీట్’ వాష్ టెక్నాలజీ బట్టల నాణ్యత దెబ్బతినకుండా లోతైన మురికిని సైతం సున్నితంగా తొలగిస్తుంది. ధర రూ.14,200 వరకు ఉంటుంది.

Also Read: వర్షం పడినా నో టెన్షన్.. ఐఎఫ్‌బీ టర్బో డ్రైయర్‌తో నిమిషాల్లో బట్టలు డ్రై

కాంపాక్ట్ వాషింగ్ మెషీన్ల వల్ల కలిగే లాభాలు:

కాంపాక్ట్ వాషింగ్ మెషీన్లను ఎంచుకునేటప్పుడు ఫుల్లీ-ఆటోమేటిక్ మోడల్స్ బెస్ట్. ఎందుకంటే.. వీటికి డోర్ ఓపెన్ చేయడానికి ముందర అదనపు స్థలం అవసరం లేదు. పైనుండే బట్టలు వేసుకోవచ్చు కాబట్టి ఇరుకైన సందుల్లో కూడా వీటిని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఈ చిన్న సైజ్ వాషింగ్ మెషీన్లు కేవలం స్థలాన్ని మాత్రమే కాదు, మీ డబ్బును కూడా ఆదా చేస్తాయి. పెద్ద మెషీన్లతో.. పోలిస్తే ఇవి తక్కువ నీటిని, తక్కువ డిటర్జెంట్‌ను వాడుకుంటాయి. ఒకరు లేదా ఇద్దరు ఉన్న ఇళ్లకు, లేదా చిన్న అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారికి ఇవి నిజంగానే ఒక వరమని చెప్పవచ్చు.

మీ చిన్న ఇంటికి అందాన్ని ఇస్తూ, బట్టల ఉతికే పనిని సులువు చేసేందుకు ఒక మంచి కాంపాక్ట్ వాషింగ్ మెషీన్ కొనడం అనది వైజ్ డెసిషన్. పైన తెలిపిన 5 మోడల్స్ కూడా మార్కెట్లో బెస్ట్ కస్టమర్ రివ్యూస్ , టాప్ రేటింగ్స్ కలిగి ఉన్నవే. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లలో బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI , ఎక్స్ఛేంజ్ ఆఫర్లను వాడుకుంటే పైన పేర్కొన్న ధరల కంటే ఇంకా తక్కువకే ఇవి లభిస్తాయి. మీ బడ్జెట్, బ్రాండ్ ఇష్టాన్ని బట్టి పర్ఫెక్ట్ మోడల్‌ను ఎంచుకోండి. తక్కువ స్పేస్‌లోనే స్మార్ట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×